E-Paper
Advertisement

Google Pixel 8 Price Cut: రూ.17 వేల డిస్కౌంట్.. ప్రీమియం స్మార్ట్‌ఫోన్.. ఛాన్స్ మిస్ చేసుకోవద్దు!

Google Pixel 8 Price Cut: రూ.17 వేల డిస్కౌంట్.. ప్రీమియం స్మార్ట్‌ఫోన్.. ఛాన్స్ మిస్ చేసుకోవద్దు!
Advertisement

Google Pixel 8: టెక్ మార్కెట్‌లో రోజుకో కొత్త స్మార్ట్‌ఫోన్ విడుదల అవుతుంది. టెక్ ప్రపంచంలోకి ఎన్ని కొత్త ఫోన్లు వచ్చినా ఆపిల్ ఫోన్లను మాత్రం బీట్ చేయలేకపోతున్నాయి. దానికున్న పాపులారిటీని తగ్గించలేకపోతున్నాయి. ఐఫోన్ వాడేవాళ్లని పెద్ద సెలెబ్రిటీల్లాగే చూస్తున్నారు చాలా మంది. ఈ క్రమంలోనే అలాంటి ఫోన్‌కు బాబులాంటి ఫోన్ తయారు చేయాలని భావించి గూగుల్ కంపెనీ పిక్సెల్ ఫోన్లను తీసుకొచ్చింది. ఇప్పటి వరకు 8 మోడళ్లను విడుదల చేసింది. ఇవి చాలా ఖరీదైనవిగా ఉంటాయి.

అయితే తాజాగా గూగుల్ ఫ్లాగ్‌షిప్ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ పిక్సెల్ 8‌పై ఫ్లిప్‌కార్ట్ భారీ ఆఫర్ ప్రకటించింది. పిక్సెల్ ఫోన్లు బెస్ట్ స్టాక్ ఆండ్రాయిడ్ అనుభవాన్ని అందిస్తాయి. ఇందులో కెమెరాలు కచ్చితంగా ఆపిల్ ఫోన్లను బీట్ చేస్తాయి. ఇప్పుడు ఈ ఫోన్‌ను రూ.17 వేల తగ్గింపుతో కొనుగోలు చేసే అవకాశం లభించింది.

Advertisement

Also Read: Motorola Edge 50: మోటో నుంచి కొత్త ఫోన్.. ఫీచర్లు ఓకే.. లాంచ్ ఎప్పుడంటే?

ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫారమ్ ఫ్లిప్‌కార్ట్‌లో కస్టమర్‌ల కోసం పిక్సెల్ 8 అత్యంత తక్కువ ధరకు అందుబాటులో ఉంది. ఈ ఫోన్‌పై బ్యాంక్ ఆఫర్‌లు కూడా ఉన్నాయి. దీని కారణంగా ఫోన్ ధర భారీగా తగ్గుతుంది. అల్యూమినియం ఫ్రేమ్, గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్టెడ్ డిస్‌ప్లే నుండి Google ఇంటర్నల్ టెన్సర్ G3 ప్రాసెసర్ వరకు ప్రతిదీ ఈ ఫోన్‌లో ఉంటుంది.

Advertisement

ఈ విధంగా పిక్సెల్ 8 తక్కువ ధరకు అందుబాటులో ఉంది. ఇది 8GB RAM + 128GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో కూడిన దాని వేరియంట్ ఇప్పుడు ఈ కామర్స్ ప్లాట్‌ఫారమ్ ఫ్లిప్‌కార్ట్‌లో దీని ధర రూ. 63,999గా ఉంది. ఫోన్ అసలు ధర రూ. 75,999. ఎంపిక చేసిన బ్యాంక్ కార్డ్‌లతో నేరుగా రూ. 5000 డిస్కౌంట్ లభిస్తుంది. దీని తర్వాత ఫోన్‌ను రూ. 58,999కి కొనుగోలు చేయవచ్చు.

గూగుల్ ఫోన్‌‌పై రూ. రూ. 17,000 తగ్గింపుతో పాటు, కస్టమర్లు ఎక్స్ఛేంజ్ బెనిఫిట్స్ కూడా పొందవచ్చు. ఎంపిక చేసిన మోడళ్లతో రూ. 3000 అదనపు ఎక్స్ఛేంజ్ బోనస్ అందుబాటులో ఉంటుంది. మీ ఫోన్ పర్ఫామెన్స్, మోడల్ ఆధారంగా గరిష్టంగా రూ. 53,000 వరకు ఎక్స్చేంజ్ డిస్కౌంట్ లభిస్తుంది. హాజెల్, మింట్, రోజ్, అబ్సిడియన్ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ దక్కించుకోవచ్చు.

Also Read: Xiaomi New Mobiles: లేటెస్ట్ టెక్నాలజీ.. షియోమీ నుంచి రెండు ఫోన్లు.. కీలక సమాచారం లీక్!

గూగుల్ Pixel 8 స్పెసిఫికేషన్‌ల విషయానికి వస్తే ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్ 6.2 అంగుళాల ఫుల్ HD ప్లస్ OLED డిస్‌ప్లేను 120Hz రిఫ్రెష్ రేట్‌తో 2000నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. ఇది Google Tensor G3తో Android 14 ఆపరేటింగ్ సిస్టమ్‌ను కలిగి ఉంది. 50MP ప్రైమరీ, 12MP సెకండరీ సెన్సార్‌తో డ్యూయల్ కెమెరా సిస్టమ్ వెనుక ప్యానెల్‌లో అందుబాటులో ఉంది. ముందు 10.5MP సెల్ఫీ కెమెరా చూడొచ్చు. ఈ 5G స్మార్ట్‌ఫోన్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4575mAh బ్యాటరీని కలిగి ఉంది.

Related News

ఐకూ నుంచి క్రేజీ కాంపాక్ట్ టాబ్లెట్.. నెక్ట్స్ జనరేషన్ చిప్‌సెట్‌తో ఎంట్రీ!

ఐఫోన్ యూజర్లకు మెటా బిగ్ ఆఫర్.. ఐక్లౌడ్ లేకున్నా వాట్సప్ చాట్ బ్యాకప్ ఇక ఈజీ!

ఆకాశం నీలం, సూర్యాస్తమయం ఎరుపు.. అంతరిక్షం నలుపు.. అసలేంటీ రంగుల మిస్టరీ?

జస్ట్.. రూ.3,000 లోపే 45 రోజుల బ్యాటరీ బ్యాకప్.. ఐఫోన్ కంటే పవర్‌ఫుల్ టార్చ్‌తో Nokia 4G ఫోన్!

8,100mAh బ్యాటరీ, AI బటన్‌తో హానర్ నుంచి క్రేజీ ఫోన్.. ధరెంతో తెలిస్తే Buy Now నొక్కేస్తారు!

జియో, విఐ బెటర్ అంటున్న యూజర్లు.. ఎయిర్‌టెల్ 5G హాట్‌స్పాట్ బ్యాన్‌పై సోషల్ మీడియాలో ఆగ్రహం!

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ.. గేమర్స్ కోసం నెక్ట్స్ లెవెల్ టాబ్లెట్ వచ్చేసింది!

కెమెరా పక్కనే మరో డిస్‌ప్లే.. ఇన్ఫినిక్స్ కొత్త బడ్జెట్ ఫోన్ లుక్ చూశారా?

Big Stories

Advertisement
×