BigTV English

Motorola Edge 50: మోటో నుంచి కొత్త ఫోన్.. ఫీచర్లు ఓకే.. లాంచ్ ఎప్పుడంటే?

Motorola Edge 50: మోటో నుంచి కొత్త ఫోన్.. ఫీచర్లు ఓకే.. లాంచ్ ఎప్పుడంటే?

Motorola Edge 50: మోటరోలా స్మార్ట్‌ఫోన్‌లు భారతీయ మార్కెట్లో బాగా పాపులర్ అయ్యాయి. కంపెనీ ఇటీవలే మోటరోలా 50 Pro, ఎడ్జ్ 50 అల్ట్రా, ఎడ్జ్ 50 Fusion ఫోన్లను విడుదల చేసింది. Motorola Edge 50 త్వరలో గ్లోబల్ మార్కెట్లలో విడుదలయ్యే అవకాశం ఉంది. స్మార్ట్‌ఫోన్ TDRA, FCC, ECతో సహా అనేక కన్ఫర్మేషన్‌లో సైట్‌లలో కనిపించింది. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) వెబ్‌సైట్‌లో నివేదించినట్లుగా ఇది వీలైనంత త్వరగా విడుదలయ్యే అవకాశం ఉంది. మోటరోలా Edge 50 గతేడాది విడుదలైన  Edge 40కి సక్సెసర్‌గా రాబోతుంది.


Motorola Edge 50 మొబైల్ మోడల్ నంబర్ XT2407-3తో BIS వెబ్‌సైట్‌లో గుర్తించబడింది. ఫోన్  రాబోయే వారం లేదా నెలలో విడుదలయ్యే అవకాశం ఉందని ఇది సూచిస్తుంది. అయితే ఈ ఫోన్‌కు సంబంధించిన వివరాలను మోటరోలా ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. అలా అయితే, ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉంటాయి? ధర ఎంత ఉంటుంది? ఇప్పుడు తెలుసుకుందాం.

Also Read: Xiaomi New Mobiles: లేటెస్ట్ టెక్నాలజీ.. షియోమీ నుంచి రెండు ఫోన్లు.. కీలక సమాచారం లీక్!


Motorola Edge 50 Features
US ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమీషన్ (FCC) వెబ్‌సైట్ కూడా అదే XT2407-3 మోడల్ నంబర్‌తో కనిపించింది. అలానే ఇందులో 68W ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్‌తో 5,000mAh కెపాసిటీ బ్యాటరీని కలిగి ఉండే అవకాశం ఉంది. ఇది Motorola Hello UIతో Android 14పై రన్ అవుతుంది. ఈ ఫోన్‌లో కనెక్టవిటీ కోసం 5G, బ్లూటూత్, GPS, NFC, Wi-Fi 6 ఉన్నాయి.

Motorola Edge 40
ఇది 6.55-అంగుళాల FHD+ 3D కర్వ్డ్ పోలరైజ్డ్ డిస్‌ప్లేను 144Hz రిఫ్రెష్ రేట్‌తో గరిష్టంగా 1,200 nits బ్రైట్‌నెస్‌తో కలిగి ఉంది. Motorola Edge 50 దేశంలో ఇప్పటికే విడుదలైన మోటరోలా Edge 50 Pro, Edge 50 Ultra, Edge 50 Fusion లైనప్‌లో వచ్చే అవకాశం ఉంది. ఇది గత సంవత్సరం విడుదలైన మోటరోలా Edge 40 స్మార్ట్‌ఫోన్‌లో ఉండే అప్‌డేట్‌లను కలిగి ఉంటుంది.

ఈ మొబైల్ MediaTek Dimensity 8020 SoC ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇది 8GB LPDDR4X RAM+ 256GB UFS 3.1 ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది. కెమెరా సెటప్ గురించి మాట్లాడితే 50MP డ్యూయల్ కెమెరా సెటప్, 32MP సెల్ఫీ కెమెరా సెన్సార్ ఉంది. ముందే చెప్పినట్లుగా ఫోన్ 68W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4,400 mAh బ్యాటరీని ప్యాక్ కలిగి ఉంటుంది.

Motorola Edge 40 Price
ప్రస్తుతం Motorola Edge 40 ధర రూ.26,999గా ఉంది. ఇది 8GB RAM + 256GB ఇంటర్నల్ స్టోరేజ్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇది 144Hz రిఫ్రెష్ రేట్‌తో 6.55-అంగుళాల పూర్తి-HD+ (1,080 x 2,400 పిక్సెల్‌లు) పోలరైజ్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 8020 5G ప్రాసెసర్‌ని కలిగి ఉంది. 8GB LPDDR4x RAM + USF 253.GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది.

Also Read: రండి బాబు రండి.. మంచి ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌.. ఆఫర్లు పోతే మళ్లీరావు!

మొత్తంమ్మీద మోటరోలా స్మార్ట్‌ఫోన్‌లు విభిన్నమైన, వినూత్నమైన ఫీచర్లతో మొబైల్ ప్రియులను ఆకర్షించడంలో విజయవంతమయ్యాయి. కంపెనీ ఇప్పటికే మోటరోలా ఎడ్జ్ 50 ప్రో, ఎడ్జ్ 50 ఫ్యూజన్, ఎడ్జ్ 50 అల్ట్రాలను భారతీయ మార్కెట్లలో ఆవిష్కరించింది. ఇప్పుడు మోటరోలా ఎడ్జ్ సిరీస్ నుంచి సరికొత్త ఎడ్జ్ 50 స్మార్ట్‌ఫోన్‌ను త్వరలో విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది.

Related News

GPT 5 vs GPT 4: AI ప్రపంచంలో నెక్ట్ లెవెల్… ఇక ఉద్యోగాలు గోవిందా ?

Redmi Note 14 SE vs Tecno Pova 7 Pro vs Galaxy M36: ఒకే రేంజ్‌లో మూడు కొత్త ఫోన్లు.. ఏది బెస్ట్ తెలుసా?

Trump Tariff Iphone17: భారత్‌పై ట్రంప్ టారిఫ్ బాంబ్.. విపరీతంగా పెరగనున్న ఐఫోన్ 17 ధరలు?

Caviar iphone: అత్యంత ఖరీదైన ఐఫోన్.. రూ.42 లక్షలు ధర.. కొనుగోలు చేయడం అసాధ్యమే?

Infinix GT 30 5G+: రూ.20000 కంటే తక్కువ ధరలో అద్భుత గేమింగ్ ఫోన్.. ఇన్ఫినిక్స్ GT 30 5G+ లాంచ్

Vivo T4R 5G vs iQOO Z10R 5G vs OnePlus Nord CE: 5 ఢీ అంటే ఢీ.. ఈ మూడు ఫోన్లలో ఏది బెస్ట్ తెలుసా?

Big Stories

×