E-Paper
Advertisement

Xiaomi New Mobiles: లేటెస్ట్ టెక్నాలజీ.. షియోమీ నుంచి రెండు ఫోన్లు.. కీలక సమాచారం లీక్!

Xiaomi New Mobiles: లేటెస్ట్ టెక్నాలజీ.. షియోమీ నుంచి రెండు ఫోన్లు.. కీలక సమాచారం లీక్!
Advertisement

Xiaomi New Mobiles: చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ షియోమీ ఈ ఏడాది అక్టోబర్‌లో Xiaomi 15, Xiaomi 15 Pro ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేయనున్నట్లు పలు లీక్‌లు వస్తున్నాయి. రెండు స్మార్ట్‌ఫోన్‌లు స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 4 ప్రాసెసర్‌తో కూడిన ప్రపంచంలోనే మొట్టమొదటి డివైజ్‌లుగా వస్తాయని తెలుస్తోంది. ఇటీవల చైనీస్ మైక్రోబ్లాగింగ్ సైట్ వీబోలో మరో లీక్ ఒకటి వెలువడింది. ఇందులో Xiaomi 15, 15 Pro స్పెసిఫికేషన్‌లను వెల్లడించింది. ఈ రాబోయే ఫోన్ల గురించి వివరంగా తెలుసుకుందాం.

లీక్ ప్రకారం షియోమీ 15 ఫోన్ 1.5K రిజల్యూషన్‌తో 6.36-అంగుళాల ఫ్లాట్ OLED డిస్‌ప్లేతో కూడిన కాంపాక్ట్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్. అయితే షియోమీ 15 Pro 6.73-అంగుళాల OLED డిస్‌ప్లేను మైక్రో-కర్వేచర్‌తో కలిగి ఉంటుంది. ఇది 2K రిజల్యూషన్‌ను కలిగి ఉంటుంది. రెండు డిస్‌ప్లేలు 120Hz రిఫ్రెష్ రేట్‌తో HBMలో 1400 నిట్‌ల వరకు బ్రైట్‌నెస్‌కు సపోర్ట్ చేస్తాయి. ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు Snapdragon 8 Gen 4 ప్రాసెసర్‌ను కలిగి ఉంటాయి. ఇది LPDDR5x RAM+ UFS 4.0 స్టోరేజ్‌తో వస్తుంది.

Advertisement

కెమెరా సెటప్ గురించి మాట్లాడితే షియోమీ 15 బ్యాక్ 50 మెగాపిక్సెల్ ఓమ్నివిజన్ OV50H కెమెరా, అల్ట్రా వైడ్ కెమెరా, 3x ఆప్టికల్ జూమ్‌తో కూడిన 50 మెగాపిక్సెల్ Samsung JN1 టెలిఫోటో కెమెరా ఉంటాయి. షియోమీ 15 Pro బ్యాక్  50 మెగాపిక్సెల్ ఓమ్నివిజన్ OV50N ప్రైమరీ కెమెరా, 50 మెగాపిక్సెల్ Samsung JN1 అల్ట్రావైడ్ కెమెరా మరియు 3x ఆప్టికల్ జూమ్‌తో కూడిన 50 మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా ఉంటాయి. ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు ముందు 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది.

Also Read: రండి బాబు రండి.. మంచి ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌.. ఆఫర్లు పోతే మళ్లీరావు!

Advertisement

షియోమీ 15 4,800mAh లేదా 4,900mAh బ్యాటరీతో వస్తుంది. ఇది 100W వైర్డు, 50W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. 15 Pro 5,400mAh బ్యాటరీతో వస్తుంది. ఇది 120W వైర్డు, 80W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. రెండు స్మార్ట్‌ఫోన్‌ల ఇతర ఫీచర్లు IP68 రేటింగ్, 5.5G కనెక్టివిటీ, డ్యూయల్ స్పీకర్, IR బ్లాస్టర్. షియోమీ 15 0809B లీనియర్ మోటార్, ఆప్టికల్ ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్‌ కలిగి ఉంటుంది. అయితే 15 ప్రో X-యాక్సిస్ లీనియర్ మోటార్, అల్ట్రాసోనిక్ ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంటాయి.

Related News

iPhone 18 Pro కొనేముందు ఈ ఒక్క విషయం తెలుసుకోండి.. లేదంటే లబోదిబోమనాల్సిందే!

రూ.1,699కే బెస్ట్ పోర్టబుల్ స్పీకర్ ఇదే! ఇల్లు దద్దరిల్లే సౌండ్ గ్యారంటీ

బెస్ట్ విండోస్ ల్యాప్‌టాప్ కోసం చూస్తున్నారా? ఈ మోడల్‌పై ఓ లుక్కేయండి

మెడలో వేసుకుంటే చాలు.. మన మైండ్‌లో ఏముందో చెప్పేసే ఏఐ రోబోట్ వచ్చేసింది!

బడ్జెట్ ఫ్రెండ్లీ ల్యాప్‌టాప్ కోసం చూస్తున్నారా? ఆఫీస్, స్టూడెంట్స్‌కు పర్ఫెక్ట్

రూ.9,490కే ఫ్రిజ్..సింగిల్ రూమ్స్, బ్యాచిలర్స్‌కు బెస్ట్!

తక్కువ ధరలో బెస్ట్ బ్రాండెడ్ వాచ్.. రెడ్‌మీ నుంచి మార్కెట్‌ను షేక్ చేసే కొత్త మోడల్!

Huawei Watch GT 7 సిరీస్ లాంచ్.. 21 రోజుల బ్యాటరీ, అద్భుతమైన ఫీచర్లు!

Big Stories

Advertisement
×