BigTV English

Silent Heart Attack: సైలెంట్ హార్ట్ ఎటాక్.. మీలో ఈ లక్షణాలుంటే చాలా డేంజర్ !

Silent Heart Attack: సైలెంట్ హార్ట్ ఎటాక్.. మీలో ఈ లక్షణాలుంటే చాలా డేంజర్ !

Silent Heart Attack: ఈ మధ్య కాలంలో హార్ట్ ఎటాక్‌తో మరణించే వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. దీనికి ప్రధాన కారణాలు తెలియకపోవచ్చు. వయస్సుతో సంబంధం లేకుండా హార్ట్ ఎటాక్‌తో చనిపోతున్నారు. మరీ ముఖ్యంగా ఆరోగ్యంగా ఉండే వ్యక్తులు కూడా కళ్ల ముందే కుప్పకూలుతున్నారు. ఇలాంటి లక్షణాలు లేకుండానే చనిపోవడం ఈ మధ్యకాలంలో ఆందోళన రేకెత్తిస్తోంది. దీన్నే సైలెంట్ హార్ట్ అటాక్ అని పిలుస్తున్నారు.


రోజంతా పనిచేసి బాగా అలసిపోయినప్పుడు మంచిగా నిద్ర పోవాలని కోరుకుంటారు. ముఖ్యంగా రాత్రులు సమయానికి పడుకోవడం, నిద్రపోవడం వల్ల శరీరానికి విశ్రాంతి లభిస్తుంది. నిద్రపోతున్న సమయంలో గుండెపోటు వస్తుందనే విషయం మీకు తెలుసా? అవును, రాత్రి సమయంలో గుండె పోటు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ సైలెంట్ హార్ట్ ఎటాక్ లక్షణాలు కనపడకుండా ఉన్నపళంగా గుండె ఆగిపోవడాన్ని సైలెంట్ హార్ట్ ఎటాక్‌గా నిర్ధారిస్తున్నారు.
ప్రస్తుతం ఆరోగ్యంగా, చురుకైన వ్యక్తులు కూడా గుండెపోటుకు గురవుతున్నారు. భారతదేశంలో ఇలాంటి ప్రమాదం చాలా పెరుగుతోంది. ముఖ్యంగా నిద్రలో గుండెపోటు ఎందుకు వస్తుందనే అంశంపై నిపుణులు పలు విషయాలు వెల్లడిస్తున్నారు.
సైలెంట్ హార్ట్ ఎటాక్ అంటే..
నిద్ర పోతున్నప్పుడు కూడా గుండెపోటు రావడానికి అవకాశం ఉంది. అయితే ఇది సాధారణ గుండెపోటుకు భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే నిద్రిస్తున్న వ్యక్తి గుండెపోటు వచ్చిందని పక్కవారికి కూడా తెలియదు. ఈ స్థితిలో గుండె పోటు వచ్చినప్పుడు వ్యక్తి ఛాతిలో నొప్పిని అనుభవిస్తాడు.
తెల్లవారు జామున గుండెపోటు?
సాధారణంగా హార్ట్ ఎటాక్‌లు తెల్లవారుజామునే ఎక్కువగా వస్తుంటాయి. ఈ సమయంలో శరీరంలో జీవక్రియలు, హృదయ స్పందన తక్కువగా ఉంటుంది. దాంతో రక్తప్రసరణ తగ్గుతుంది. ఈ కారణం చేత రక్తపోటు, గుండెపోటుకు దారితీస్తుంది. అవసరానికి మించి నిద్ర పోవడం, నిద్ర ఎక్కువగా లేదా తక్కువగా ఉన్నా గుండె పోటు వస్తుంది. కేవలం నాలుగైదు గంటలు నిద్రపోవడం వల్ల కూడా గుండె సంబంధిత సమస్యలు వస్తాయి.

సైలెంట్ హార్ట్ ఎటాక్ ఎప్పుడొస్తుంది:
ప్రస్తుతం హార్ట్ ఎటాక్‌కు సమయం అంటూ ఏదీ లేదు. సైలెంట్ హార్ట్ ఎటాక్ రోజులో ఎప్పుడైనా రావచ్చు. కాబట్టి దీనికి సంబంధించి కొన్ని లక్షణాలు తెలుసుకోవడం చాలా అవసరం.


Also Read: జుట్టుకు రంగు వేస్తున్నారా ? అయితే ఈ సమస్యలు గ్యారంటీ !

రాత్రుల్లో వచ్చే గుండెపోటు లక్షణాలు:

  • కాళ్లు, పాదాలు, గుండెకు సంబంధించిన జన్యువుల్లో కనిపించే లక్షణాలు
  • కాళ్లలో నొప్పి మరియు అసౌకర్యం.
  • రాత్రుల్లోకాళ్లు, పాదాలు చల్లగా మారడం.
  • రాత్రిపూట తిమ్మిరి, కాళ్ల మరియు పాదాలలో జలదరింపులు.
  • కాళ్లు, చీలమండలం లేదా పాదాలలో వాపు, గుండె ధమనుల్లో సహా పలు ఆరోగ్య సమస్యలు.
  • కాళ్ల మరియు పాదాలపై చర్మం రంగులో మార్పులు నీలి రంగు లేదా లేతగా మారడం.
  • కాళ్లను కదిలించాలి అనే కోరిక, అసౌకర్య అనుభూతులు.
  • ప్రధానంగా ఛాతిలో నొప్పి, ఛాతిలో అసౌకర్యం.
  • శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది.
  • ఛాతి లేదా భుజాల దగ్గర వీపుపై భాగంలో వాపు
  • చీలమండలంలో నొప్పి.

Related News

Home remedies: రాత్రి దిండు కింద పెట్టే సింపుల్ హోమ్ రెమిడీ.. ఇలా చేస్తే..

Onion juice: జుట్టుకు ఉల్లిపాయ రసం రాస్తున్నారా? వీటిని కలిపితే..

Home remedies: కఫం, జలుబు వేధిస్తున్నాయా? ఈ సింపుల్ హోమ్ రెమిడీతో ఇట్టే మాయమైపోతాయి

Independence day Recipes: ఇండిపెండెన్స్ డేకు మూడు రంగుల్లో పులావ్, దోశ చేసి దేశభక్తిని చాటుకోండి

Independence Day 2025: స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.. స్పెషల్ కోట్స్, విషెస్ చెప్పండిలా..

Independence Day 2025: స్వాతంత్ర్య దినోత్సవం.. ఆగస్ట్ 15న జరుపుకోవడానికి వెనక ఇంత కథ ఉందా ?

Big Stories

×