E-Paper
Advertisement

Aadhaar Fingerprint Scam: ఒటిపి, పిన్ ఏదీ అవసరం లేదు.. కేవలం ఫింగర్‌ప్రింట్‌తో మీ బ్యాంక్ అకౌంట్ ఖాళీ

Aadhaar Fingerprint Scam: ఒటిపి, పిన్ ఏదీ అవసరం లేదు.. కేవలం ఫింగర్‌ప్రింట్‌తో మీ బ్యాంక్ అకౌంట్ ఖాళీ
Advertisement

Aadhaar Fingerprint Scam| ఆన్‌లైన్ మోసాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. సైబర్ మోసగాళ్లు కొత్త కొత్త మార్గాల్లో దోచుకుంటున్నారు. తాజాగా ఒక ప్రమాదకరమైన అన్‌లైన్ మోసం చేసే విధానం వెలుగులోకి వచ్చింది. ఓటీపీ లేదా పిన్ లేకుండానే బ్యాంక్ అకౌంట్‌లో డబ్బుని దొంగలు కాజేస్తున్నారు. ఇది ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ (AEPS) ద్వారా జరుగుతుంది. బాధితులు ఎలాంటి మెసేజ్ అలర్ట్ లేకుండానే డబ్బు కోల్పోతున్నారు. మోసగాళ్లు బాధితుల ఖాతాలనుంచి ఇతర ఖాతాలకు డబ్బు బదిలీ చేయడానికి కూడా ఉపయోగిస్తున్నారు.

AEPS అంటే ఏమిటి? ఎందుకు ప్రమాదకరం?

AEPS అంటే ఆధార్, ఫింగర్‌ప్రింట్ ద్వారా బ్యాంక్ ట్రాన్సాక్షన్లు చేసే సిస్టమ్. మైక్రో-ఏటీఎంల వద్ద ఆధార్ ఉపయోగించి డబ్బు విత్‌డ్రా చేసుకోవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్‌కు ఉపయోగకరమైన ఈ వ్యవస్థలో బయోమెట్రిక్ భద్రత బలహీనంగా ఉండటం వల్ల మోసగాళ్లకు ఈ పద్ధతిలో మోసం చేయడం సులభమైపోయింది.

AEPS మోసం ఎలా జరుగుతుంది?

Advertisement

మోసగాళ్లు ముందుగా లీక్ అయిన డేటాబేస్‌ల నుంచి లేదా నకిలీ సెంటర్ల ద్వారా ఆధార్ వివరాలు సేకరిస్తారు. ఫింగర్‌ప్రింట్లు, ఆధార్ నంబర్, వ్యక్తిగత సమాచారం సేకరిస్తారు. దొంగిలించిన బయోమెట్రిక్ డేటాతో నకిలీ ఫింగర్‌ప్రింట్ మోల్డ్స్ తయారు చేస్తారు. ఈ నకిలీ ఫింగర్‌ప్రింట్లతో AEPS మైక్రో-ఏటీఎంలలో ట్రాన్సాక్షన్లు చేస్తారు. ఓటీపీ లేదా పిన్ లేకుండానే సిస్టమ్ ఆమోదిస్తుంది. డబ్బు తక్షణం బదిలీ అవుతుంది. బాధితులు ఖాతా బ్యాలెన్స్ చూసినప్పుడే షాక్ అవుతారు.

మ్యూల్ అకౌంట్ డబ్బు ట్రాన్స్‌ఫర్

మ్యూల్ అకౌంట్ అనేది దొంగలు దొంగిలించిన డబ్బును సులభంగా తరలించడానికి ఉపయోగించే బ్యాంక్ ఖాతా. కొందరు చిన్న మొత్తం కోసం తమ ఖాతాలను అద్దెకు ఇస్తారు. మరికొందరి ఖాతాలను హ్యాకర్లు అనుమతి లేకుండా ఉపయోగిస్తారు. ఫ్రాడ్ దర్యాప్తులో బ్యాంకులు ఈ మ్యూల్ అకౌంట్లను గుర్తిస్తాయి.

AEPS మోసాలు ఎందుకు గుర్తించడం కష్టం?

Advertisement

AEPS ట్రాన్సాక్షన్లు చట్టబద్ధమైన బయోమెట్రిక్ పేమెంట్లలా కనిపిస్తాయి. ఇలాంటి ట్రాన్సాక్షన్లకు బ్యాంకులు ఓటీపీ అలర్ట్స్ పంపించవు. బాధితులు బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసినప్పుడే మోసం తెలుస్తుంది. ఈ ఆలస్యం వల్ల మోసగాళ్లు త్వరగా తప్పించుకుంటారు.

AEPS మోసాలను నివారణకు GPS ఎనేబుల్డ్ డివైసెస్

నిపుణులు GPS ఎనేబుల్డ్ మైక్రో-ఏటీఎం డివైసెస్‌ను సూచిస్తున్నారు. ఈ డివైసెస్ రిజిస్టర్ చేసిన లొకేషన్ నుంచి మాత్రమే ట్రాన్సాక్షన్లు అనుమతిస్తాయి. అనుమతి లేని ప్రాంతాల్లో పేమెంట్లు ఫెయిల్ అవుతాయి. ఇది అనధికారిక AEPS ట్రాన్సాక్షన్లను తగ్గిస్తుంది.

బ్యాంకులు, NPCIకి లాభాలు

GPS ట్రాకింగ్ ద్వారా మోసాలు ఎక్కువగా జరిగే గ్రామాలు లేదా ప్రాంతాలను గుర్తించవచ్చు. బ్యాంకులు హై-రిస్క్ ఏరియాల్లో భద్రతను పెంచవచ్చు. NPCI ట్రాన్సాక్షన్ ప్యాటర్న్‌లను మెరుగ్గా మానిటర్ చేయవచ్చు. దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ సేఫ్టీ మెరుగవుతుంది.

ఆధార్ మోసాలను నివారించే భవిష్యత్ టెక్నాలజీ

ఏఐ ఇంటిగ్రేషన్ ద్వారా AEPS భద్రతను మరింత బలోపేతం చేయవచ్చు. బయోమెట్రిక్ లైవ్‌నెస్ డిటెక్షన్ ద్వారా నకిలీ ఫింగర్‌ప్రింట్లను గుర్తించవచ్చు. అధునాతన సిస్టమ్‌లు నిజమైన మానవ ఫింగర్‌ప్రింట్లను మాత్రమే గుర్తిస్తాయి.

Also Read: ఏఐతో డబ్బు సంపాదించడం ఎలా? సింపుల్ టిప్స్ ఇవిగో

మీరు ఎలా రక్షణ పొందవచ్చు?

UIDAI వెబ్‌సైట్ ద్వారా ఆధార్ బయోమెట్రిక్స్ లాక్ చేయండి. తెలియని వ్యక్తులు, షాపులకు ఆధార్ వివరాలు ఇవ్వకండి. అనధికారిక సెంటర్లలో ఆధార్ అప్‌డేట్ చేయకండి. దుకాణాల్లో ఆధార్ ఫోటోకాపీలు ఇవ్వకండి. షేర్ చేసిన ఆధార్ ఇమేజ్‌లను వెంటనే డిలీట్ చేయండి. బ్యాంక్ స్టేట్‌మెంట్లను రెగ్యులర్‌గా చెక్ చేయండి.

ఈ జాగ్రత్తలు తీసుకుంటే ఆధార్ ఆధారిత మోసాల నుంచి మీ డబ్బు సురక్షితంగా ఉంటుంది.

Related News

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

బడ్జెట్ ధరలో బెస్ట్ 3-డోర్ ఫ్రిజ్.. వర్ల్‌పూల్ ప్రోటాన్ రివ్యూ

రూ.1,599 కే బెస్ట్ ఇయర్‌బడ్స్..హెవీ బేస్‌తో మార్కెట్ షేక్!

మార్కెట్‌ను షేక్ చేస్తున్న 43 ఇంచుల టీవీ.. ఫీచర్స్ నెక్స్ట్ లెవెల్!

కేవలం రూ. 999 కే హెడ్‌ఫోన్స్..సౌండ్ క్వాలిటీ చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

రూ.6వేలలోపు టాప్ క్లాస్.. బ్రాండెడ్ వాషర్ ..మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌కి పండగే

బిగ్ డిస్‌ప్లే స్మార్ట్‌వాచ్.. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్లతో దుమ్మురేపుతోంది!

ప్రీమియం వాషింగ్ ఎక్స్‌పీరియన్స్..క్షణాల్లోనే బట్టలు తెల్లగా మెరిసిపోవాల్సిందే!

Big Stories

Advertisement
×