E-Paper
Advertisement

హోటల్స్‌లో బస చేస్తున్నారా? సీక్రెట్ కెమెరాలను కనిపెట్టే.. 5 సులువైన ట్రిక్స్!

హోటల్స్‌లో బస చేస్తున్నారా? సీక్రెట్ కెమెరాలను కనిపెట్టే.. 5 సులువైన ట్రిక్స్!
Advertisement

Hidden Cameras: హోటల్ గదుల్లో రహస్య కెమెరాలు (Hidden Cameras) పెట్టడం అనేది ఈ రోజుల్లో పెద్ద ఆందోళనగా మారింది. కుటుంబంతో కలిసి టూర్‌కు వెళ్లినప్పుడు లేదా బిజినెస్ పనిమీద హోటల్స్‌లో బస చేసినప్పుడు ప్రధానంగా ఈ సమస్య వేధిస్తోంది. ఫ్యామిలీ వ్యక్తిగత గోప్యతకు ముప్పుగా పరిణమించిన ఈ సీక్రెట్ కెమెరాలను.. కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా ఈజీగా కనిపెట్టవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. మీరు ఉన్న హోటల్ గదిలో ఏదైనా సీక్రెట్ కెమెరా ఉందో? లేదో? నిమిషాల వ్యవధిలో గుర్తించవచ్చని స్పష్టం చేస్తున్నారు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం.

గదిలోకి వెళ్లగానే ‘ఫిజికల్ సెర్చ్’

హోటల్ రూమ్‌లోకి అడుగు పెట్టగానే ముందుగా గదిని క్షుణ్ణంగా పరిశీలించండి. స్మోక్ డిటెక్టర్లు, ఎయిర్ కండీషనర్ వెంట్స్, గోడ గడియారాలు, టేబుల్ ల్యాంప్స్, నైట్ బల్బులు, పవర్ సాకెట్లు, ఎలక్ట్రానిక్ వస్తువుల ప్లగ్ పాయింట్లు, టీవీ సెట్ టాప్ బాక్స్, రూమ్ డెకరేషన్ వస్తువులు, ఫ్లవర్ వాజులు మెుత్తం ఒకసారి చెక్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

స్మార్ట్‌ఫోన్ ఫ్లాష్ ‌లైట్

Advertisement

సాధారణంగా మెజారిటీ హిడెన్ కెమెరాల లెన్స్‌లు గ్లాస్‌తో తయారవుతాయి. కాబట్టి రూమ్‌లోని లైట్లన్నీ ఆర్పేసి, గదిని పూర్తిగా చీకటిగా మార్చండి. ఇప్పుడు మీ మొబైల్ ఫోన్ ఫ్లాష్‌లైట్ ఆన్ చేసి గదిలోని ప్రతి మూలను, అనుమానాస్పద వస్తువులను చెక్ చేయండి. ఒకవేళ ఎక్కడైనా కెమెరా ఉంటే దాని లెన్స్ పై ఫ్లాష్‌లైట్ పడగానే నీలి రంగు లేదా ఎరుపు రంగు వెలుతురు రిఫ్లెక్షన్ రూపంలో మీకు స్పష్టంగా కనిపిస్తుంది.

మొబైల్ కెమెరాతో చెక్

చాలా హోటల్స్ లో చీకట్లో కూడా రికార్డ్ చేయగల నైట్ విజన్ కెమెరాలను వాడుతుంటారు. ఇవి మన కంటికి కనిపించవు కానీ మొబైల్ కెమెరాకు మాత్రం ఈజీగా దొరికేస్తాయని నిపుణులు సూచిస్తున్నారు. ముందుగా గదిలోని లైట్లు అన్నీ ఆఫ్ చేసి.. ఫ్రంట్ లేదా బ్యాక్ కెమెరాను ఆన్ చేయండి. పైన చెప్పినట్లుగా ఫోన్ ఫ్లాష్ లైట్ తరహాలో ప్రతీ మూలను కెమెరాతో క్షుణ్ణంగా పరిశీలించండి. స్క్రీన్‌పై ఎక్కడైనా చిన్న తెల్లటి లేదా పర్పుల్ రంగు చుక్క లాంటి వెలుతురు మెరుస్తూ కనిపిస్తే అక్కడ హిడెన్ కెమెరా ఉన్నట్లే లెక్క.

రూమ్ వై-ఫై తనిఖీ

Advertisement

ప్రస్తుతం వచ్చే చాలా సీక్రెట్ కెమెరాలు లైవ్ ఫుటేజీని పంపడానికి హోటల్ వై-ఫైని వాడుతుంటాయి. కాబట్టి హిడెన్ కెమెరాను కనిపెట్టేందుకు మీ ఫోన్‌ను హోటల్ వై-ఫైకి కనెక్ట్ చేయండి. ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ నుండి ‘ఫింగ్’ లేదా ‘నెట్ వర్క్ స్కానర్’ లాంటి ఫ్రీ యాప్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి. ఈ యాప్ ద్వారా నెట్‌వర్క్‌ను స్కాన్ చేస్తే ఆ వై-ఫైకి కనెక్ట్ అయి ఉన్న డివైజ్‌ల లిస్ట్ వస్తుంది. అందులో ‘ఐపీ కెమెరా’ లేదా అనుమానాస్పద కెమెరా పేర్లు కనిపిస్తే వెంటనే అలర్ట్ అవ్వండి.

Also Read: ఏసీ ఆఫ్ చేసినా గది చల్లగా ఉండాలా? ఈ 6 ట్రిక్స్ పాటిస్తే.. రోజంతా కూల్ కూల్!

బాత్రూమ్ అద్దాల చెకింగ్

బెడ్‌రూమ్‌తో పాటు ఒక్కోసారి బాత్రూమ్ లోనూ సీక్రెట్ కెమెరాలను ఫిక్స్ చేసే ఛాన్స్ ఉంటుంది. అలాగే మరికొన్ని చోట్ల టూ-వే మిర్రర్స్ (అవతలి వైపు నుండి చూసే వీలున్న అద్దాలు) అమర్చుతుంటారు. దీనికి ‘ఫింగర్‌టిప్ టెస్ట్’ తో చెక్ పెట్టవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. మీ చేతి వేలిని అద్దంపై ఉంచినప్పుడు.. మీ వేలికి, అద్దంలో కనిపిస్తున్న వేలి ప్రతిబింబానికి మధ్య కొంచెం స్పేస్ ఉంటే అది సాధారణ అద్దం అని అర్థం చేసుకోవాలి. అలా కాకుండా వేలికి వేలు నేరుగా తాకుతున్నట్లు ఉండి మధ్యలో ఎలాంటి గ్యాప్ లేకపోతే… అది టూ వే మిర్రర్ అయ్యే ప్రమాదం ఉంది. దాని వెనుక కెమెరా ఉండొచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

Also Read: దిల్లీని వణికించిన ఏసీ బ్లాస్ట్.. మీ ఏసీ సురక్షితమేనా? వెంటనే ఇలా చెక్ చేయండి!

Related News

ఇంట్లో Wi-Fi డెడ్ జోన్స్‌కు సింపుల్ సొల్యూషన్.. పాత ఆండ్రాయిడ్ ఫోన్‌తో ఇలా చేయండి!

వాషింగ్ మెషీన్‌ను ఎన్ని రోజులకు ఒకసారి క్లీన్ చేయాలి? ఈ విషయం తెలుసా?

AIతో పెరుగుతున్న సైబర్ మోసాలు.. మీ డబ్బు, వ్యక్తిగత సమాచారాన్ని కాపాడుకోండిలా!

BSNL కనివిని ఎరుగని ప్లాన్స్.. రోజుకు రూ.5 మాత్రమే.. 80 రోజులపాటు మీ ఇష్టం!

కొత్త 5G ఫోన్‌తో ఫిలిప్స్ రీ-ఎంట్రీ.. సెప్టెంబర్ 2న ఏం లాంచ్ చేయనుందంటే?

బ్యాటరీ ఎక్కువకాలం మన్నాలంటే 80-20 రూల్ పాటించాల్సిందేనా?

ఒకప్పుడు ఇవే స్టేటస్ సింబల్.. 90లలో ఫేమస్ అయిన 5 ఫోన్లు ఇవే!

మ్యాక్‌లో సిస్టమ్ స్టోరేజ్ పెరిగిపోయిందా? ఈ సింపుల్ ప్రాసెస్ ద్వారా ఖాళీ చేసి స్పీడ్ పెంచండి!

Big Stories

Advertisement
×