Sukumar DSP: ఇండస్ట్రీలో కొన్ని కాంబోలకుండే క్రేజ్ అంతా ఇంతా కాదు .వారి నుండి సినిమా వచ్చిందంటే చాలు తెగ మురిసిపోతుంటారు ఆడియన్స్ .ఆలాంటి ఒక కాంబోనే సుకుమార్, దేవి శ్రీ ప్రసాద్.. టాలీవుడ్‌లో ఈ రెండు పేర్లు వినబడితే చాలు థియేటర్లలో పూనకాలు రావాల్సిందే.
వీరిద్దరి కాంబోకి బ్రేక్ పడుతుందా
ఆర్య సినిమాతో మొదలైన వీరి మ్యూజికల్ జర్నీ జగడం, ఆర్య-2, 100% లవ్, నేనొక్కడినే, కుమారి 21ఎఫ్, రంగస్థలం, పుష్ప: ది రైజ్ వరకు ప్రతి ఒక్క సినిమాను ఒక మ్యూజికల్ వండర్‌గా మార్చింది . టాలీవుడ్‌లో ఎంతోమంది దర్శకులు మారుతుంటారు కానీ సుకుమార్ మాత్రం తన కెరీర్ మొదటి నుండి దేవిశ్రీని కాదనుకుని వేరే సంగీత దర్శకుడి వైపు వెళ్ళింది లేదు . సుకుమార్ మైండ్ సెట్, కథలోని ఎమోషన్‌ను డీఎస్పీ పట్టుకునే తీరు అద్భుతమనే చెప్పాలి. అందుకే ఇండస్ట్రీలో వీరిద్దరి బాండింగ్ ఒక బెంచ్‌మార్క్. అయితే గత కొంతకాలంగా ఫిలిం నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తున్న ఒక న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అదే వీరిద్దరి కాంబోకి బ్రేక్ పడుతుందా సుకుమార్ తన రూట్ మారుస్తున్నారా అనే డౌట్స్ రైజ్ అవుతున్నాయ్.
ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్
ముఖ్యంగా గతేడాది నుంచి ఈ ఇద్దరి మధ్య బాండింగ్ అంతగా లేదని ప్రచారం జోరుగా సాగుతోంది. పుష్ప-2 సినిమా మేకింగ్ సమయంలో ఈ వార్తలు మరింత ఊపందుకున్నాయి. ఈ భారీ సీక్వెల్‌లోని కొన్ని కీలకమైన ఎపిసోడ్స్, యాక్షన్ సీక్వెన్స్‌లకు దేవిశ్రీ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (BGM) విషయంలో సుకుమార్ వంద శాతం సంతృప్తి చెందలేదని, అందుకే ఇతర ప్రముఖ సంగీత దర్శకులని ప్రాజెక్ట్ లోకి తెచ్చారని టాక్ గట్టిగా నడిచింది.
Also read :రాజమౌళి ‘వారణాసి’ లీక్.. ఇండియన్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ వైల్డ్ యాక్షన్ సీక్వెన్స్!
ఈ పరిణామం దేవిశ్రీ ప్రసాద్‌కు కొంత ఇబ్బందిగా అనిపించిందని, అందుకే ఆయన ఈ మధ్య జరిగిన ఒక ప్రైవేట్ ఈవెంట్‌లో తన వర్క్ ఫ్రీడమ్ గురించి పరోక్షంగా కొన్ని వ్యాఖ్యలు చేశారంటూ ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ నడిచింది. ఈ గ్యాప్ ఇలానే కొనసాగితే రాబోయే రోజుల్లో వీరిద్దరూ కలిసి ప్రాజెక్ట్స్ చేయడం కష్టమేననేని ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్
అనిరుధ్ రవిచందర్ లేదా ఏఆర్ రెహమాన్
దీనికి తోడు ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సుకుమార్ తెరకెక్కించబోయే భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ (RC17) గురించిన అప్‌డేట్స్ ఈ ప్రచారానికి మరింత బూస్టప్ ఇస్తుంది . రంగస్థలం వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత చరణ్, సుకుమార్ కాంబినేషన్‌లో రాబోతున్న ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అయితే ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ స్థానంలో అనిరుధ్ రవిచందర్ లేదా ఏఆర్ రెహమాన్ లాంటి మరో టాప్ మ్యూజిక్ డైరెక్టర్‌ను పరిశీలిస్తున్నట్లు నెట్టింట వార్తలు వైరల్ అవుతున్నాయి.
Also read :మెగా బ్రదర్స్‌ను తిట్టారా?.. ఆడియో వెనుక పొలిటికల్ స్కెచ్.. అసలేం జరిగింది?
ఒకప్పుడు సుకుమార్ సినిమా అంటే కళ్ళు మూసుకుని దేవిశ్రీ పేరు రాసేసే పరిస్థితి ఉండేది, కానీ ఇప్పుడు ఆ స్థానంలో వేరే పేర్లు వినిపించడం నిజంగానే పెద్ద షాకే . అదే సమయంలో దేవిశ్రీ ప్రసాద్ కూడా తన కెరీర్‌లో సరికొత్త ఇన్నింగ్స్ ప్రారంభించేందుకు రెడీ అవుతున్నారు. ఆయన ‘ఎల్లమ్మ’ అనే చిత్రంతో హీరోగా వెండితెరకు పరిచయం కాబోతుండటం, ఆ ప్రాజెక్ట్ పనుల్లో బిజీగా ఉండటం వల్ల కూడా సుకుమార్ సినిమాకు పూర్తి సమయం కేటాయించలేకపోవచ్చు అన్నది ట్రేడ్ పండితుల మాట.
ఈ న్యూస్ గాసిప్స్ కే పరిమితం అవుతాయా
మరోవైపు టాలీవుడ్‌లో దేవిశ్రీ ప్రసాద్‌కు గతంలో వరుస అవకాశాలు ఇచ్చిన స్టార్ డైరెక్టర్లు సైతం ఇప్పుడు ఇతర ఆప్షన్స్ వెతుక్కుంటుండటం గమనార్హం. ఉదాహరణకు పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రానికి దేవిశ్రీ మొదట మ్యూజిక్ అందించినప్పటికీ, ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల ఆ బాధ్యతలను థమన్‌కు అప్పగించారనే ప్రచారం గట్టిగా జరిగింది.
Also read :జైలర్ 2’లోకి ఆ బాలీవుడ్ స్టార్ హీరో.. షారుఖ్ నో చెప్పడంతో లక్కీ ఛాన్స్!
హరీష్ శంకర్ సినిమాలకు కూడా దేవిశ్రీ గతంలో గబ్బర్ సింగ్, సుబ్రమణ్యం ఫర్ సేల్ లాంటి బ్లాక్‌బస్టర్ ఆల్బమ్స్ ఇచ్చారు. ఇలాంటి క్రేజీ కాంబినేషన్స్ ఒక్కొక్కటిగా మారుతుండటంతో, సుకుమార్ సైతం గ్లోబల్ ఆడియన్స్‌ను టార్గెట్ చేస్తూ తన నెక్స్ట్ సినిమా కోసం కొత్త సౌండింగ్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉందంటున్నారు.చూడాలి మరి ఎన్నో ఏళ్లుగా కలిసి సినిమాలు చేసిన ఈ జోడీ నిజంగానే బ్రేకప్ చెప్పుకుంటుందా లేక ఈ న్యూస్ గాసిప్స్ కే పరిమితం అవుతాయా !