E-Paper
Advertisement

చిన్న గదుల కోసం.. అద్భుతమైన నిటారు కూలర్లు.. మధ్యతరగతికి వరం భయ్యా!

చిన్న గదుల కోసం.. అద్భుతమైన నిటారు కూలర్లు.. మధ్యతరగతికి వరం భయ్యా!
Advertisement

Tower Coolers 2026: తెలుగు రాష్ట్రాల్లో ఎండల దాటికి సామాన్యులు అల్లాడిపోతున్నారు. బయట వేడి.. ఇంట్లో ఉక్కపోతతో తర్జనభర్జన అవుతున్నారు. ముఖ్యంగా ఏసీలు, కూలర్లు వంటివి ఏమాత్రం లేని మధ్యతరగతి ప్రజలు అధిక ఉష్ణోగ్రతల దెబ్బకు డీలా పడిపోతున్నారు. ఈ నేపథ్యంలో సాధారణంగా చిన్న గదులు ఉండే మధ్యతరగతి ఇళ్ల కోసం.. అద్భుతమైన టాప్ రేటెడ్ టవర్ (నిటారు) కూలర్లను ఈ కథనంలో అందించడం జరుగుతోంది. వాటి ఫీచర్లపై ఓ లుక్కేసి మీ అభిరుచికి దగ్గరగా ఉన్న దానిని కొనుగోలు చేయండి.

సింఫనీ డైట్ 12టి

చిన్న బెడ్‌రూమ్‌లు లేదా స్టడీ రూమ్‌ల కోసం ఇది పర్‌ఫెక్ట్ ఛాయిస్. ఇది స్లిమ్ డిజైన్ తో రూపొందడం వల్ల గదిలో చాలా తక్కువ స్థలాన్నే ఆక్రమిస్తుంది. ఇది కేవలం 170 వాట్ల విద్యుత్‌ను మాత్రమే వాడుకుంటుంది. కాబట్టి కరెంట్ బిల్లు చాలా పరిమితంగానే ఉంటుంది. ఇందులో ఉండే మల్టీ స్టేజ్ ప్యూరిఫికేషన్ ఫిల్టర్లు గదిలోని గాలిని శుభ్రంగా ఉంచుతాయి.

బజాజ్ టిఎమ్ఎక్స్ 24 టవర్ కూలర్

Advertisement

బజాజ్ కంపెనీ నుంచి వచ్చిన ఈ టవర్ కూలర్.. చిన్న గదులను చాలా వేగంగా కూల్ చేసేస్తుంది. దీనిలో అమర్చిన ‘హనీకోంబ్ కూలింగ్ ప్యాడ్లు’ ఎక్కువ సేపు రూమ్ ను చల్లగా ఉంచుతాయి. ఇన్వర్టర్‌పై కూడా ఇది సులభంగా నడుస్తుందని కంపెనీ వర్గాలు తెలిపాయి. తక్కువ బడ్జెట్‌లో బ్రాండెడ్ కూలర్ కావాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్.

క్రాంప్టన్ ఆప్టిమస్ నియో

మోడరన్ లుక్, అద్భుతమైన ఎయిర్ త్రో కోరుకుంటే ఈ టవర్ కూలర్ ట్రై చేయవచ్చు. దీని బ్లేడ్ల డిజైన్ వల్ల గదిలోని ప్రతీ మూలకూ చల్లని గాలి అందుతుంది. దీనిని క్లీన్ చేయడం కూడా చాలా సులభం. తక్కువ శబ్దంతో ప్రశాంతమైన నిద్రను ఈ టవర్ కూలర్ అందిస్తుంది.

ఓరియంట్ ఎలక్ట్రిక్ ఓషియన్ టవర్

Advertisement

ఈ ఓరియంట్ కూలర్ ఎంతో స్టైలిష్‌గా ఉండటంతో పాటు పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్ అందిస్తుంది. ఇందులో 3 స్పీడ్ కంట్రోల్ ఫీచర్ ఉంది. తక్కువ విద్యుత్ వినియోగంతో నడిచేలా దీని మోటార్‌ను డిజైన్ చేశారు. గది అందాన్ని పెంచేలా ఒక మంచి స్లిమ్ కూలర్ కావాలంటే దీనిని ఎంచుకోవచ్చు.

Also Read: ఎబోలా వైరస్ ఎఫెక్ట్.. భారత్ – ఆఫ్రికా శిఖరాగ్ర సదస్సు వాయిదా.. కేంద్రం కీలక ప్రకటన

హింద్‌వేర్ స్నోక్రెస్ట్ 19హెచ్

ఈ టవర్ కూలర్ కు యూజర్ల నుంచి పాజిటివ్ స్పందన వస్తోంది. ఈ మోడల్ చిన్న గదులకు ఎంతో అనుకూలంగా ఉంటుంది. దీని ఎయిర్ డిఫ్లెక్టర్లు.. గాలిని సమానంగా అన్ని మూలలకు పంపిస్తాయి. కరెంట్ ఆదా చేయడంలో ఈ టవర్ కూల్ ముందుంటుందని కంపెనీ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. అంతేకాకుండా బడ్జెట్ ఫ్రెండ్లీ ధరలో ఎక్కువ కాలం మన్నిక వచ్చే కూలర్ గా ఇది గుర్తింపు పొందింది.

Also Read: ఫ్రిడ్జ్ తెరవగానే బ్యాడ్ స్మెల్ వస్తోందా? ఈ 5 సింపుల్ ట్రిక్స్‌తో.. చెక్ పెట్టండి!

Related News

యూట్యూబ్‌లో ఏ వీడియో క్వాలిటీకి ఎంత డేటా ఖర్చవుతుందో తెలుసా?

ఐఫోన్ బ్యాటరీని బ్యాక్‌గ్రౌండ్‌లో తినేస్తున్నది ఇదే.. ఈ ఒక్క సెట్టింగ్ మార్చండి చాలు!

ఫోన్ అడిక్షన్ అనుకుంటున్నారా? ఉదయాన్నే ఫోన్ చూడటం వెనుక అసలు సైకాలజీ ఇదే!

పవర్ బ్యాంక్‌ వాడుతున్నారా? ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయాలు!

ఆపిల్ వాచ్..పాత లుక్కే అయినా పర్ఫార్మెన్స్‌లో అదుర్స్!

రూ.50 వేలలోపు బెస్ట్ స్మార్ట్ టీవీలు..అమెజాన్,ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఇవే బెస్ట్!

ప్రైమ్ డే సేల్ కంటే ముందే ఆఫర్లు.. ఈ 5 గాడ్జెట్స్‌పై అమెజాన్‌లో కళ్లు చెదిరే డిస్కౌంట్లు!

బ్లూటూత్ తరచూ డిస్‌కనెక్ట్ అవుతోందా?నిమిషాల్లో ఇలా సాల్వ్ చేసుకోండి!

Big Stories

Advertisement
×