E-Paper
Advertisement

కేన్స్ వేదికపై అందాల జాతర.. విడాకుల తర్వాత గ్లామర్ డోస్ పెంచేసిన మౌనీరాయ్!

కేన్స్ వేదికపై అందాల జాతర.. విడాకుల తర్వాత గ్లామర్ డోస్ పెంచేసిన మౌనీరాయ్!
Advertisement

Mouni Cannes : ఫ్రెంచ్ రివేరా వేదికగా జరుగుతున్న 79వ కేన్స్‌ ఇంటర్ నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో మన తారల జోరు మాములుగా లేదు. ఇప్పటికే అలియా భట్‌, అదితిరావు హైదరి, డయానా పెంటీ, రుచి గుజ్జర్‌ వంటి ముద్దుగుమ్మలు తమ గ్లామరస్‌ లుక్స్‌తో కేన్స్ రెడ్ కార్పెట్‌పై సందడి చేయగా తాజాగా ఆ జాబితాలోకి బాలీవుడ్‌ బుల్లితెర, వెండితెర బ్యూటీ మౌనీరాయ్‌ చేరిపోయింది.

సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్

Advertisement

ఈ ప్రతిష్టాత్మక వేడుకలో మౌనీరాయ్‌ ధరించిన పటోలా ప్రింట్ గౌను ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. గుజరాతీ సాంప్రదాయ పటోలా ఎంబ్రాయిడరీ వర్క్‌తో రూపొందించిన ఈ ప్రత్యేకమైన గౌనులో మౌనీ అత్యంత స్టైలిష్‌గా, రాయల్‌గా కనిపించారు. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్‌ పూజా షా రూపొందించిన ఈ డ్రైస్‌ ‘ది హౌస్ ఆఫ్ పటోలా’ అనే ప్రసిద్ధ దుస్తుల లేబుల్‌కు చెందినది. ఈ కాస్ట్యూమ్ వెనుక ఉన్న శ్రమ అంతా ఇంతా కాదు. ఈ గౌనుపై ఎంబ్రాయిడరీ వర్క్ పూర్తి చేయడానికి మన దేశానికి చెందిన నిపుణులైన కళాకారులకు ఏకంగా 300 గంటల సుదీర్ఘ సమయం పట్టిందట.

Advertisement

also read :టాలీవుడ్ ఇండస్ట్రీ షట్‌డౌన్ దిశగా అడుగులు.. ఆ ఒక్క డిమాండ్ నెరవేరకపోతే థియేటర్లు బంద్?

వీపు భాగం లేకుండా (బ్యాక్‌లెస్), పూర్తి నిడివి గల ఈ స్లీవ్‌లెస్ గౌను మౌనీ బాడీ ఫిట్‌కు పర్ఫెక్ట్‌గా సరిపోయింది. స్క్వేర్‌ నెక్లైన్‌తో కలర్‌ఫుల్‌గా మెరిసిపోతున్న ఈ డ్రెస్‌కు మ్యాచింగ్‌గా ఆమె చేసుకున్న మేకప్ మరింత హైలైట్‌గా నిలిచింది. కాటుక కళ్లు, స్మడ్జ్ చేసిన వింగ్డ్ ఐలైనర్, మస్కారా పూసిన కనురెప్పలు, గులాబీ రంగు లిప్‌ షేడ్‌తో కేన్స్ వేదికపై దేవకన్యలా మెరిసిపోయింది మౌనీ రాయ్ .  కేవలం రెడ్ కార్పెట్‌పై నడవడమే కాకుండా, ఈ అంతర్జాతీయ వేదికపైనే ఆమె నటిస్తున్న సరికొత్త సినిమా పోస్టర్‌ అండ్ టీజర్‌ను కూడా గ్రాండ్‌గా విడుదల చేయడం విశేషం.

గ్లామర్ డోస్‌ మునుపటి కంటే డబుల్

ఇదంతా ఒకెత్తయితే, ఈ మధ్య కాలంలో మౌనీరాయ్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తున్న ఫోటోలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. బిజినెస్ మ్యాన్ సూరజ్ నంబియార్‌ను పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలకు కొద్దిగా బ్రేక్ ఇచ్చిన ఈ భామ, ఈమధ్య సూరజ్ కి విడాకులు ఇచ్చిన సంగతి తెల్సిందే.అయితే మౌనీ రాయ్ ఇలా విడాకులు ఇచ్చిందో లేదో అలా తన గ్లామర్ డోస్‌ను మునుపటి కంటే డబుల్ చేయడం గమనార్హం. విడాకుల రూమర్స్ తర్వాత మౌనీ రూటే మార్చేశారని, సరికొత్త సింగిల్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తూ సోషల్ మీడియాలో మరింత హాట్‌గా కనిపిస్తుందంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. ఇక కేన్స్ వేదికపై ఆమె ప్రదర్శించిన ఈ బ్యాక్‌లెస్ బోల్డ్ లుక్ చూశాక.. “విడాకుల తర్వాత మౌనీరాయ్ గ్లామర్ డోస్ మరింత పెంచిందిగా!” అంటూ గుసగుసలు పెంచేసింది బీ టౌన్.

also read :అనిరుధ్, కావ్య మారన్ లవ్ ఎఫైర్.. వైరల్ అవుతున్న క్రేజీ డీటెయిల్స్!

సినీ కెరీర్ విషయానికి వస్తే

ఇక మౌనీ రాయ్ సినీ కెరీర్ విషయానికి వస్తే ‘నాగిని’ సీరియల్‌తో నేషనల్ వైడ్ పాపులారిటీ సొంతం చేసుకున్న మౌనీ ఆ తర్వాత వెండితెరపై కూడా మంచి పేరే తెచ్చుకుంది.ముఖ్యంగా రణబీర్ కపూర్, ఆలియా భట్ నటించిన ‘బ్రహ్మాస్త్ర’ (2022) సినిమాలో నెగెటివ్ షేడ్ ఉన్న ‘జునూన్’ పాత్రలో మౌనీ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఆ తర్వాత ఒటిటిలో ‘సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ’ (2023) సిరీస్‌లోనూ, రీసెంట్‌గా ‘లవ్ సెక్స్ ఔర్ ధోఖా 2’ (2024) చిత్రంలోనూ మెరిసింది. ప్రస్తుతం భర్తకి డివోర్స్ ఇచ్చిందన్న వార్తల మధ్యే వరుస ఇంటర్నేషనల్ ఈవెంట్స్, సరికొత్త ప్రాజెక్టులతో కెరీర్ పరంగా ఫుల్ బిజీగా గడుపేస్తుంది ఈ అమ్మడు.  మొత్తానికి ఒకవైపు కేన్స్ వేదికపై భారతీయ పటోలా కళను వరల్డ్ వైడ్ గా ప్రమోట్ చేస్తూనే మరో వైపు  తన గ్లామర్ పవర్‌తో ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది ఈ నాగిని బ్యూటీ.

Related News

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

ఫిగర్ బాలేదని టార్చర్.. 40 ఏళ్లొచ్చాకే ఆ నరకం నుండి బయటపడ్డానంటున్న తారక్ హీరోయిన్

యాంకర్ సుమ హీరోయిన్‌గా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా ?

‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్..ఇదైనా ఖాయమా యష్?

72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు.. ఉత్తమ చిత్రం ఏదంటే?

విక్రమ్ 1 సక్సెస్.. చిరు ఫిదా: ప్రైవేట్ రాకెట్ ప్రయోగంపై మెగాస్టార్ క్రేజీ రియాక్షన్!

Big Stories

Advertisement
×