TV Buying Guide: ప్రస్తుత డిజిటల్ యుగంలో స్మార్ట్ టీవీలు కేవలం ఛానెళ్లు చూసే వస్తువులుగా మాత్రమే కాదు. అవి మన ఇంటిని ఒక డిజిటల్ ఎంటర్‌టైన్‌మెంట్ హబ్‌గా మార్చేస్తున్నాయి. ఓటీటీల హవా పెరిగిన తర్వాత హోమ్ థియేటర్ ఫీల్ సొంతం చేసుకోవడానికి ప్రతి ఒక్కరూ లేటెస్ట్ స్మార్ట్ టీవీల వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే.. టెక్నాలజీ ప్రతిరోజూ మారుతోంది. ఈ సంవత్సరంలో మార్కెట్లోకి వస్తున్న సరికొత్త స్మార్ట్ టీవీలలో అడ్వాన్స్డ్ ఫీచర్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కొత్త టీవీ కొనేటప్పుడు ఏయే ఫీచర్లు తప్పనిసరిగా ఉండాలో ఇప్పుడు వివరంగా చూద్దాం.
1.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పిక్చర్ అప్‌స్కేలింగ్:
ప్రస్తుతం స్మార్ట్ టీవీ రంగంలో ఏఐ విప్లవం నడుస్తోంది. ఈ ఏడాది వచ్చే బెస్ట్ స్మార్ట్ టీవీలలో ‘AI పిక్చర్ అండ్ సౌండ్ అప్‌స్కేలింగ్’ బెస్ట్ ఫీచర్. మనం చూసే పాత సినిమాలు లేదా సాధారణ హెచ్‌డీ కంటెంట్‌ను కూడా ఈ ఏఐ ప్రాసెసర్లు రియల్-టైమ్‌లో అనలైజ్ చేసి, దాన్ని అల్ట్రా హెచ్‌డీ లేదా 4K క్వాలిటీకి మెరుగు పరుస్తాయి. దీని వల్ల స్క్రీన్ పైన ప్రతి విజువల్ అత్యంత స్పష్టంగా, సహజమైన రంగులతో కనిపిస్తుంది. కాబట్టి టీవీ కొనేటప్పుడు అందులో పవర్‌ఫుల్ ఏఐ ప్రాసెసర్ ఉందో లేదో ఖచ్చితంగా చూసుకోవాలి.
2.నెక్స్ట్-జనరేషన్ డిస్‌ప్లే టెక్నాలజీ (OLED & Mini-LED):
టీవీకి ప్రాణం డిస్‌ప్లే ప్యానెల్. ఈ ఏడాదిలో సాధారణ ఎల్‌ఈడీ (LED) స్క్రీన్ల కంటే ఓఎల్ఈడీ (OLED) లేదా మినీ-ఎల్‌ఈడీ (Mini-LED) డిస్‌ప్లేలు ఎక్కువగా ట్రెండ్ అవుతున్నాయి. ఓఎల్ఈడీ స్క్రీన్లు ప్రతి పిక్సెల్‌ను విడివిడిగా కంట్రోల్ చేయడం ద్వారా పిచ్-బ్లాక్ చీకటిని, అద్భుతమైన కాంట్రాస్ట్‌ను అందిస్తాయి.మరోవైపు మినీ-ఎల్‌ఈడీ టెక్నాలజీ స్క్రీన్ బ్రైట్‌నెస్‌ను భారీగా పెంచుతుంది. మీరు ఇంట్లో పగటిపూట ఎక్కువ వెలుతురు ఉన్న రూమ్‌లో టీవీ చూసినా కూడా విజువల్స్ స్పష్టంగా కనిపించాలంటే ఈ అడ్వాన్స్డ్ ప్యానెల్స్ ఉండటం చాలా ముఖ్యం.
3. హై-రిఫ్రెష్ రేట్, నెక్స్ట్-జెన్ గేమింగ్ ఫీచర్లు:
స్మార్ట్ టీవీలు ఇప్పుడు కేవలం సినిమాలకు మాత్రమే కాదు. గేమింగ్‌కు కూడా కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నాయి. యూత్ టీవీలలో ప్లేస్టేషన్ లేదా ఎక్స్‌బాక్స్ కనెక్ట్ చేసి గేమ్స్ ఆడటానికి ఇష్టపడుతున్నారు. కాబట్టి ఈ ఏడాది కొనే టీవీలలో కనీసం 120Hz లేదా 144Hz రిఫ్రెష్ రేట్ ఉండటం అవసరం. దీనితో పాటు HDMI 2.1 పోర్ట్, వీఆర్ఆర్, ఆటో లో-లేటెన్సీ మోడ్ వంటి ఫీచర్లు ఉంటేనే హై-ఎండ్ గ్రాఫిక్స్ గేమ్స్ ఆడేటప్పుడు ఎలాంటి లాగ్ లేదా స్క్రీన్ టియరింగ్ లేకుండా గేమింగ్ స్మూత్‌గా సాగుతుంది.
3. సినిమాటిక్ ఆడియో :
మంచి విజువల్స్‌తో పాటు హృదయాన్ని కదిలించే సౌండ్ ఉంటేనే థియేటర్ ఫీల్ వస్తుంది. కొత్త టీవీలలో ‘డాల్బీ అట్మోస్’ లేదా ‘డీటీఎస్:ఎక్స్’ ఆడియో సపోర్ట్ మస్ట్-హావ్ ఫీచర్‌గా మారింది. ఈ టెక్నాలజీలు రూమ్ అంతటా శబ్దాన్ని త్రీ-డైమెన్షనల్ పద్ధతిలో ప్రసరింపజేస్తాయి. అంటే.. సినిమాలో ఏదైనా విమానం పైనుంచి వెళ్తుంటే.. ఆ శబ్దం మనకు నిజంగా పైనుంచే వస్తున్నట్లు అనిపిస్తుంది. అదనంగా హోమ్ థియేటర్ స్పీకర్లను లేదా సౌండ్‌బార్‌ను వైర్‌లెస్ పద్ధతిలో కనెక్ట్ చేయడానికి వీలుగా ఈ-ఆర్క్ పోర్ట్ ఉందో లేదో చూసుకోవాలి.
Also Read: ఫ్రిజ్‌లో ఏ ఆహారాన్ని ఏ షెల్ఫ్‌లో పెట్టాలి? 99 % మంది చేసే పొరపాట్లు ఇవే !
4. స్మార్ట్ హోమ్ ఇంటెగ్రేషన్ , లేటెస్ట్ ఓఎస్:
నేటి ఇళ్లలో స్మార్ట్ బల్బులు, ఏసీలు, రోబోట్ వాక్యూమ్ క్లీనర్లు వాడుతున్నారు. 2026 నాటి స్మార్ట్ టీవీ కేవలం ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాకుండా.. ఇంటి పరికరాలన్నింటినీ కంట్రోల్ చేసే ఒక డ్యాష్‌బోర్డ్‌లా పని చేయాలి. దీనికోసం గూగుల్ టీవీ లేదా లేటెస్ట్ వెబ్ఓఎస్ ఉన్న టీవీలను ఎంచుకోండి. ఇవి బిల్ట్-ఇన్ గూగుల్ అసిస్టెంట్ లేదా అలెక్సా వాయిస్ కంట్రోల్‌తో వస్తాయి. రిమోట్ కూడా లేకుండా కేవలం మీ వాయిస్ కమాండ్ ద్వారా లేదా మాటల ద్వారా టీవీని.. అలాగే ఇంటిలోని ఇతర స్మార్ట్ పరికరాలను ఈజీగా ఆపరేట్ చేయవచ్చు.
గమనిక:
మార్కెట్లో టీవీ కొనేటప్పుడు కేవలం తక్కువ ధరకే వస్తోందని పాత ఫీచర్లు ఉన్న మోడల్స్ వైపు వెళ్లకండి. భవిష్యత్తులో వచ్చే కొత్త యాప్‌లు, ఓటీటీ కంటెంట్ సజావుగా పనిచేయాలంటే కనీసం 2GB లేదా 3GB ర్యామ్ , 16GB లేదా 32GB స్టోరేజ్ ఉన్న వేరియంట్‌లను ఎంచుకోవడం చాలా మంచిది. దీని వల్ల మీ స్మార్ట్ టీవీ రాబోయే ఐదేళ్ల పాటు ఎలాంటి సాఫ్ట్‌వేర్ సమస్యలు లేకుండా నడుస్తుంది.