E-Paper
Advertisement

HMD 101 Mobile: 1000mAh బ్యాటరీ, 1.77 అంగుళాల డిస్‌ప్లే.. రూ.949కే HMD ఫీచర్‌ ఫోన్లను సొంతం చేసుకోవచ్చు!

HMD 101 Mobile: 1000mAh బ్యాటరీ, 1.77 అంగుళాల డిస్‌ప్లే.. రూ.949కే HMD ఫీచర్‌ ఫోన్లను సొంతం చేసుకోవచ్చు!
Advertisement

HMD 101 Mobile: ఫిన్లాండ్‌కు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ HMD నుంచి భారత మార్కెట్‌లోకి రెండు ఫీచర్ ఫోన్లు ఎంట్రీ ఇచ్చాయి. ప్రస్తుతం ఇవి HMD 100, HMD 101 పేరుతో అందుబాటులో ఉన్నాయి. ఈ ఫోన్లు ఇన్‌బిల్ట్‌ FM, 3.5mm హెడ్‌ఫోన్‌ జాక్‌ వంటి ఫీచర్లను కలిగి ఉన్నాయి. ఈ మొబైల్స్ డిసెంబరు 5వ తేదీ నుంచి కొనుగోలు చేసేందుకు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడీ HMD ఫోన్ల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

HMD నుంచి విడుదలైన ఈ రెండు ఫీచర్‌ ఫోన్లు 1.77 అంగుళాల డిస్‌ప్లే, Unisoc 6533G చిప్‌సెట్‌ను కలిగి ఉంటుంది. ఇకపోతే HMD 101 మోడల్ మొబైల్‌ 4MB RAM, 4MB స్టోరేజీతో జతచేసి ఉంటుంది. అదే HMD 100 మోడల్‌ ఫోన్ 8MB RAM, 4MB స్టోరేజీతో లభిస్తుంది.

Advertisement

Read Also: ఇలాంటి ఛాన్స్ మళ్లీ రాదు మావా.. అమెజాన్‌లో మోటోరోలా ఎడ్జ్ 60ప్రోపై కళ్లుచెదిరే డీల్!

7 గంటల బ్యాటరీ బ్యాకప్:

1000mAh బ్యాటరీ లైఫ్‌ను కలిగి ఉన్న హెచ్‌ఎమ్‌డీ 101 ఫీచర్ ఫోన్‌ను ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపు 7 గంటల వరకు ఉపయోగించుకోవచ్చని కంపెనీ తెలిపింది. అలాగే.. హెచ్‌ఎమ్‌డీ 100 ఫీచర్‌ ఫోన్‌ 800mAh బ్యాటరీని కలిగి ఉంది. దీనిని పూర్తిగా ఛార్జ్ చేస్తే.. 6 గంటల టాక్‌టైంను పొందొచ్చు. ఇది 2.7W వైర్‌ ఛార్జింగ్‌ సపోర్టును కలిగి ఉంటుంది. ఇక కనెక్టివిటీ పరంగా చూసుకుంటే.. ఈ రెండు ఫోన్లు ఇన్‌బిల్ట్‌ FM రేడియో, మైక్రో USB పోర్టు, 3.5mm హెడ్‌ఫోన్ జాక్‌ను కలిగి ఉంటుంది. HMD 101 ఫోన్ బిల్ట్ ఇన్‌ MP3 ప్లేయర్‌, ఆటో కాల్‌ రికార్డింగ్‌ వంటి ఫీచర్లను కూడా కలిగి ఉంది. ఇక HMD 100 మోడల్‌ డ్యూయల్ LED ఫ్లాష్‌ యూనిట్స్‌ను కలిగి ఉంది.

రూ.949 మాత్రమే:

Advertisement

హెచ్‌ఎమ్‌డీ 101 ఫీచర్‌ ఫోన్‌ ధర రూ.1049 కాగా.. హెచ్‌ఎమ్‌డీ 101 ఫోన్ ధర రూ.1099 గా ఉంది. అయితే, ఈ రెండు ఫోన్లను ప్రారంభ ఆఫర్‌లో భాగంగా రూ.949 ధరకే కొనుగోలు చేయవచ్చు. ఈ మొబైల్ ఫోన్లు HMD ఇండియా ఆన్‌లైన్‌ స్టోర్‌ సహా ప్రధాన ఇ-కామర్స్‌ వెబ్‌సైట్లు, ఆఫ్‌లైన్‌ రిటైల్‌ స్టోరుల్లో లభిస్తుంది. ఇకపోతే HMD 101 ఫీచర్‌ ఫోన్‌ బ్లూ, గ్రే, టీల్ కలర్ వేరియంట్స్‌లో, అదే HMD 100 ఫీచర్ ఫోన్‌ రెడ్‌, టీల్, గ్రే కలర్‌ వేరియంట్స్‌లో లభిస్తుంది.

Read Also: బిగ్ బ్యాటరీతో రియల్‌మీ పీ4ఎక్స్ వచ్చేసింది.. లాంచ్ ఆఫర్ పోనూ కేవలం రూ.13,499 మాత్రమే!

Related News

భారీ బ్యాటరీ, అల్టిమేట్ లుక్.. మార్కెట్‌ను షేక్ చేయడానికి Redmi 17 5G వచ్చేసింది!

రూ.15,799లకే 43ఇంచుల టీవీ..ఆఫర్ అంటే ఇలా ఉండాలి

చైనా ఫోన్లకు చెక్ పెడుతూ.. హైదరాబాద్‌లోనే తయారైన తొలి Mivi 5G ఫోన్ వచ్చేస్తోంది!

రూ.వెయ్యిలోపు బెస్ట్ గేమింగ్ ఇయర్ బడ్స్..వెంటనే కొనేయండి

డెల్ నుంచి సూపర్ AI ల్యాప్‌టాప్‌లు లాంచ్.. 5G, Wi-Fi 7 ఫీచర్లతో కిరాక్ లుక్!

ట్రెండీ కలర్, టెర్రిఫిక్ ఫీచర్స్.. పాకెట్ ఫ్రెండ్లీ ధరలో బోల్ట్ Z60 పింక్ ఇయర్‌బడ్స్!

పాత లాప్‌టాప్ ఉందా? రిలయన్స్ జియో తెచ్చిన అప్డేట్‌తో సూపర్ స్పీడ్ PCగా మార్చేయండి!

యాంకర్ ప్రైమ్ గాడ్జెట్స్‌పై భారీ డిస్కౌంట్లు.. ఈ సెప్టెంబర్ బెస్ట్ డీల్స్ ఇవే!

Big Stories

Advertisement
×