E-Paper
Advertisement

ఇదే ఈ మ్యాచ్ ఇండియాలో జ‌రిగుంటే, శ్రీలంక 200ల‌కే ఆలౌట్ అయ్యేది

ఇదే ఈ మ్యాచ్ ఇండియాలో జ‌రిగుంటే, శ్రీలంక 200ల‌కే ఆలౌట్ అయ్యేది
Advertisement

Shahid Afridi On SL VS NZ :  పాకిస్తాన్ గడ్డపై వన్డే ట్రై సిరీస్ చాలా ఉత్కంఠ భరితంగా జరుగుతోంది. ప్రతి మ్యాచ్ చివరి వరకు కొనసాగుతూ అభిమానులకు మంచి ఎంటర్టైన్మెంట్ అందిస్తోంది. ఇక గురువారం రోజున ఈ సిరీస్ లో భాగంగా ఇంగ్లాండ్ వర్సెస్ శ్రీలంక మధ్య మ్యాచ్ జరిగింది. ఈ సందర్భంగా ఒకే మ్యాచ్ లో 859 పరుగులు నమోదు అయ్యాయి. అంతేకాదు ఇంగ్లాండ్ విధించిన భారీ టార్గెట్ ను అవలీలగా శ్రీలంక ఛేదించింది. దీంతో శ్రీలంకపై ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది.

ఇదే ఈ మ్యాచ్ ఇండియాలో జ‌రిగుంటే, శ్రీలంక 200ల‌కే ఆలౌట్ అయ్యేది

ఇక ఇంగ్లాండ్ పై విజ‌యం సాధించిన శ్రీలంక మ్యాచ్ పై షాహిద్ అఫ్రిది కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. భారత గడ్డపై ఇదే మ్యాచ్ జరిగితే, శ్రీలంక 200 పరుగులకు కుప్పకూలేదని బాంబు పేల్చారు. అక్కడి అంపైర్లను కొనుగోలు చేసి టీమిండియా గెలిచేలా కుట్రలు చేసేవారని ఆరోపించారు. ఇండియాలో ఏ మ్యాచ్ జరిగిన కూడా అంపైర్లను బీసీసీఐ కొనుగోలు చేయడం అలవాటైందని ఫైర్ అయ్యారు. కానీ పాకిస్తాన్ లో అలాంటి పరిస్థితులు ఉండబోవమని..తాము న్యాయంగా పత్తిత్తులు లాగా ఉంటామని వ్యాఖ్యానించారు. ఇండియా లాగా ఎవ‌రినీ ఛీటింగ్ చేసే ప‌రిస్థితులు ఉండ‌బోవంటూ షాహిద్ అఫ్రిది హాట్ కామెంట్స్ చేశారు. ఈ క్ర‌మంలోనే షాహిద్ అఫ్రిది చేసిన వ్యాఖ్య‌లు దుమారం రేపుతున్నాయి.

Advertisement

Vaibhav Suryavanshi’s father sanjeev Suryavanshi on his son warming benches over gautam gambhir: ఓరేయ్ గంభీర్..ఆ కుర్చీలాట ఆపి, నా కొడుకును ఆడించు !

ఇండియా చేసేదంతా చీటింగే..అంపైర్ల‌ను కొనేసి, శ్రీలంక‌ను ఓడించేవాళ్లు

ఇంగ్లాండ్ వర్సెస్ శ్రీలంక మధ్య జరిగిన వన్డే మ్యాచ్ చాలా థ్రిల్లింగ్ గా సాగిందని షాహిద్ అఫ్రిది వ్యాఖ్యానించారు. ఈ మ్యాచ్ లో హ్యారీ బ్రూక్ డబుల్ సెంచరీ చేయడం.. అటు లంక ఆటగాళ్లు ఇరగదీయడం అభిమానులకు మంచి ట్రీట్ ఇచ్చినట్టు అయిందని తెలిపారు. తమ పాకిస్తాన్ మైదానాలలో ఇలాంటి మ్యాచ్ లు జరగడం గర్వకారణంగా ఉందని వ్యాఖ్యానించారు. అయితే ఇవే మ్యాచులు ఇండియాలో జరిగితే ఫలితాలు తలకిందులు అయ్యేవని బాంబు పేల్చారు.

Advertisement

కచ్చితంగా అంపైర్లకు డబ్బులు ఇచ్చి శ్రీలంకను 200కు ఆల్ అవుట్ చేసేలా టీమిండియా కుట్ర చేసేదని ఆరోప‌ణ‌లు చేశారు. కానీ ఇండియాలో జరిగినట్టుగా పాకిస్థాన్ లో ఇలాంటి కుట్రలు జరగబోవు అని తెలిపారు. పాకిస్తాన్ లో అందరికీ సమన్యాయం అన్నట్లుగానే వ్యవస్థ నడుస్తోందని తెలిపారు. ఎవరిని చీటింగ్ చేయాల్సిన అవసరం తమకు లేదని కుండబద్దలు కొట్టి చెప్పారు. కానీ భారతదేశంలో అంపైర్లు మొత్తం ఏకపక్ష నిర్ణయాలకు కట్టుబడి ఉంటారన్నారు. దీనిపై అంద‌రూ న్యాయ పోరాటం చేయాల‌ని షాహిద్ అఫ్రిది డిమాండ్ చేశారు.

Sara Tendulkar Birthday Celebration With Team India Odi Captain Shubman Gill : స‌చిన్ కోడ‌లు ముందే సారా, గిల్ రొమాన్స్‌…? షాకింగ్ ఫోటోలు వైర‌ల్

Related News

బ‌వుమా ఉన్న‌ది మూడు ఫీట్లే…వాడికి తిక్క రేగితే 100 అడుగుల లోతులో పాతేస్తాడు

ఫిక్సింగ్ చేసి గెలిచారు…టీమిండియా బ్యాట్ల‌ను చెక్ చేయాల్సిందే

హ్యారీ బ్రూక్ కు ఒళ్లంతా పొగ‌రే…శ్రీలంక ప్లేయ‌ర్ల‌పై ఉమ్మేశాడంటూ ట్రోల్స్‌!

మేం పిచ్చోళ్ల‌మేం కాదు…ఆ కార‌ణంతోనే తిల‌క్ వ‌ర్మను 3వ స్థానంలో పంపాం

న‌మ‌న్ ధీర్ ఎంట్రీ వెనుక ముంబై కుట్ర‌లు ? హార్ధిక్ పాండ్యా కెరీర్ క్లోజ్ అయిన‌ట్టేనా !

ఒక్క మ్యాచ్ లో 859 పరుగులా? హైవే లాంటి పిచ్ లంటూ పాకిస్తాన్ ప‌రువు తీసిన ఇర్ఫాన్ ప‌ఠాన్

ఒరేయ్ గంభీరా ? నీ దిక్కుమాలిన ప్ర‌యోగాల‌తో తిల‌క్, ఇషాన్ ల‌ను రోడ్డున ప‌డేయం ఖాయం!

Big Stories

Advertisement
×