E-Paper
Advertisement

YS Vijayamma Letter: చెల్లికి జగన్‌ న్యాయం చేస్తాడని ఆశిస్తున్నా.. వైఎస్ ఆస్తులపై విజయమ్మ కీలక ప్రకటన

YS Vijayamma Letter: చెల్లికి జగన్‌ న్యాయం చేస్తాడని ఆశిస్తున్నా..  వైఎస్ ఆస్తులపై విజయమ్మ కీలక ప్రకటన
Advertisement

YS Vijayamma Letter: వైఎస్సార్ కుటుంబ ఆస్తుల వివాదంపై ఆయన భార్య వైఎస్ విజయమ్మ సంచల‌న లేఖ‌ విడుదల చేశారు. తన కుమారుడు జగన్మోహన్ రెడ్డి, కుమార్తె షర్మిల మధ్య జరుగుతున్న ఆస్తుల యుద్ధంపై ఆమె స్పందిస్తూ.. అనేక కీలక వాస్తవాలను వెల్లడించారు. 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి మరణించే వరకు ఉన్న ఆస్తులన్నీ కుటుంబ ఉమ్మడి ఆస్తులేనని, ఇప్పటివరకు ఆస్తుల పంపకం అధికారికంగా జరగలేదని ఆమె స్పష్టం చేశారు. తన నలుగురు మనవలు, మనవరాళ్లకు ఆస్తులన్నీ సమానంగా పంచాలన్నదే వైఎస్సార్ ఆశయం, ఆదేశమని ఆమె గుర్తు చేశారు.

షర్మిలకు న్యాయంగా దక్కాల్సిన వాటా గురించే ఎంఓయూ (MOU) రాశారని విజయమ్మ పేర్కొన్నారు. నిజానికి ఎంఓయూలో రాసిన దానికంటే షర్మిలకు ఎక్కువ ఆస్తి దక్కాల్సి ఉందని, సరస్వతి సిమెంట్స్‌తో పాటు ఎంఓయూలో లేని యెలహంక భూమి కూడా షర్మిలదేనని ఆమె వివరించారు. జగన్ తన సోదరికి ఇచ్చానని చెబుతున్న డబ్బు ఆస్తి పంపకం కాదని, అది కేవలం ఆమె వాటాకు రావాల్సిన డివిడెండ్ మాత్రమేనని విజయమ్మ స్పష్టం చేశారు. ఆస్తుల విషయంలో జగన్ తన మేనల్లుడికి, మేనకోడలికి ఇప్పటివరకు అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేస్తూ, ఎప్పటికైనా వారికి న్యాయం చేస్తాడని ఒక తల్లిగా ఆశిస్తున్నట్లు తెలిపారు.

Advertisement

ఆస్తుల పంపకం విషయంలో జరుగుతున్న దుష్ప్రచారాన్ని విజయమ్మ తీవ్రంగా ఖండించారు. గతంలో వైఎస్సార్ జగన్‌కు కొన్ని ఆస్తులు ఇచ్చినట్లే షర్మిలకు కూడా ఇచ్చారని, దానిని పూర్తిస్థాయి ఆస్తి పంపకంగా పరిగణించలేమని ఆమె వివరించారు. “నిజం ఏమిటో నా దేవుడికి, నా కొడుకుకి కూడా తెలుసు” అని పేర్కొంటూ, అసత్యాలను ప్రచారం చేస్తున్న వారిపై ఆమె మండిపడ్డారు. వైఎస్సార్ భార్యగా చేతులు జోడించి అడుగుతున్నానని, రాజకీయ లబ్ధి కోసం ఈ కుటుంబ వ్యవహారాన్ని మీడియాలో పదేపదే ప్రస్తావించవద్దని ఆమె వేడుకున్నారు. దేవుని సాక్షిగా తాను రాసినవన్నీ అక్షర సత్యాలని ఆమె తన లేఖలో ఉద్ఘాటించారు.

Read Also: Roja Selvamani: చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌పై.. మాజీ మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు

Advertisement

 

Related News

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం.. బోల్తా పడ్డ కారు.. స్పాట్‌లో!

ఎట్టకేలకు ముహూర్తం ఖరారు.. భోగాపురం ఎయిర్ పోర్ట్ ఓపెన్, ప్రధాని మోదీ చేతుల మీదుగా, కాకపోతే

ఏపీలో కరోనా కేసుల కలకలం.. కొత్త రకం వేరియంట్ గుర్తింపు, ఆగ్నేయాసియాలో ఎక్కువగా..

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్.. ఆ జిల్లాల్లో కుండపోత వర్షాలు.. ఐదు రోజులు ఇంతే!

లారీని ఢీ కొట్టిన కారు.. స్పాట్‌లో నలుగురు మృతి, విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం

Big Stories

Advertisement
×