Honor Magic 9 Series: టెక్ మార్కెట్లో హానర్ కంపెనీ తమ సరికొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్లతో సంచలనం సృష్టించడానికి సిద్ధమవుతోంది. గతేడాది అక్టోబర్‌లో వచ్చిన Magic 8 సిరీస్‌కు సీక్వెల్‌గా Honor Magic 9 సిరీస్‌ను కంపెనీ తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. ఈ అప్‌కమింగ్ సిరీస్‌కు సంబంధించి ప్రముఖ చైనీస్ టిప్‌స్టర్ స్మార్ట్ పికాచు కొన్ని కీలకమైన వివరాలను లీక్ చేశారు. ముఖ్యంగా ఈ ఫోన్లలో రాబోయే బ్యాటరీ కెపాసిటీ ఇప్పుడు టెక్ ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.
ఈ సరికొత్త సిరీస్‌లో రాబోయే మూడు మోడళ్లలోనూ ఏకంగా 8,000mAh బ్యాటరీని అందించబోతున్నట్లు లీక్స్ ద్వారా తెలుస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న Magic 8 మోడల్‌లో 7,000mAh బ్యాటరీ, అలాగే ప్రీమియం వెర్షన్ అయిన Magic 8 Pro ఆర్‌ఎస్‌ఆర్‌లో 7,200mAh బ్యాటరీ ఉన్నాయి. వీటన్నింటికంటే భారీ అప్‌గ్రేడ్‌తో వస్తున్న Magic 9 సిరీస్ బ్యాటరీ లైఫ్ విషయంలో స్మార్ట్‌ఫోన్ లవర్స్‌కు సరికొత్త అనుభూతిని ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.
ఫోన్ స్క్రీన్ విషయంలోనూ హానర్ ఎక్కడా రాజీ పడటం లేదు. ఈ సిరీస్‌లోని మూడు మోడళ్లలో 1.5K రిజల్యూషన్‌తో కూడిన సరికొత్త OLED ప్యానెల్ డిస్‌ప్లేలను ఉపయోగించబోతున్నట్లు సమాచారం. దీనివల్ల ఫోన్ వాడుతున్నప్పుడు విజువల్స్ చాలా స్పష్టంగా, కలర్‌ఫుల్‌గా కనిపిస్తాయి. గేమింగ్ ఆడేవారికి, ఓటీటీలో సినిమాలు చూసేవారికి ఈ స్క్రీన్ అద్భుతమైన ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది.
Also Read: చిన్నగా, స్టైలిష్‌గా, అంతకు మించి హాట్‌గా.. వచ్చే వారమే Oura Ring 5 గ్రాండ్ ఎంట్రీ?!
ఇక ఫొటోగ్రఫీ పరంగా కూడా ఈ ఫోన్ సరికొత్త రికార్డులు సృష్టించబోతోంది. ఈ సిరీస్‌లో 200MP ప్రైమరీ కెమెరాను ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. దీనికి మెరుగైన ఇమేజ్ స్టెబిలైజేషన్ టెక్నాలజీని కూడా జోడిస్తున్నారు. దీనివల్ల రాత్రిపూట లేదా తక్కువ వెలుతురు ఉన్నప్పుడు కూడా ఫొటోలు, వీడియోలు చాలా క్లారిటీగా వస్తాయి. అంతేకాదు.. హాలీవుడ్ సినిమాల్లో వాడే ప్రొఫెషనల్ కెమెరా కంపెనీ ARRI స్పూర్తితో ప్రత్యేకమైన వీడియో ఫీచర్లను కూడా ఇందులో పరిచయం చేయబోతున్నారు.
ప్రస్తుతానికి ఈ సిరీస్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు అధికారికంగా తెలియాల్సి ఉంది. కంపెనీ ఇప్పటివరకు దీని లాంచ్ తేదీని ప్రకటించలేదు. అయితే హానర్ తన మునుపటి Magic 7, Magic 8 సిరీస్‌లను అక్టోబర్ నెలలోనే విడుదల చేసింది. కాబట్టి.. ఈ సరికొత్త Magic 8 సిరీస్ కూడా ఈ ఏడాది అక్టోబర్ నాటికి మార్కెట్లోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
Also Read: Realme 16T భారత్‌లో లాంచ్.. 144Hz డిస్‌ప్లే, మిలిటరీ గ్రేడ్ బాడీతో పాటు మరెన్నో ప్రత్యేకతలు!