Varun Dhawan: డేవిడ్ ధావన్, వరుణ్ ధావన్….ఈ కాంబినేషన్‌లో వచ్చిన ‘మై తేరా హీరో’, ‘జుడ్వా 2’, ‘కూలీ నెం. 1’వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎలా నవ్వుల పూలు పూయించాయో మనకి తెల్సిందే.ఇపుడు కాంబోలో మరో ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్‌టైనర్ థియేటర్లలోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దమైంది.యస్.. డేవిడ్ ధావన్ దర్శకత్వంలో వరుణ్ ధావన్ హీరోగా వస్తున్న తాజా చిత్రం ‘హై జవానీ తో ఇష్క్ హోనా హై’.ఈ సినిమాలో వరుణ్ కి జోడీగా మృణాల్ ఠాకూర్, పూజా హెగ్డేలు మెరవబోతున్నారు.ఇక ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ తాజాగా విడుదలై సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
భార్యాభర్తలుగా వరుణ్ ధావన్, మృణాల్ ఠాకూర్
ట్రైలర్ చూస్తే .. ఒక రకమైన కోర్టు డ్రామా సీన్‌తో ట్రైలర్ ప్రారంభం కావడం విశేషం. ఇందులో వరుణ్ ధావన్, మృణాల్ ఠాకూర్ భార్యాభర్తలుగా కనిపిస్తున్నారు. వరుణ్‌కు పిల్లలు కావాలని కోరుకోవడం, కానీ మృణాల్ దానికి అస్సలు సిద్ధంగా లేకపోవడంతో వీరి మధ్య విభేదాలు వచ్చి విడాకుల కోసం కోర్టు మెట్లెక్కుతారు. ఆ తర్వాత కథలో ట్విస్ట్ ఇస్తూ వరుణ్ ధావన్ విదేశాలకు వెళ్తాడు.
also read :గోల్డెన్ సీజన్ గోవిందా.. టాలీవుడ్ హిస్టరీలోనే మోస్ట్ డిజాస్టరస్ సమ్మర్ ఇదేనా?
అక్కడ అతనికి అందాల భామ పూజా హెగ్డే పరిచయమవుతుంది. వీరిద్దరి మధ్య పరిచయం కాస్తా ప్రేమగా మారుతుంది. అయితే ఇక్కడే కథ అసలైన మలుపు తిరుగుతుంది. ఊహించని విధంగా అటు మాజీ భార్య మృణాల్ ఠాకూర్, ఇటు కొత్త ప్రేయసి పూజా హెగ్డే ఇద్దరూ ఒకేసారి ప్రెగ్నెంట్ అవుతారు. ఈ ఇద్దరు భామల మధ్య ఇరుక్కుపోయిన వరుణ్ ధావన్, అసలు నిజం ఎక్కడ బయటపడుతుందో అని భయపడుతూ, ఆ పరిస్థితిని మేనేజ్ చేయడానికి ఎలాంటి అబద్ధాలు ఆడాడు, దానివల్ల ఎలాంటి గందరగోళ పరిస్థితులు తలెత్తాయి అనేదే ఈ సినిమా కథ అని ట్రైలర్ చూస్తే అర్థమైపోతుంది.
కథ మొత్తం చెప్పేసిన ట్రైలర్
దర్శకుడు డేవిడ్ ధావన్ తన పాత శైలిలోనే ట్రైలర్‌తోనే సినిమా మొత్తం కథను చెప్పేస్తూ, స్క్రీన్ ప్లే మరియు కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే ప్లాన్ చేసినట్టు తెలిసిపోతుంది.. వరుణ్ ధావన్ మార్క్ ఎనర్జీ, మృణాల్ ఠాకూర్ ఎమోషనల్ అండ్ స్టైలిష్ లుక్స్, పూజా హెగ్డే గ్లామర్ ఈ సినిమాకు మెయిన్ అసెట్ అని చెప్పాలి.ఇక ఈ ముగ్గురితో పాటు బాలీవుడ్ పాపులర్ నటులు మనీష్ పాల్, చుంకీ పాండే, జిమ్మీ షెర్గిల్, మౌని రాయ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తూ వినోదాన్ని పంచనున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ టిప్స్ ఫిలింస్ అధినేత రమేష్ తౌరానీ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.
నవ్విస్తుందా లేక నవ్వులపాలవుతుందా !
గతంలో వరుణ్ ధావన్ నటించిన ‘భేదియా’, ‘జుగ్‌జుగ్ జీయో’ వంటి చిత్రాలు కమర్షియల్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాయి. అలాగే మృణాల్ ఠాకూర్ టాలీవుడ్‌లో ‘సీతా రామం’, ‘హాయ్ నాన్న’ వంటి క్లాసిక్ హిట్స్‌తో మెప్పించగా, పూజా హెగ్డే ‘అల వైకుంఠపురములో’ వంటి ఇండస్ట్రీ హిట్లతో స్టార్ ఇమేజ్ సొంతం చేసుకుంది. ఇప్పుడు వీరిద్దరూ కలిసి నటిస్తున్న ఈ హిందీ ప్రాజెక్ట్ పై సౌత్ ఇండస్ట్రీలోనూ భారీ అంచనాలు ఉన్నాయి. అన్ని హంగులతో సిద్ధమైన ఈ క్రేజీ కామెడీ మూవీ జూన్ 5న వరల్డ్ వైడ్ గా థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ కానుంది. చూడాలి మరి నవ్విస్తామంటూ వస్తున్న ఈ సినిమా నిజంగా నవ్విస్తుందా లేక నవ్వులపాలవుతుందా !
also read :టాలీవుడ్‌లో మొదలైన అసలు ‘సినిమా’.. నిర్మాతలు వర్సెస్ ఎగ్జిబిటర్స్.. ‘పెద్ది’ రిలీజ్ అవుతుందా?