HOPPUP NEURA earbuds: ప్రస్తుతం టెక్నాలజీ మారుతున్న కొద్దీ మన గాడ్జెట్స్ కూడా మరింత అడ్వాన్స్డ్‌గా మారిపోతున్నాయి. ముఖ్యంగా కాలేజ్ స్టూడెంట్స్, ఫిట్‌నెస్ లవర్స్, ఆఫీస్ ఉద్యోగుల కోసం మార్కెట్లో.. అనేక రకాల వైర్ లెస్ ఇయర్ బడ్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే.. సాధారణ ఇయర్‌బడ్స్‌కు భిన్నంగా, ఏకంగా స్మార్ట్‌వాచ్ లాంటి హెల్త్ ట్రాకింగ్ ఫీచర్లతో.. వస్తున్న సరికొత్త గాడ్జెట్ ఇది . కేవలం రూ. 1,599 ధరతో మార్కెట్లో సంచలనం సృష్టిస్తున్న ఈ ట్రూ వైర్‌లెస్ ఇయర్ బడ్స్ గురించి ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం.
ఈ ఇయర్ బడ్స్ డిజైన్ చాలా డిఫరెంట్ అండ్ ట్రెండీగా ఉంటుంది. ఇవి ఓపెన్-ఇయర్ ఎయిర్‌క్లిప్ డిజైన్‌తో వస్తాయి, అంటే .. చెవుల్లోకి పూర్తిగా చొప్పించకుండా క్లిప్ లాగా తగిలించుకోవచ్చు. దీని వల్ల ఎక్కువ సేపు వాడినా చెవులకు ఎలాంటి నొప్పి లేదా ఇబ్బంది కలగదు. బ్లాక్ కలర్ ఫినిషింగ్ తో వచ్చే ఈ ఇయర్ బడ్స్ చూడటానికి చాలా ప్రీమియంగా కనిపిస్తాయి. అలాగే ప్రయాణాలు చేసేటప్పుడు లేదా జాగింగ్ చేసేటప్పుడు ఇవి చెవుల నుంచి జారిపోయే టెన్షన్ ఉండదు.
ఇయర్ బడ్స్‌లో హెల్త్ ట్రాకింగ్ ఉండటం అంటే నిజంగా నెక్స్ట్ లెవెల్.. ఫీచర్ అనే చెప్పాలి. HOPPUP NEURA ఇయర్ బడ్స్‌లో ప్రత్యేకమైన సెన్సార్లు ఇవ్వడం జరిగింది. దీని సహాయంతో.. మీరు మీ హార్ట్ రేట్ (గుండె కొట్టుకునే వేగం), బ్లడ్ ఆక్సిజన్ లెవెల్స్ (SpO2) ను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. ప్రత్యేకంగా యాప్ సపోర్ట్ ఉండటం వల్ల మీ హెల్త్ డేటాను మీ మొబైల్‌లోనే చాలా ఈజీగా చెక్ చేసుకోవచ్చు. ఫిట్‌నెస్ మీద శ్రద్ధ పెట్టే.. వారికి ఇది నిజంగా ఒక గ్రేట్ ఆప్షన్. హెల్త్ ట్రాకింగ్ ఫీచర్లు కోరుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్.
Also Read: వైఫై కనెక్టివిటీతో పనిచేసే సీసీ కెమెరా.. కొత్త వాళ్లు కనిపిస్తే ఫోన్‌కు అలర్ట్
గాడ్జెట్స్ లో బ్యాటరీ బ్యాకప్ ఎంత ముఖ్యామో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ హాప్‌అప్ నియురా ఇయర్ బడ్స్ ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే, ఛార్జింగ్ కేస్‌తో కలిపి ఏకంగా 50 గంటల పాటు నాన్ స్టాప్ బ్యాటరీ లైఫ్‌ను అందిస్తాయి. అంటే వారం రోజుల పాటు పదే పదే ఛార్జ్ చేయాల్సిన టెన్షన్ లేకుండా ప్రశాంతంగా వాడొచ్చు. బ్లూటూత్ కనెక్టివిటీ ద్వారా .. స్మార్ట్ ఫోన్‌కు క్షణాల్లో కనెక్ట్ అయ్యి, ఎలాంటి ఆడియో లాగ్ లేకుండా క్లియర్ సౌండ్‌ను అందిస్తాయి. తక్కువ బడ్జెట్ లో ఎక్కువ బ్యాటరీ లైఫ్ ఇచ్చే ఇయర్ బడ్స్ కావాలని అనుకునే వారికి మాత్రం ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది.
తక్కువ బడ్జెట్‌లో హెల్త్ ట్రాకింగ్ ఫీచర్లు, ట్రెండీ డిజైన్ , లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ కోరుకునే వారికి ఈ మోడల్ ఇయర్ బడ్స్ నిజంగా ఒక సూపర్ ఛాయిస్. కేవలం రూ. 1,599 ధరలో లభించడం.. దీని అతిపెద్ద ప్లస్ పాయింట్. మీరు కూడా బడ్జెట్‌లో.. ఒక మల్టీపర్పస్ గాడ్జెట్ కొనాలని చూస్తుంటే..తప్పకుండా ఆర్డర్ చేసుకోండి.