Thomson 24 inch LED TV: ప్రస్తుతం ఇంటికో లేదా ఆఫీసుకో ఒక మంచి టీవీ ఉండటం చాలా సాధారణం అయిపోయింది. ముఖ్యంగా బెడ్ రూమ్, కిచెన్ లేదా చిన్న షాపుల కోసం.జ. ఎక్కువ బడ్జెట్ పెట్టకుండా కాంపాక్ట్ సైజ్‌లో లభించే టీవీలకు డిమాండ్ విపరీతంగా ఉంది. కస్టమర్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రముఖ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ ‘Thomson’ అద్భుతమైన ఫీచర్లతో.. అతి తక్కువ ధరకే ఈ ఎల్ఈడీ టీవీని మార్కెట్లోకి తెచ్చింది. కేవలం రూ.5,899 ధరతో అందుబాటులో ఉన్న ఈ మోడల్ గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
ఈ టీవీ కాంపాక్ట్ సైజ్‌లో చాలా ఆకర్షణీయంగా, మోడర్న్ లుక్‌లో ఉంటుంది. 60 సెంటీమీటర్లు అంటే.. 24 ఇంచుల స్క్రీన్ సైజ్ కలిగి ఉండటం వల్ల ఇది చిన్న స్థలం ఉన్న వారికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఇది HD రెడీ డిస్‌ప్లేతో వస్తుంది. కాబట్టి దీనివల్ల విజువల్స్ చాలా స్పష్టంగా, రంగులు కూడా అందంగా కనిపిస్తాయి. దీనిలోని వైడ్ వ్యూయింగ్ యాంగిల్ ప్రత్యేకత కారణంగా, మీరు గదిలో ఏ వైపు నుంచి చూసినా స్క్రీన్ క్లియర్‌గా కనిపిస్తుంది. ఎలాంటి బ్లర్ లేదా కలర్ ఫేడ్ సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. దీని డిస్ ప్లే కూడా చూడటానికి చాలా అద్భుతంగా ఉంటుంది. మీ ఇంటికి ట్రెండీ లుక్ ఇవ్వడానికి కూడా ఈ టీవీ పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు.
2. పవర్‌ఫుల్ సౌండ్ అవుట్ పుట్:
చిన్న సైజ్ టీవీలలో సాధారణంగా సౌండ్ తక్కువగా.. ఉంటుందనే అపోహ ఉంటుంది. కానీ థామ్సన్ ఈ విషయంలో చాలా కేర్ తీసుకుంది. ఇందులో ఏకంగా 20W సౌండ్ అవుట్ పుట్ అందించే పవర్ ఫుల్ 2 స్పీకర్లను అమర్చడం జరిగింది. అదనంగా.. వివిడ్ కలర్ టెక్నాలజీ ఉండటం వల్ల వీడియోలు చూస్తున్నప్పుడు ఆడియో , వీడియో ఫీల్ చాలా బాగుంటుంది. సినిమా చూస్తున్నప్పుడు లేదా పాటలు వింటున్నప్పుడు మంచి ఫీల్ కలుగుతుంది. ఎక్కువ బేస్ ఇష్టపడే వారికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది.
Also Read: వైఫై కనెక్టివిటీతో పనిచేసే సీసీ కెమెరా.. కొత్త వాళ్లు కనిపిస్తే ఫోన్‌కు అలర్ట్
3. కనెక్టివిటీ ఆప్షన్స్, వాల్యూ ఫర్ మనీ:
ఈ బడ్జెట్ టీవీలో కస్టమర్లకు కావాల్సిన అన్ని రకాల బేసిక్ కనెక్టివిటీ పోర్ట్స్ అందుబాటులో ఉన్నాయి. సెటప్ బాక్స్, ల్యాప్ టాప్ లేదా పెన్‌డ్రైవ్ కనెక్ట్ చేసుకోవడానికి తగినన్ని HDMI, USBపోర్ట్స్ ఇందులో ఉన్నాయి. తక్కువ కరెంట్ ఖర్చుతో పనిచేసే ఈ టీవీ మెయింటెనెన్స్ పరంగా కూడా చాలా ఈజీ .
తక్కువ బడ్జెట్‌లో ప్రీమియం లుక్, మంచి సౌండ్ , స్పష్టమైన పిక్చర్ క్వాలిటీ కోరుకునే వారికి ఈ మోడల్ నిజంగా ఒక సూపర్ ఛాయిస్. కేవలం రూ.5,899 ధరలో లభించడం దీని అతిపెద్ద ప్లస్ పాయింట్. మీరు కూడా బడ్జెట్‌లో మంచి ఎల్ఈడీ టీవీ కొనాలని ప్లాన్ చేస్తుంటే.. దీనిని వెంటనే ఆర్డర్ చేసేయండి.