HOPPUP STRYKE S1 Gaming Earbuds: ఆన్ లైన్ గేమింగ్ లవర్స్ గుడ్ న్యూస్! తక్కువ బడ్జెట్‌లో అదిరిపోయే ఫీచర్స్ అందించేందుకు ప్రముఖ బ్రాండ్ హోప్‌అప్ మార్కెట్లోకి తెచ్చిన అద్భుతమైన డివైస్ ఇది. కేవలం రూ.899 ధరలో లభిస్తున్న ఈ ట్రూ వైర్‌లెస్ ఇయర్ బడ్స్, అల్ట్రా-ఫాస్ట్ 35MS లో లేటెన్సీ , పవర్ ఫుల్ 13mm డ్రైవర్లతో గేమర్స్‌కు సరికొత్త ఫీల్ ఇస్తున్నాయి. అదీకాక ఇది స్టైలిష్ బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్‌లో యూత్ ని విపరీతంగా ఆకట్టుకుంటోంది.
ప్రస్తుత టెక్నాలజీ యుగంలో మొబైల్ గేమింగ్ స్థాయి పూర్తిగా మారిపోయింది. బీజీఎమ్ఐ, ఫ్రీ ఫైర్ లేదా కాల్ ఆఫ్ డ్యూటీ వంటి హై-ఎండ్ గేమ్స్ ఆడేటప్పుడు శత్రువుల అడుగుల చప్పుడు సరిగ్గా వినపడటం చాలా ముఖ్యం. దీనికోసం సాధారణ ఇయర్ ఫోన్స్ సరిపోవు. సరిగ్గా ఇలాంటి వారి కోసం తయారు చేసిందే ఈ మోడల్. దీని ప్రత్యేకతలేంటో చూద్దామా..
ఈ గేమింగ్ ఇయర్ బడ్స్ అసలు ధర రూ.5,999 అయినప్పటికీ.. ప్రస్తుతం వివిధ మార్కెట్ ప్లాట్‌ఫారమ్‌లపై ఫుల్ డిస్కౌంట్‌తో కేవలం రూ. 899 ధరకే లభిస్తున్నాయి. తక్కువ బడ్జెట్‌లో.. ప్రీమియం గేమింగ్ ఫీచర్లు కోరుకునే వారికి ఇది పర్ఫెక్ట్ ఛాయిస్ అని చెప్పొచ్చు.
బ్లాక్ , రెడ్ కలర్ కాంబినేషన్‌తో వస్తున్న ఈ ఇయర్ బడ్స్ చూడటానికి చాలా ట్రెండీగా ఉంటాయి. ఎర్గోనామిక్ డిజైన్ కారణంగా చెవులకు సౌకర్యంగా ఉంటాయి. ఎంతసేపు గేమ్ ఆడినప్పటికీ చెవులకు ఎలాంటి నొప్పి లేదా ఇబ్బంది కలగదు.
గేమర్స్‌కు ఇయర్ బడ్స్‌లో ఉండే అతిపెద్ద సమస్య ఆడియో డిలే. కానీ..ఈ మోడల్‌లో అందించిన 35MS అల్ట్రా-లో లేటెన్సీ మోడ్ వల్ల మీరు గేమ్ ఆడేటప్పుడు వీడియో, సౌండ్ మధ్య ఎలాంటి వ్యత్యాసం ఉండదు. గన్ షాట్స్ ,ఫుట్‌స్టెప్స్ క్షణాల్లో మీ చెవులకు చేరతాయి. ఇది మీ గేమింగ్ విన్నింగ్ ఛాన్సెస్ పెంచుతుంది.
Also Read: ట్రెండీ కలర్, టెర్రిఫిక్ ఫీచర్స్.. పాకెట్ ఫ్రెండ్లీ ధరలో బోల్ట్ Z60 పింక్ ఇయర్‌బడ్స్!
ఈ ఇయర్ బడ్స్‌లో పవర్ ఫుల్ 13mm డ్రైవర్లను వాడారు. దీని వల్ల డీప్ బాస్, క్రిస్టల్ క్లియర్ వాయిస్ అవుట్‌పుట్ వస్తుంది. గేమింగ్ తో.. పాటు మ్యూజిక్ వినేటప్పుడు, సినిమాలు చూసేటప్పుడు కూడా థియేటర్ లాంటి ఫీల్ పొందుతారు.
ఛార్జింగ్ టెన్షన్ లేకుండా రోజంతా గ్యాడ్జెట్స్ వాడేవారికి ఇది సూపర్ ఆప్షన్. ఛార్జింగ్ కేస్‌తో కలిపి ఇది దాదాపు 60 గంటల వరకు ప్లేటైమ్‌ను అందిస్తుంది. ఒక్క సారి ఫుల్ ఛార్జ్ చేస్తే.. రోజుల తరబడి ఎలాంటి టెన్షన్ లేకుండా గేమ్స్ ఆడొచ్చు. అంతేకాకుండా పాటలు కూడా వినొచ్చు.
మీదగ్గర వెయ్యి రూపాయిల లోపు బడ్జెట్ ఉండి.. ఒక మంచి గేమింగ్ ఇయర్ బడ్స్ కొనాలని చూస్తున్నట్లయితే.. నిస్సందేహంగా ఈ మోడల్ కొనొచ్చు. ధర తక్కువగా ఉన్నప్పటికీ ఫీచర్లలో రాజీ పడకుండా దీన్ని తయారు చేసారు కాబట్టి ఇది మీకు పర్ఫెక్ట్ ఆప్షన్ అవుతుంది.