Bethlehem kudumba unit Movie Review:‘ప్రేమలు’ సినిమాతో సెన్సేషనల్ హిట్ కొట్టిన దర్శకుడు గిరీష్ ఏడీ (Girish A.D) నుంచి వచ్చిన మరో క్రేజీ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘బెత్లెహోమ్ కుటుంబ యూనిట్’. నివిన్ పౌలీ(Nivin Pauly), మమితా బైజు (Mamitha Baiju) తొలిసారి జంటగా నటించిన ఈ ఫీల్ గుడ్ మూవీ ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో చూద్దాం..
ఐర్లాండ్‌లో చదువు ముగించుకుని స్వగ్రామానికి తిరిగొస్తుంది యాష్లే (మమితా బైజు). పక్కింట్లో పెళ్లి సందడి చూసి, తన గత జ్ఞాపకాల్లోకి వెళ్తుంది. అసలు కథ మొదలయ్యేది యాష్లే వాళ్ల కుటుంబం కొత్తగా అద్దెకు దిగిన ఇంటితోనే. చర్చి ఆధ్వర్యంలోని ‘బెత్లెహోమ్ కుటుంబ యూనిట్’ పరిధిలో ఉండే ఆ కాలనీలో 30 ఏళ్లు దాటినా పెళ్లి కాకుండా ఉండిపోయిన జస్టిన్ (నివిన్ పౌలీ) ఉంటాడు.
వయసులో తనకంటే దాదాపు 13 ఏళ్లు పెద్దవాడైన జస్టిన్ అమాయకత్వం, ప్రవర్తన చూసి యాష్లే అతనితో ప్రేమలో పడుతుంది. జస్టిన్ కూడా ఆమె ప్రేమను అంగీకరిస్తాడు. కానీ వీరి మధ్య ఉన్న పెద్ద వయసు తేడా కుటుంబాలకు, ఆ కాలనీ వాళ్లకు తెలిస్తే ఎలాంటి గొడవలు అవుతాయి? మరోవైపు జస్టిన్ తమ్ముడు జోయెల్ (సంగీత్ ప్రతాప్) లవ్ స్టోరీ తెచ్చిపెట్టే తంటాలేంటి? సమాజం, కుటుంబాల అభ్యంతరాలను దాటి ఈ జంట తమ ప్రేమను ఎలా నిలబెట్టుకుంది? అన్నదే ఈ సినిమా.
ప్రేమలు సినిమాతో సౌత్ సినీ ఇండస్ట్రీలో మంచి పేరు సొంతం చేసుకున్న డైరెక్టర్ గిరీష్ మరోసారి సింపుల్ కథ, చిన్నపాటి భావోద్వేగాలు, ఫన్ ఎలిమెంట్స్ ను మిళితం చేస్తూ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని రూపొందించారు. మొదటి భాగంలో పెద్దగా చెప్పుకోవడానికి కథ ఏమీ లేదు. జస్టిన్ లైఫ్, అతడి వ్యాపారం, అతడి తమ్ముడు తీసే షార్ట్ ఫిలిం, యాష్లే కాలేజ్ లైఫ్ ఇలా హెల్తీ కామెడీ, సింపుల్ గా వన్ లైనర్ పంచులతో సరదాగా సాగిపోతుంది. సంగీత్ ప్రతాప్ షార్ట్ ఫిలిం మేకింగ్ వ్యవహారంతో ఫుల్ ఫన్ క్రియేట్ చేశాడు. దానికి చిన్న లవ్ స్టోరీని కూడా యాడ్ చేశారు. వినోదం భావోద్వేగాల నడుమ చక్కని డైలాగులతో సాగుతుంది. అటు ఏజ్ బార్ అయిన అబ్బాయి, యంగ్ అమ్మాయి మధ్య లవ్ సీన్స్ చక్కగా తెరకెక్కించారు. ముఖ్యంగా లాజిక్కులు, లూప్ హోల్స్ ను వెతికే ఆలోచన కూడా ఈ సినిమాలోని వినోదాత్మక సన్నివేశాలు రానివ్వవు. ట్విస్ట్ లు, టర్న్ లు ఏమి ఉండవు. సింపుల్ లైన్ కి లవ్ , కామెడీ, ఎమోషన్ జోడించి ప్రేక్షకులకు త్వరగా చేరువయ్యేలా ఈ సినిమాను తెరకెక్కించారు.
ALSO READ:కృష్ణాష్టమి స్పెషల్.. ‘రాధా’గా మారిన అనసూయ.. వీడియో వైరల్!
నివిన్ పౌలీ ఈజ్ & టైమింగ్: పాత నివిన్ పౌలీని మళ్లీ గుర్తుచేసేలా జస్టిన్ పాత్రలో పరకాయ ప్రవేశం చేశాడు. కాస్త బరువు పెరిగినా, ఆ పాత్రకు తగ్గట్లుగా సెటిల్డ్ కామెడీ, అమాయకత్వంతో కట్టిపడేశాడు.
మమితా బైజు చార్మ్: ‘ప్రేమలు’ రీతూ పాత్ర కంటే భిన్నంగా, ఆలోచనలు ఉన్న స్వతంత్ర భావాలు కలిగిన యాష్లేగా తన నటనతో సినిమాకు ప్రాణం పోసింది. నివిన్-మమితల మధ్య కెమిస్ట్రీ తెరపై చాలా సహజంగా కుదిరింది.
గిరీష్ ఏడీ సహజసిద్ధ హాస్యం: బలవంతపు పంచులు లేకుండా రోజువారీ సంభాషణలు, సాధారణ జీవితంలో వచ్చే సిచ్యువేషన్స్ నుంచే పుట్టించిన కామెడీ కడుపుబ్బా నవ్విస్తుంది.
సపోర్టింగ్ యాక్టర్స్ రచ్చ: సంగీత్ ప్రతాప్, శ్యామ్ మోహన్, వినయ్ ఫోర్ట్, బిందు పనిక్కర్ పాత్రలు సినిమాకి భారీ బలాన్ని ఇచ్చాయి. ప్రతి ఒక్కరికీ సరైన స్పేస్ లభించింది.
సెకండాఫ్‌లో నెమ్మదించిన వేగం: ఇంటర్వెల్ తర్వాత కథ కాస్త సాగదీసిన భావన కలుగుతుంది. డ్రామా పెరిగే క్రమంలో అక్కడక్కడా పేసింగ్ నెమ్మదిస్తుంది.
ఊహించదగిన క్లైమాక్స్: సాధారణంగా ఇలాంటి లైట్ హార్టెడ్ రొమ్-కామ్ సినిమాల్లో ఉండే ముగింపే కావడంతో పెద్దగా షాకింగ్ ట్విస్టులు ఆశించలేం.
భారీ యాక్షన్‌లు, రొటీన్ ఫార్ములాలు పక్కనపెట్టి… మనసారా నవ్వుకుంటూ, హాయిగా ఫీల్ అయ్యే ఫ్రెష్ & క్లీన్ ఫ్యామిలీ లవ్ స్టోరీ ‘బెత్లెహోమ్ కుటుంబ యూనిట్ !
చివరి మాటగా: వీకెండ్‌లో సరదాగా టైమ్ పాస్ చేసేందుకు వన్-టైమ్ వాచ్ ఎంటర్టైనర్ !