E-Paper
Advertisement

వాషింగ్ మిషన్ వాడుతున్నారా? మీరు చేసే ఈ చిన్న తప్పు.. బట్టలను పనికిరాకుండా చేస్తున్నాయ్!

వాషింగ్ మిషన్ వాడుతున్నారా? మీరు చేసే ఈ  చిన్న తప్పు.. బట్టలను పనికిరాకుండా చేస్తున్నాయ్!
Advertisement

Washing Machine: ఒకప్పుడు బట్టలు ఉతకడానికి స్త్రీలు గంటలకొద్ది సమయాన్ని తీసుకునేవారు. ఇంటిల్లపాది దుస్తులను చేతులతో ఉతుకుతూ నానా ఇబ్బందులు పడేవారు. అయితే వాషింగ్ మిషన్ రాకతో.. వారికి గొప్ప ఉపశమనం కలిగింది. అయితే కొందరు వాషింగ్ మిషన్ వచ్చాక కూడా ఎక్కువ సమయం బట్టలు వాష్ చేస్తున్నారు. అయితే బట్టలను ఉతికేటప్పుడు అవి శుభ్రంగా, సురక్షితంగా ఉండాలంటే ఎంత సమయం పడుతుందనేది చాలా ముఖ్యం. లాండ్రీ నిపుణుల ప్రకారం.. వాషింగ్ మెషీన్‌లో బట్టలు ఉతకడానికి సంబంధించిన కీలక విషయాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

వాషింగ్ సమయం ఎంత?

సాధారణంగా బట్టలు ఉతకడానికి సగటున 30 నుండి 45 నిమిషాల సమయం సరిపోతుందని లాండ్రీ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. . అయితే బట్టల రకాన్ని బట్టి ఈ సమయం మారుతూ ఉంటుందని పేర్కొంటున్నారు. రోజూవారి దుస్తులు అయితే.. 30 నిమిషాల ‘క్విక్ వాష్’ సరిపోతుంది. మురికి ఎక్కువగా ఉన్న బట్టలకు 45 నిమిషాల నుండి ఒక గంట వరకు సమయం అవసరం కావచ్చు. సున్నితమైన (పట్టు, ఉన్ని) బట్టలు అయితే 15-20 నిమిషాల తక్కువ సైకిల్‌లో ఉతకడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. .

ఎక్కువ సేపు ఉతికితే..!

Advertisement

చాలామంది బట్టలను ఎక్కువ సేపు ఉతికితేనే శుభ్రపడతాయని అనుకుంటారు. కానీ అది సరైన ఆలోచన కాదని నిపుణులు పేర్కొంటున్నారు. దుస్తులు ఎక్కువ సేపు నీటిలో నానడం, మిషన్‌లో తిరగడం వల్ల దారాల నాణ్యత దెబ్బతింటాయని పేర్కొంటున్నారు. అవసరానికి మించి బట్టలను ఎక్కువ సేపు ఉతికితే.. రంగు త్వరగా పోయి పాతదానిలా మారిపోతుందని అంటున్నారు. దుస్తుల క్వాలిటీ దెబ్బ తినడమే కాకుండా.. విద్యుత్, నీరు కూడా అధికంగా ఖర్చవుతాయని తెలియజేస్తున్నారు.

మెుండి మరకలు ఉంటే..

మెుండి మరకలు ఉన్న దుస్తులను వాషింగ్ మిషన్‌లో ఎక్కువ సేపు ఉతకడం కంటే ‘ప్రీ-ట్రీట్‌మెంట్’ (Pre-treatment) చేయడం ఉత్తమమని నిపుణులు చెబుతున్నారు. మరకలు ఉన్న చోట కొంచెం డిటర్జెంట్‌ రాసి పది నిమిషాల తర్వాత మిషన్‌లో వేయడం ఉత్తమమని పేర్కొంటున్నారు. దీనివల్ల తక్కువ సమయంలోనే బట్టలు మల్లెపూవులా మెరుస్తాయని స్పష్టం చేస్తున్నారు.

Advertisement

Also Read: ఇండక్షన్ స్టవ్ వాడుతున్నారా? చాలామందికి తెలియని షాకింగ్ నిజాలు!

ఈ టిప్స్ కూడా మీ మంచికే..!

వాషింగ్ మిషన్ వాడేటప్పుడు మరికొన్ని చిట్కాలు సైతం పాటిస్తే మంచిదని నిపుణులు పేర్కొంటున్నారు. ఇందులో భాగంగా ఎప్పుడు మిషన్ వేసిన.. బట్టలు తిరగడానికి సరిపడ ఖాళీ ఉండాలని సూచిస్తున్నారు. లేదంటే ఎంత సేపు ఉతికినా మురికి వదలదని తెలియజేస్తున్నారు. మరోవైపు ఎక్కువ సర్ఫ్ వాడినా కూడా బట్టలు శుభ్రంగా మారిపోవని నిపుణులు అంటున్నారు. పైగా మిషన్ లోపల సర్ఫ్ పేరుకుపోయి.. బ్యాక్టీరియా పెరగడానికి కారణం అవుతుందని పేర్కొంటున్నారు.

Also Read: AC Water Tips: ఏసీ నీటిని మొక్కలకు పోస్తున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోండి!

Related News

చార్జింగ్ టెన్షన్ లేదు, లుక్ అద్దిరిపోతుంది.. ఈ ట్రెండింగ్ స్మార్ట్‌వాచ్ మీకోసమే!

రూ.34,999 ధరకే హై-ఎండ్ ఫీచర్లా? ఈ లేటెస్ట్ ఫిలిప్స్ టీవీ అదుర్స్!

ఒకసారి ఛార్జ్ చేస్తే రోజుల తరబడి నాన్‌స్టాప్ మ్యూజిక్.. ధర వింటే ఆశ్చర్యపోతారు!

8 గంటలకు పైగా బ్యాకప్ ఇచ్చే.. టాప్ 5 ల్యాప్‌టాప్‌లు ఇవే!

ఆన్‌లైన్ క్లాసులు, నోట్స్ కోసం తక్కువ ధరలో బెస్ట్ ట్యాబ్‌లు

సౌండ్ నెక్స్ట్ లెవెల్ అంతే! బడ్జెట్‌లో.. బెస్ట్ 4K డాల్బీ ఆడియో టీవీలు!

ఇంట్లో Wi-Fi డెడ్ జోన్స్‌కు సింపుల్ సొల్యూషన్.. పాత ఆండ్రాయిడ్ ఫోన్‌తో ఇలా చేయండి!

వాషింగ్ మెషీన్‌ను ఎన్ని రోజులకు ఒకసారి క్లీన్ చేయాలి? ఈ విషయం తెలుసా?

Big Stories

Advertisement
×