E-Paper
Advertisement

LPG Supply Chain: విదేశాల నుంచి భారత్‌కు వంట గ్యాస్.. సముద్ర మార్గంలో సిలిండర్లు ఎలా తీసుకొస్తారు?.. ప్రక్రియ ఇదే

LPG Supply Chain: విదేశాల నుంచి భారత్‌కు వంట గ్యాస్.. సముద్ర మార్గంలో సిలిండర్లు ఎలా తీసుకొస్తారు?.. ప్రక్రియ ఇదే
Advertisement

LPG Supply Chain| భారతదేశంలో ప్రజలు ప్రతి సంవత్సరం భారీ మొత్తంలో LPG (వంట గ్యాస్) వినియోగిస్తారు. దేశవ్యాప్తంగా వినియోగమయ్యే వంట గ్యాస్‌ లో సుమారు 60 శాతం విదేశాల నుంచి దిగుమతి అవుతోంది. దీంతో భారతదేశం ప్రపంచంలోనే రెండో అతిపెద్ద LPG దిగుమతిదారుగా ఉంది. ఇంట్లో వంట కోసం LPG సిలిండర్లు చాలా ముఖ్యం. కోట్లాది ఇళ్లలో రోజువారీ వంటల కోసం కుటుంబాలు ఈ సిలిండర్లపై ఆధారపడతాయి. గ్యాస్ సరఫరా కోసం దేశవ్యాప్తంగా పెద్ద లాజిస్టిక్స్ నెట్‌వర్క్ ఉంది. ఈ ప్రయాణం విదేశాల నుంచి ప్రారంభమై మీ ఇంటి వంటగది వరకు సురక్షితంగా సాగుతుంది.

అంతర్జాతీయ పంపిణీదారుల నుంచి LPG సేకరణ

భారతదేశం చాలా వరకు మిడిల్ ఈస్ట్ దేశాల నుంచి LPG దిగుమతి చేస్తుంది. సౌదీ అరేబియా, ఖతార్, కువైట్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ భారత్‌కు ప్రధాన సప్లయర్లు. అమెరికా నుంచి కూడా ఇటీవల LPG ఎగుమతి పెరిగింది. LPGలో ప్రధానంగా ప్రోపేన్, బ్యూటేన్ గ్యాస్‌లు ఉంటాయి. క్రూడ్ ఆయిల్ రిఫైనరీలలో, నేచురల్ గ్యాస్ ప్లాంట్లలో LPG ఉత్పత్తి అవుతుంది. ఆ తరువాత ఆ దేశాల నుంచి రవాణా చేయడానికి ముందు గ్యాస్‌ను ద్రవ రూపంలోకి మారుస్తారు. దీని కోసం గ్యాస్ కూలింగ్ లేదా ప్రెజరైజేషన్ పద్ధతులు పాటిస్తారు.

సముద్ర మార్గంలో రవాణా

Advertisement

సముద్ర మార్గంలో వేల మైళ్ల ప్రయాణం చేసి LPGని స్పెషల్ షిప్‌లలో తీసుకొస్తారు. ఈ స్పెషల్ షిప్‌లను LPG ట్యాంకర్లు లేదా గ్యాస్ క్యారియర్లు అంటారు. ఈ గ్యాస్ ట్యాంకర్లు భారీ సైజులో ఉండే వెరీ లార్డ్ గ్యాస్ క్యారియర్ (VLGC) రకం షిప్‌లు 15,000 నుంచి 85,000 క్యూబిక్ మీటర్ల వరకు LPG తీసుకెళతాయి. ఇవే కాకుండా సెమీ-ప్రెజరైజ్డ్ లేదా సెమీ-రిఫ్రిజిరేటెడ్ షిప్‌లు కూడా ఉపయోగిస్తారు. గల్ఫ్ నుంచి వచ్చే షిప్‌లు ఇరాన్, గల్ఫ్ దేశాల మధ్య ఉన్న సముద్ర మార్గం అయిన హార్ముజ్ జలసంధిని దాటి అరేబియన్ సముద్రం గుండా భారత పోర్టులకు చేరతాయి.

భారత పోర్టుల్లో దిగుమతి, స్టోరేజ్

LPG ట్యాంకర్లు.. భారత దేశంలోని కాండ్లా, ముంద్రా, దాహెజ్, జవహర్‌లాల్ నెహ్రూ పోర్ట్, మంగళూరు, విశాఖపట్నం, ఎన్నోర్, పారాదీప్, హల్దియా వంటి ప్రధాన పోర్టులకు చేరతాయి. పెద్ద పైప్‌లైన్ల ద్వారా గ్యాస్‌ను షిప్ నుంచి స్టోరేజ్ ట్యాంకుల్లోకి తరలిస్తారు. స్ఫెరికల్ ట్యాంకులు, మౌంటెడ్ బులెట్ ట్యాంకులు, అండర్‌గ్రౌండ్ గుహల్లో స్టోర్ చేస్తారు. రిఫ్రిజిరేటెడ్ సిస్టమ్‌లతో తక్కువ ఉష్ణోగ్రతలో సురక్షితంగా ఉంచుతారు.

బాట్లింగ్ ప్లాంట్లకు LPG రవాణా

Advertisement

పోర్టుల నుంచి దేశవ్యాప్తంగా ఉన్న బాట్లింగ్ ప్లాంట్లకు LPGని మళ్లీ గ్యాస్ రూపంలో తరలిస్తారు. పైప్‌లైన్ల ద్వారా, రోడ్డు ట్యాంకర్ ట్రక్కుల ద్వారా, రైల్వే ట్యాంక్ వ్యాగన్ల ద్వారా రవాణా జరుగుతుంది. ఈ వాహనాల్లో ప్రెజరైజ్డ్ కంటైనర్లలో సురక్షితంగా తీసుకెళతారు.

సిలిండర్లలో బాట్లింగ్ ప్రక్రియ
బాట్లింగ్ ప్లాంట్లలో బల్క్ LPGని ఇంటి సిలిండర్లలో నింపుతారు. ముందుగా ఖాళీ సిలిండర్లను తూకం, కండిషన్, సేఫ్టీ మార్కింగ్స్ పరీక్షిస్తారు. ఆటోమేటిక్ ఫిల్లింగ్ మెషిన్లతో 14.2 కిలోల (డొమెస్టిక్) లేదా 19 కిలోల (కమర్షియల్) LPG గ్యాస్ సిలిండర్లలో నింపుతారు. తర్వాత లీక్ టెస్ట్ చేస్తారు. వాటర్ బాత్ టెస్ట్ లేదా ఎలక్ట్రానిక్ డిటెక్టర్లు వినియోగిస్తారు.

ఇళ్లకు డెలివరీ

క్వాలిటీ చెక్ తర్వాత సిలిండర్లను సీల్ చేసి లోకల్ LPG డిస్ట్రిబ్యూటర్లకు పంపుతారు. డిస్ట్రిబ్యూటర్లు గోడౌన్లలో స్టోర్ చేసి డెలివరీ వర్కర్ల ద్వారా ఇళ్లకు చేరవేస్తారు.

భద్రత, ఘాటు వాసన కెమికల్

LPG రవాణా, స్టోరేజ్ సమయంలో భద్రత చాలా ముఖ్యం. గ్యాస్ లీక్ గుర్తించడానికి గ్యాస్‌లో మెర్కాప్టాన్ అనే కెమికల్ జోడిస్తారు. ఈ కెమికల్ గ్యాస్‌లో ఉండడం లీక్ సమయంలో ఘాటు వాసన వస్తుంది. గ్యాస్‌లో ఈ కెమికల్ కలపడం ప్రభుత్వ నియమాల ప్రకారం తప్పనిసరి.

Related News

90% మంది చేసే అతిపెద్ద పొరపాటు.. కొత్త స్మార్ట్‌ఫోన్లలో మార్చాల్సిన ఆ 7 సెట్టింగ్స్ ఇవే!

ఇంట్లో పాత స్మార్ట్‌ఫోన్ ఉందా? దాన్ని క్యాష్‌గా మార్చుకోండిలా!

వాట్సప్‌లో Bill Payments ఫీచర్.. కరెంట్, ఫాస్టాగ్, క్రెడిట్ కార్డ్ బిల్స్ ఎలా కట్టాలో తెలుసా?

బ్యాటరీ తీయలేం, ఇయర్‌ఫోన్ పెట్టలేం..మోడర్న్ ఫోన్ల రూపు రేఖలు ఎందుకు మారాయ్ !

రూ.200లకే యూట్యూబ్ ప్రీమియం, ప్రైమ్ వీడియో.. జియో ఊహించని ధమాకా ఆఫర్!

సిగ్నల్ ఉన్నా.. కాల్స్ కట్ అవుతున్నాయా? అసలు కారణాలు ఇవే!

డ్యూయల్ డ్రైవర్స్,ఆర్జీబీ లైట్స్..బడ్జెట్‌లో బెస్ట్ పార్టీ టవర్ స్పీకర్ !

పళ్ల సందుల్లో ఏముందో ఫోన్‌లో లైవ్ చూడొచ్చు.. డైసన్ కొత్త ఏఐ టూత్ బ్రష్ ధరెంతో తెలుసా?

Big Stories

Advertisement
×