Air India Express Offers: అత్యంత చౌకగా విమాన ప్రయాణం చేసే అవకాశం కల్పిస్తోంది దేశీయ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్. పేద, మధ్య తరగతి ప్రజలు కూడా విమానాల్లో ప్రయాణించే వెసులుబాటు కల్పిస్తోంది. అందులో భాగంగానే అత్యంత తక్కువ ధరలకే విమాన టికెట్లు అందిస్తోంది. ప్రత్యేక డిస్కౌంట్లతో స్పెషల్ సేల్ ను తీసుకొస్తుంది. ఇండిగో సంస్థ తక్కువ ధరలకే విమాన టికెట్లు అందిస్తుండగా, ఇప్పుడు ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ కూడా చౌక ధరకు విమాన ప్రయాణ అవకాశాన్ని కల్పిస్తోంది. ఇంకా చెప్పాలంటే, ఇండిగో కంపెనీ కంటే తక్కువ ధరలో టికెట్లను అందుబాటులో ఉంచింది.
తక్కువ ధరకే విమాన ప్రయాణాన్ని అందించాలనే లక్ష్యంతో ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ పే డే సేల్ ను ప్రారంభించింది. ఫిబ్రవరి 24 నుంచి ఈ సేల్ ఓపెన్ కాగా, ప్రయాణీకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఈ ఆఫర్ మార్చి 1 వరకు కొనసాగనుంది. గడువు లోగా టికెట్లు బుక్ చేసుకున్న వినియోగదారులు.. మార్చి 3 నుంచి అక్టోబర్ 8 వరకు ఎప్పుడైనా ప్రయాణం చేసే అవకాశం కల్పిస్తోంది ఎయిర్ ఇండియా. లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ గా ఈ ఆఫర్ ను తీసుకొచ్చింది. ఈ సేల్, ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ అధికారిక వెబ్ సైట్ లేదంటే మొబైల్ యాప్ లో బుకింగ్ చేసుకున్న వారికి ఆఫర్ వర్తిస్తుంది.
ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ తీసుకొచ్చిన ఈ ఆఫర్.. దేశీయ మార్గాల్లో రూ. 1,450 నుంచి టికెట్ ధర ప్రారంభం అవుతుంది. ఎక్స్ ప్రెస్ లైట్ ఆఫర్ కింద ఇంటర్నేషనల్ ఫ్లైట్లలో కనీస టికెట్ ధర రూ. 6,655 నుంచి ప్రారంభం అవుతుంది. ఎక్స్ ప్రెస్ వాల్యూ ఫేర్స్ డొమెస్టిక్ ఫ్లైట్లలో కనీసం రూ. 1,500 నుంచి ప్రారంభం అవుతుంది. ఇక్కడ అంతర్జాతీయ విమాన ప్రయాణాలకు కనీస టికెట్ ధర రూ. 6,735గా ఉంటుంది. ఎలాంటి కన్వీనియెన్స్ ఛార్జీలు ఉండవు.
ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ ఆఫర్ లోని టికెట్ ధరల్లో.. బేస్ ఫేర్, టాక్స్ లు, ఎయిర్ పోర్ట్ ఛార్జీలు సహా ఇతరత్రా ఛార్జీలు అన్నీ కలిపే ఉంటాయి. కన్వీనియెన్స్ ఫీజు, ఇతర సర్వీస్ ఛార్జీలు ఇందులో ఉండవు. ఇది లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ కావడం వల్ల.. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ ప్రాతిపదికన సీట్లు కేటాయిస్తారు. అంటే, ముందుగా బుక్ చేసుకున్న వారికే ముందు ప్రాధాన్యత ఉంటుంది. సీట్లు కూడా పరిమిత సంఖ్యలోనే ఈ ఆఫర్‌కు కేటాయిస్తారు. సో.. అన్ని డేట్లు, అన్ని ఫ్లైట్స్, అన్ని రూట్లలో అన్ని సీట్లు అందుబాటులో ఉండవు. అందుకే, ముందుగానే ప్రయాణానికి సంబంధించిన ఏర్పాట్లు చేసుకోవడం మంచిది. విమానయాన సంస్థ అధికారులతో టచ్ లో ఉంటూ ఎలాంటి ఇబ్బంది లేని ప్రయాణాలను కోనసాగించాలి.
Read Also: కన్ఫార్మ్ టికెట్ ఉన్నా, కష్టాలు తప్పలేదు.. మరీ ఇంత ఘోరమా?