E-Paper
Advertisement

Smartphones Ads Block: స్మార్ట్‌ఫోన్‌లో యాడ్స్‌తో విసిగిపోయారా? ఈ సింపుల్ సెట్టింగ్స్‌‌తో బ్లాక్ చేయండి

Smartphones Ads Block: స్మార్ట్‌ఫోన్‌లో యాడ్స్‌తో విసిగిపోయారా? ఈ సింపుల్ సెట్టింగ్స్‌‌తో బ్లాక్ చేయండి

Smartphones Ads Block| మీ స్మార్ట్‌ఫోన్‌లో మీరు వీడియోలు చూసే సమయంలో, న్యూస్ రీడింగ్ చేస్తున్నప్పుడు లేదా మొబైల్ గేమ్స్ అడుతున్నప్పుడు మధ్యలో యాడ్స్ కనిపిస్తుంటే ఎలా ఉంటుంది. మీ గేమింగ్ మూడ్‌ని ఈ యాడ్స్ అడ్డంకులుగా కనిపిస్తాయి. ఇంటరప్ట్ చేస్తాయి. పాప్-అప్ అడ్స్ ఎంజాయ్‌మెంట్‌ను తగ్గిస్తాయి. అంతేకాదు మొబైల్ డేటాను వేస్ట్ చేస్తాయి. చాలా మంది యూజర్లు నిరంతర అడ్వర్టైజ్‌మెంట్స్‌ తో విసిగిపోతుంటారు.

ఫోన్‌లోనే బిల్ట్-ఇన్ సొల్యూషన్

యాడ్ బ్లాకింగ్ కోసం పెయిడ్ యాప్స్ కావాలని అనుకుంటారు. నిజానికి ఆండ్రాయిడ్‌లో బిల్ట్-ఇన్ సొల్యూషన్ ఉంది. బయటి యాప్ ఇన్‌స్టాల్ చేయకుండానే పనిచేస్తుంది. దీని పేరు ప్రైవేట్ DNS. ప్రైవేట్ DNS సిస్టమ్-వైడ్‌గా చాలా యాడ్స్‌ను బ్లాక్ చేస్తుంది. చాలా మంది యూజర్లకు ఈ ఆప్షన్ తెలియదు.

ప్రైవేట్ DNS అంటే ఏమిటి? ఎలా పనిచేస్తుంది?

ప్రైవేట్ DNSను DNS-over-TLS అని కూడా అంటారు. ఫోన్ సురక్షితంగా వెబ్‌సైట్స్‌కు కనెక్ట్ అవ్వడానికి సహాయపడుతుంది. యాడ్, ట్రాకర్ డొమైన్స్‌ను కూడా బ్లాక్ చేస్తుంది. ప్రైవేట్ DNS సిస్టమ్ లెవల్‌లో పనిచేస్తుంది. యాడ్స్ లోడ్ అవ్వకముందే బ్లాక్ చేస్తుంది. యాప్స్, బ్రౌజర్లలోని యాడ్స్ కూడా బ్లాక్ అవుతాయి. యాడ్స్ లోడ్ కాకపోవడంతో డేటా యూసేజ్ తగ్గుతుంది. బ్యాటరీ లైఫ్ కూడా కొంచెం మెరుగుపడుతుంది. ఫోన్ క్లీన్, ఫాస్ట్‌గా అనిపిస్తుంది. పాపులర్ ప్రైవేట్ DNS ప్రొవైడర్ యాడ్‌గార్డ్. దీని అడ్రస్ dns.adguard.com.

యాడ్‌గార్డ్ ప్రైవేట్ DNS ఉపయోగాలు

యాడ్‌గార్డ్ ప్రైవేట్ DNS ఉచితం. యాప్ ఇన్‌స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. బ్యాక్‌గ్రౌండ్‌లో సైలెంట్‌గా పనిచేస్తుంది. బ్యానర్ యాడ్స్, పాప్-అప్స్, ట్రాకింగ్ స్క్రిప్ట్స్ బ్లాక్ చేస్తుంది. చాలా గేమ్స్‌లో యాడ్స్ తగ్గుతాయి. న్యూస్ వెబ్‌సైట్స్ డిస్ట్రాక్షన్స్ లేకుండా ఫాస్ట్‌గా లోడ్ అవుతాయి. సెటప్ ప్రాసెస్ ఒక నిమిషం కంటే తక్కువ సమయం పడుతుంది. ఎప్పుడైనా డిసేబుల్ చేయవచ్చు. చాలా ఆండ్రాయిడ్ ఫోన్స్‌లో పనిచేస్తుంది.

ఆండ్రాయిడ్‌లో ప్రైవేట్ DNSను ఎలా ఎనేబుల్ చేయాలి?

ముందు సెట్టింగ్స్ యాప్ ఓపెన్ చేయండి. నెట్‌వర్క్, ఇంటర్నెట్ లేదా కనెక్షన్ సెట్టింగ్స్‌కు వెళ్లండి. ప్రైవేట్ DNS వరకు స్క్రోల్ చేయండి. ప్రైవేట్ DNS ఆప్షన్ ట్యాప్ చేయండి. ఆటోమేటిక్ నుంచి ప్రైవేట్ DNS ప్రొవైడర్ హోస్ట్‌నేమ్‌కు మార్చండి. టెక్స్ట్ బాక్స్ కనిపిస్తుంది. అందులో dns.adguard.com టైప్ చేయండి. dns.adguard-dns.com కూడా ఉపయోగించవచ్చు. సేవ్ ట్యాప్ చేసి సెట్టింగ్ అప్లై చేయండి. ఇక ఫోన్ చాలా యాడ్స్‌ను బ్లాక్ చేస్తుంది. యాప్స్చ బ్రౌజర్లలో అడ్వర్టైజ్‌మెంట్స్ తగ్గుతాయి.

ప్రైవేట్ DNS ఎనేబుల్ చేసిన తర్వాత ఏ మార్పులు వస్తాయి

వెబ్ పేజీలు అడ్ స్క్రిప్ట్స్ లేకుండా ఫాస్ట్‌గా లోడ్ అవుతాయి. యాప్స్ ఉపయోగం స్మూత్‌గా అనిపిస్తుంది. రోజువారీ మొబైల్ డేటా తక్కువ వాడుతుంది. బ్యాటరీ డ్రెయిన్ కొంచెం తగ్గుతుంది. బ్యాక్‌గ్రౌండ్ ట్రాకింగ్ స్క్రిప్ట్స్ లోడ్ కావు. మొత్తం బ్రౌజింగ్ క్లీన్, కామ్‌గా మారుతుంది. ప్రైవేట్ DNS నెట్‌వర్క్ లెవల్‌లో యాడ్స్ బ్లాక్ చేస్తుంది. ఇండివిడ్యువల్ యాప్స్ కంటే ఈ నెట్‌వర్క్ బెటర్. కొన్ని యాడ్ బ్లాకర్ల కంటే సేఫ్‌గా ఉంటుంది.

ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలి

కొన్ని వెబ్‌సైట్స్ కొంచెం స్లోగా లోడ్ అవుతాయి. DNS ఫిల్టరింగ్ వల్ల ఇలా జరుగుతుంది. మార్పు సాధారణంగా చిన్నదే. యూట్యూబ్ వీడియో యాడ్స్ బ్లాక్ కావు. యూట్యూబ్ తన సర్వర్ల నుంచి యాడ్స్ సర్వ్ చేస్తుంది. ప్రైవేట్ DNS వాటిని బ్లాక్ చేయలేదు. కొన్ని పబ్లిక్ వై-ఫై నెట్‌వర్క్స్ పనిచేయకపోవచ్చు. అలాంటప్పుడు ప్రైవేట్ DNSను ఆటోమేటిక్‌కు మార్చండి. ఇంటర్నెట్ వెంటనే వచ్చేస్తుంది. కొన్ని వెబ్‌సైట్స్ లోడ్ కాకపోతే ఆల్టర్నేటివ్స్ ట్రై చేయండి. నెక్స్ట్‌DNS మరో పాపులర్ ఆప్షన్. కస్టమ్ యాడ్, ట్రాకర్ కంట్రోల్స్ అందిస్తుంది.

Also Read: గూగుల్ మెయిల్‌లో స్పామ్ మెయిల్స్‌ సమస్య.. శాశ్వత పరిష్కారం ఇదే

యాడ్‌గార్డ్ ప్రైవేట్ DNS యాడ్స్‌ను ఎలా బ్లాక్ చేస్తుంది

ఇంటర్నెట్ ట్రాఫిక్ యాడ్‌గార్డ్ సర్వర్ల ద్వారా పాస్ అవుతుంది. ఆ సర్వర్లు డొమైన్ రిక్వెస్ట్స్ చెక్ చేస్తాయి. తెలిసిన యాడ్, ట్రాకర్ డొమైన్స్ బ్లాక్ అవుతాయి. క్లీన్ డొమైన్స్ నార్మల్‌గా లోడ్ అవుతాయి. ఈ ప్రాసెస్ ఆటోమేటిక్‌గా జరుగుతుంది. యూజర్లకు ఏ అలర్ట్స్ కనిపించవు. ఫోన్ ఎక్స్ట్రా ఎఫర్ట్ లేకుండా ప్రొటెక్ట్ అవుతుంది. ఇది ప్రైవేట్ DNSను పవర్‌ఫుల్ హిడన్ టూల్‌గా మారుస్తుంది.

ప్రైవేట్ DNS సులభమైన యాడ్-బ్లాకింగ్ సొల్యూషన్ అందిస్తుంది. యాప్స్ లేదా సబ్‌స్క్రిప్షన్స్ లేకుండా పనిచేస్తుంది. చాలా ఆండ్రాయిడ్ యూజర్లు ఒకసారి ట్రై చేయాలి.

Related News

ఇంట్లోనే జిమ్.. తక్కువ బడ్జెట్‌లో ఫిట్‌నెస్ ఎక్విప్‌మెంట్స్

స్మార్ట్ ఫ్రిజ్ కొంటే.. నిజంగా కరెంట్ బిల్లు తగ్గుతుందా? అసలు నిజాలు ఇవే!

రూ.30వేలలోపు బెస్ట్ విండో ఏసీలు.. వీటితో ఎండలకు బైబై చెప్పేయండి!

బడ్జెట్ రేంజ్‌లో.. హల్‌చల్ చేస్తున్న హైసెన్స్ 100 ఇంచుల టీవీ..

ఆకట్టుకునే 6.3 ఇంచ్ స్క్రీన్, బెస్ట్ కెమెరాతో మోటోరోలా కొత్త ఫోన్..

ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే.. ఫ్రిజ్ రిపేర్ ఖర్చులు మిగిలినట్టే!

మీది చిన్న రూమా? 0.5 టన్ ఏసీ బెస్ట్ భయ్యా.. ఎందుకో మీరే చూడండి!

బడ్జెట్‌లో బెస్ట్ ఎయిర్ ఫ్రైయర్ కావాలా? ట్రెండ్ అవుతున్న టాప్ 3 బ్రాండ్స్!

Big Stories

×