E-Paper
Advertisement

WPL 2026: నేటి నుంచి మెగా టోర్న షురూ..ఆర్సీబీ, ముంబై మ‌ధ్య తొలి మ్యాచ్‌..ఫ్రీగా చూడాలంటే

WPL 2026: నేటి నుంచి మెగా టోర్న షురూ..ఆర్సీబీ, ముంబై మ‌ధ్య తొలి మ్యాచ్‌..ఫ్రీగా చూడాలంటే
Advertisement

WPL 2026:  ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Womens Premier League 2026 ) నేటి నుంచి షురూ కాబోతోంది. ఇవాల్టి నుంచి ఫిబ్రవరి 5వ తేదీ వరకు ఈ మెగా టోర్నమెంట్ జరగనుంది. ఈ మేరకు ఇప్పటికే షెడ్యూల్ ఫిక్సయిన సంగతి తెలిసిందే. అయితే ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో నేడు ప్రారంభ వేడుకలతో పాటు తొలి మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ ముంబై ఇండియన్స్ ( Mumbai Indians Women vs Royal Challengers Bengaluru Women ) మధ్య జరగనుంది. గత సీజన్ ఛాంపియన్ గా నిలిచిన ముంబై, పాయింట్ల పట్టికలో చిట్ట చివరన నిలిచిన బెంగళూరుతో తల పడనుంది.

Also Read: Sarfaraz Khan-Abhishek Sharma: అభిషేక్ శర్మ ఓవర్‌లో 6, 4, 6, 4, 6, 4..15 బాల్స్‌లో స‌ర్ఫ‌రాజ్ అర్ధ సెంచ‌రీ

బెంగళూరు వర్సెస్ ముంబై మధ్య తొలి ఫైట్

Advertisement

మహిళల ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో భాగంగా ఇవాళ తొలి మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ ముంబై ఇండియన్స్ ( Mumbai Indians Women vs Royal Challengers Bengaluru Women ) మధ్య జరగనుంది. ఈ మ్యాచ్ నవీ ముంబైలోని డివై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ వేదికగా నిర్వహించనున్నారు. ఇవాళ రాత్రి 7:30 గంటలకు బెంగళూరు వర్సెస్ ముంబై మధ్య ఫైట్ జరగనుంది. ఇక ఈ మ్యాచ్ లో జియో హాట్ స్టార్ లో ( Jio Hotstar) ఉచితంగా చూడవచ్చు. అటు స్టార్ స్పోర్ట్స్ ( Star Sports) నెట్వర్క్ లో కూడా ఈ మ్యాచ్ లు వస్తాయి. ఇక ఈ రెండు జట్ల‌లో ముంబై ఇండియన్స్ కు అడ్వాంటేజ్ ఎక్కువగా ఉండనుంది. గత రికార్డులను పరిశీలిస్తే బెంగళూరు పైన ముంబై జట్టుకు గెలిచే ఛాన్సులు ఎక్కువ‌గా ఉన్న‌ట్లు చెబుతున్నారు.

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ షెడ్యూల్, వేదికలు

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Womens Premier League 2026 )  జనవరి 9వ తేదీ నుంచి ఫిబ్రవరి 5వ తేదీ వరకు జరగనుంది. దీని కోసం రెండు వేదికలు మాత్రమే ఫైనల్ చేశారు. మొదటి సగం మ్యాచ్ లు నవీ ముంబైలోని డివై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీలో నిర్వహించనున్నారు. అలాగే మిగిలిన సగం మ్యాచ్ లు వడోదర స్టేడియంలో నిర్వహించనున్నారు.

ముంబై వ‌ర్సెస్ బెంగ‌ళూరు జ‌ట్లు

Advertisement

ముంబై ఇండియన్స్ టీం: హేలీ మాథ్యూస్, నాట్ స్కివర్-బ్రంట్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్‌), అమంజోత్ కౌర్, అమేలియా కెర్, జి కమలిని (WK), షబ్నిమ్ ఇస్మాయిల్, సైకా ఇషాక్, సజీవన్ సజన, సంస్కృతి గుప్తా, పూనమ్ ఖేమ్నార్

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం: స్మృతి మంధాన (కెప్టెన్), నదీన్ డి క్లెర్క్, శ్రేయాంక పాటిల్, పూజా వస్త్రాకర్, రిచా ఘోష్ (WK), అరుంధతి రెడ్డి, రాధా యాదవ్, జార్జియా వోల్, లారెన్ బెల్, గౌతమి నాయక్, లిన్సే స్మిత్

 

Also Read: Shivang Kumar: SRHలో మ‌రో మిస్ట‌రీ మెండిస్..రూ.30 ల‌క్ష‌ల‌కే కొనేసిన కావ్య‌పాప‌, 5 వికెట్ల‌తో ఇర‌గ‌దీసిన‌ శివంగ్

 

Related News

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీ ఇద్ద‌రూ టీమిండియాకు హార్ట్ బీట్ లాంటోళ్లు..వాళ్ల‌ను ట‌చ్ చేయెద్దు

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

రెండు మ్యాచ్ ల‌కే గాయ‌ప‌డ్డ బుమ్రాతో వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుస్తారా? గ‌వాస్క‌ర్ సీరియ‌స్‌

Big Stories

Advertisement
×