GHMC News: గ్రేటర్ హైదరాబాద్ వాసులను అలర్ట్ చేసింది జలమండలి. సిటీకి సరఫరా చేసే కృష్ణా డ్రింకింగ్ వాటర్ సప్లై పథకం ఫేజ్-2లో మరమ్మత్తు పనులు చేస్తున్నట్లు తెలిపింది. దీని కారణంగా 36 గంటలపాటు నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. ఈనెల 10 తేదీ అనగా శనివారం ఉదయం ఆరుగంటల నుంచి ఆదివారం సాయంత్రం ఆరుగంటల వరకు అంతరాయం ఉంటుందని తెలిపింది.
గ్రేటర్ హైదరాబాద్ సిటీవాసులకు అలర్ట్
హైదరాబాద్ నగరానికి సరఫరా చేసే కృష్ణా డ్రింకింగ్ వాటర్ సప్లై పథకం ఫేజ్-2 ఏర్పడిన లీకేజీపై దృష్టి సారించింది హైదరాబాద్ జలమండలి. ముఖ్యంగా కోదండాపూర్ నుంచి గొడకండ్ల వరకు పంపింగ్ మెయిన్‌పై 200 మిమీ డయా ఎంఎస్‌పై లీకేజీ ఏర్పడింది. అంతేకాదు దెబ్బతిన్న 2375 మిమీ డయా ఎంఎస్ ఎయిర్ టీలు, వాల్వ్‌లకు సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. నాసర్ల పల్లి వద్ద జంక్షన్ వద్ద పనులు చేపట్టారు. వివిధ ప్రాంతాల్లో దెబ్బతిన్న బటర్‌ఫ్లై వాల్వ్‌లు, ఎన్‌ఆర్‌వీ-NRVలను మార్పిడి పనులు చేపట్టాల్సి ఉందని జలమండలి వెల్లడించింది.
పనుల నేపథ్యంలో జనవరి 10 అనగా శనివారం ఉదయం 6 గంటల నుంచి మరుసటి రోజు ఆదివారం సాయంత్రం 6 గంటల వరకు నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. నీటి సరఫరాలో అంతరాయం నేపథ్యంలో పలు ప్రాంతాల వినియోగదారులు నీటి వాడకంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచన చేశారు. నీటి అంతరాయం ఏర్పడే డివిజన్ల పరిధిలోని ప్రాంతాలు ఈ విధంగా ఉన్నాయి.
36 గంటలపాటు వాటర్ సరఫరా బంద్
1. ఓ&ఎం డివిజన్–XI: వనస్థలిపురం, ఆటోనగర్
2. ఓ & ఎం డివిజన్–XIX: ఆటోనగర్ పరిధిలోని ప్రాంతాలు
3. ఓ & ఎం డివిజన్–X: వైశాలీనగర్, నాగోల్
4. ఓ & ఎం డివిజన్–XX: బడంగ్‌పేట్, లెనిన్‌నగర్, ఆదిభట్ల, కమ్మగూడ సమీపంలోని ప్రాంతాలు
5. ఓ & ఎం డివిజన్–VIII: బాలాపూర్ రిజర్వాయర్, బర్కాస్, మైసారం పరిధిలోని ప్రాంతాలు
6. ఓ & ఎం డివిజన్–XIV: యెల్లుగుట్ట రిజర్వాయర్, నాచారం
7. ఓ & ఎం డివిజన్–VII: తార్నాక, బౌద్ధనగర్, నల్లగుట్ట, లాలాపేట, మర్రెడ్‌పల్లి, ప్రకాష్‌నగర్, పాటిగడ్డ, మేకలమండి, మహేంద్ర హిల్స్ రిజర్వాయర్
8. ఓ & ఎం డివిజన్–V: మేకలమండి రిజర్వాయర్ పరిధిలోని ప్రాంతాలు
9. టి.డి–III: ఎంఈఎస్, రైల్వేలు మరియు సికింద్రాబాద్ కాంటోన్మెంట్ బోర్డు
10. ఓ & ఎం డివిజన్–IX: హష్మత్‌పేట్, గౌతమ్‌నగర్, ఫిరోజ్‌గూడ
11. ఓ & ఎం డివిజన్–XVI: మధుబన్ రిజర్వాయర్, శాస్త్రిపురం, ప్రశాసన్‌నగర్
12. ఓ & ఎం డివిజన్–I: నేషనల్ పోలీస్ అకాడమీ
ALSO READ: వేల కోట్ల భూదందా.. నకిలీ పత్రాలతో ప్రభుత్వ భూమికి ఎసరు
ఈ క్రమంలో పైన పేర్కొన్న ప్రాంతాల వాసులు నీటిని పొదుపుగా వినియోగించుకోగలరని హైదరాబాద్ జలమండలి ఒక ప్రకటనలో తెలిపింది.