E-Paper
Advertisement

GST రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేయాలా? ఆఫీసుల చుట్టూ తిరగకుండా ఇంట్లోనే ఇలా చేసుకోండి!

GST రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేయాలా? ఆఫీసుల చుట్టూ తిరగకుండా ఇంట్లోనే ఇలా చేసుకోండి!
Advertisement

Cancel GST Registration: భారతదేశంలో 2017లో GST (వస్తు సేవల పన్ను) అమలులోకి వచ్చిన సంగతి తెలిసిందే. దీనివల్ల పాత పన్ను విధానాలైన వ్యాట్, సర్వీస్ టాక్స్ వంటివన్నీ తొలగిపోయి పన్నుల ప్రక్రియ చాలా సులువుగా మారింది. వ్యాపారులు, సంస్థలు తమ పన్నులను చెల్లించడానికి జీఎస్టీ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవడం తప్పనిసరి. అయితే, కొన్నిసార్లు వ్యాపారాలు ఆపేసినప్పుడు లేదా ఇతర కారణాల వల్ల GST రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసుకోవాల్సి వస్తుంది. దీనికోసం ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేకుండా.. ఇంట్లోనే కూర్చుని ఆన్‌లైన్ ద్వారా సులభంగా క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

GST ఎప్పుడు రద్దు చేసుకోవాలి?

జీఎస్టీ రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసుకోవడానికి కొన్ని ముఖ్యమైన కారణాలు ఉంటాయి. వ్యాపారాన్ని పూర్తిగా మూసివేసినప్పుడు లేదా వ్యాపార కార్యకలాపాలు నిలిచిపోయినప్పుడు దీనిని క్యాన్సిల్ చేసుకోవచ్చు. అలాగే, వ్యాపార భాగస్వామ్యంలో మార్పులు జరిగి PAN నెంబర్ మారినప్పుడు కూడా పాత GSTని రద్దు చేయాల్సి ఉంటుంది.

మరికొన్ని ముఖ్యమైన కారణాలు:

Advertisement

కొన్నిసార్లు వ్యాపార యజమాని చనిపోయినప్పుడు, లేదా వ్యాపారాన్ని వేరే వాళ్లకు అమ్మేసినప్పుడు, లీజుకు ఇచ్చినప్పుడు కూడా జీఎస్టీ రద్దు అవసరమవుతుంది. ఒకవేళ మీ వ్యాపార టర్నోవర్ పరిమితి తగ్గిపోయి, ఇకపై మీరు పన్ను పరిధిలోకి రాని పక్షంలో కూడా GST రిజిస్ట్రేషన్‌ను సులభంగా రద్దు చేసుకోవడానికి దరఖాస్తు చేసుకోవచ్చు.

Also Read: ఇంటర్నెట్, సిగ్నల్ లేకపోయినా కాల్స్ మాట్లాడుకోవచ్చు.. Xiaomi 17Tలో మైండ్ బ్లోయింగ్ ఫీచర్లు!

ఆన్‌లైన్ ప్రాసెస్ ఇలా:

Advertisement

జీఎస్టీ క్యాన్సిలేషన్ కోసం మొదటగా GST అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి. అక్కడ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ సాయంతో లాగిన్ అవ్వాలి. ఆ తర్వాత హోమ్ పేజీలో కనిపించే Services ఆప్షన్‌పై క్లిక్ చేసి, అందులో Registration విభాగంలోకి వెళ్లి Application for Cancellation of Registra అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి.

కారణాలు తెలపాల్సిందే:

ఇప్పుడు స్క్రీన్‌పై ఓ ఫారమ్ ఓపెన్ అవుతుంది. అందులో మీ ప్రాథమిక వివరాలతో పాటు భవిష్యత్తులో మిమ్మల్ని సంప్రదించాల్సిన అడ్రస్‌ను ఎంటర్ చేయాలి. ఆపై Save and Continue నొక్కాలి. తర్వాత మీ రిజిస్ట్రేషన్ రద్దు చేసుకోవడానికి గల కారణాన్ని అక్కడ ఉన్న ఆప్షన్ల నుండి ఎంచుకోవాలి. ఒకవేళ మీ కారణం అక్కడ లేకపోతే Others ఆప్షన్ ఎంచుకుని వివరంగా రాయవచ్చు.

అప్లికేషన్ పూర్తి చేసే విధానం:

చివరిగా వెరిఫికేషన్ బాక్స్‌పై క్లిక్ చేసి.. మీరు ఇచ్చిన వివరాలన్నీ నిజమేనని ధృవీకరించాలి. ఆపై అథరైజ్డ్ సిగ్నేటరీ పేరును ఎంచుకుని, మీ ప్రాంతం పేరును టైప్ చేయాలి. డిజిటల్ సిగ్నేచర్ (DSC) లేదా ఈవీసీ (EVC) ఆప్షన్ ద్వారా ఫారమ్‌ను సబ్మిట్ చేయాలి. మీ మొబైల్ నెంబర్‌కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేస్తే ప్రక్రియ పూర్తవుతుంది. ఆ తర్వాత మీ అప్లికేషన్ స్టేటస్‌ను కూడా అదే వెబ్‌సైట్‌లో ట్రాక్ చేసుకోవచ్చు.

Also Read: క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ పోగోట్టుకున్నారా? బ్యాంక్‌కు వెళ్లకుండానే నిమిషాల్లో బ్లాక్ చేయండిలా!

Related News

ఇంట్లో Wi-Fi డెడ్ జోన్స్‌కు సింపుల్ సొల్యూషన్.. పాత ఆండ్రాయిడ్ ఫోన్‌తో ఇలా చేయండి!

వాషింగ్ మెషీన్‌ను ఎన్ని రోజులకు ఒకసారి క్లీన్ చేయాలి? ఈ విషయం తెలుసా?

AIతో పెరుగుతున్న సైబర్ మోసాలు.. మీ డబ్బు, వ్యక్తిగత సమాచారాన్ని కాపాడుకోండిలా!

BSNL కనివిని ఎరుగని ప్లాన్స్.. రోజుకు రూ.5 మాత్రమే.. 80 రోజులపాటు మీ ఇష్టం!

కొత్త 5G ఫోన్‌తో ఫిలిప్స్ రీ-ఎంట్రీ.. సెప్టెంబర్ 2న ఏం లాంచ్ చేయనుందంటే?

బ్యాటరీ ఎక్కువకాలం మన్నాలంటే 80-20 రూల్ పాటించాల్సిందేనా?

ఒకప్పుడు ఇవే స్టేటస్ సింబల్.. 90లలో ఫేమస్ అయిన 5 ఫోన్లు ఇవే!

మ్యాక్‌లో సిస్టమ్ స్టోరేజ్ పెరిగిపోయిందా? ఈ సింపుల్ ప్రాసెస్ ద్వారా ఖాళీ చేసి స్పీడ్ పెంచండి!

Big Stories

Advertisement
×