E-Paper
Advertisement

కోలీవుడ్‌లో విషాదం.. అజిత్ తల్లికి నివాళులర్పించిన విజయ్, త్రిష!

కోలీవుడ్‌లో విషాదం.. అజిత్ తల్లికి నివాళులర్పించిన విజయ్, త్రిష!
Advertisement

Ajith Mother Death: తమిళ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. స్టార్ హీరో అజిత్ కుమార్ తల్లి మోహిని మణి శనివారం ఉదయం వయోసహజ అనారోగ్య కారణాలతో కన్నుమూశారు. ఆమె వయసు 89 సంవత్సరాలు. ఈ చేదు వార్త విన్న వెంటనే తమిళ సినీ పరిశ్రమ దిగ్భ్రాంతికి లోనైంది. అజిత్ కుటుంబాన్ని పరామర్శించేందుకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన నివాసానికి తరలివస్తున్నారు.

Read also-సూపర్‌స్టార్ కృష్ణ జయంతి.. ‘ఎప్పటికీ నువ్వే నా హీరో’ అంటూ మహేష్ ఎమోషనల్..

Advertisement

అజిత్ నివాసానికి చేరిన విజయ్, త్రిష

అజిత్ తల్లి మరణవార్త తెలియగానే కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్ వెంటనే అజిత్ నివాసానికి చేరుకున్నారు. అక్కడ మోహిని మణి భౌతికకాయానికి నివాళులర్పించిన అనంతరం, తీవ్ర దుఃఖంలో ఉన్న అజిత్ ను, ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు.

Advertisement

విజయ్ అజిత్ ఇంటికి వచ్చిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అయితే, విజయ్, త్రిష ఇద్దరూ కలిసి వచ్చారా లేదా విడివిడిగా వచ్చారా అనే అంశంపై నెట్టింట ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. కొన్ని వీడియోలలో ఇద్దరూ ఒకే సమయంలో వచ్చినట్లు కనిపిస్తుండగా.. మరికొన్ని విజువల్స్‌లో మాత్రం వేర్వేరు వాహనాల్లో వచ్చినట్లు స్పష్టమవుతోంది.

నిద్రలోనే ప్రశాంతంగా..

తమ తల్లి మరణంపై అజిత్ సోదరులు అనుప్ కుమార్, అనిల్ కుమార్, మరియు అజిత్ కుమార్ సంయుక్తంగా ఒక అధికారిక ప్రకటన విడుదల చేశారు. “మా తల్లి మోహిని మణి గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ రోజు ఉదయం ఆమె నిద్రలోనే ప్రశాంతంగా తుదిశ్వాస విడిచారు. గత కొన్ని సంవత్సరాలుగా ఆమెకు మెరుగైన వైద్యం అందిస్తూ, మా కుటుంబానికి అండగా నిలిచిన డాక్టర్లకు మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము.” అని వారు పేర్కొన్నారు.

అలాగే, అంత్యక్రియలు కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలోనే అత్యంత ప్రైవేట్‌గా జరుగుతాయని.. ఈ కష్టసమయంలో తమ కుటుంబ గోప్యతను గౌరవించాలని వారు అభిమానులను, మీడియాను కోరారు.

Read also-‘పుష్ప 2’లో ఆ పాత్ర ఎందుకు మిస్సయిందంటే?.. అసలు విషయం చెప్పిన జగపతి బాబు!

సినీ ప్రముఖుల సంతాపం

మోహిని మణి మృతి పట్ల సౌత్ చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం ప్రకటిస్తున్నారు.

కమల్ హాసన్: “అజిత్ కుమార్ తల్లి మోహిని మణి గారి మరణవార్త నన్ను ఎంతగానో కలచివేసింది. తల్లిని కోల్పోయి బాధలో ఉన్న అజిత్ కు, ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి.” అని ట్వీట్ చేశారు.

విజయ్: “నా ప్రియ మిత్రుడు అజిత్ కుమార్ తల్లి మోహిని అమ్మగారు స్వర్గస్థులయ్యారనే వార్త తీవ్ర విచారానికి గురిచేసింది. జీవితంలోని అన్ని దశల్లో అండగా నిలిచిన తల్లిని కోల్పోయిన నా స్నేహితుడు అజిత్ కు, వారి కుటుంబ సభ్యులకు నా హృదయపూర్వక సానుభూతి.” అని పేర్కొన్నారు.

రాధికా శరత్‌కుమార్: “డియర్ అజిత్, మీ అమ్మగారి మరణవార్త విని చాలా బాధపడ్డాను. మీ కుటుంబానికి భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను.” అని ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు.

Related News

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

ఫిగర్ బాలేదని టార్చర్.. 40 ఏళ్లొచ్చాకే ఆ నరకం నుండి బయటపడ్డానంటున్న తారక్ హీరోయిన్

యాంకర్ సుమ హీరోయిన్‌గా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా ?

‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్..ఇదైనా ఖాయమా యష్?

72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు.. ఉత్తమ చిత్రం ఏదంటే?

విక్రమ్ 1 సక్సెస్.. చిరు ఫిదా: ప్రైవేట్ రాకెట్ ప్రయోగంపై మెగాస్టార్ క్రేజీ రియాక్షన్!

గుర్తుపట్టలేనంతగా మారిపోయిన బాలయ్య భామ..టార్గెట్ సెకండ్ ఇన్నింగ్స్ ?

మరోసారి భయపెట్టడానికి సిద్ధమైన డిమోంటీ కాలనీ 3.. కొత్త రిలీజ్ డేట్ లాక్!

Big Stories

Advertisement
×