Google Account Update 2026: ప్రస్తుత డిజిటల్ యుగంలో ఈ మెయిల్ కేవలం కమ్యూనికేషన్ కోసం మాత్రమే ఉపయోగపడటం లేదు. ఇది మన డిజిటల్ గుర్తింపు కూడా. స్మార్ట్ ఫోన్ వాడే ప్రతి ఒక్కరికీ ఖచ్చితంగా జీమెయిల్ అకౌంట్ ఉంటుంది. ఇదిలా ఉంటే చాలా మంది చిన్న వయస్సులో లేదా సరైన అవగాహన లేకనో వింత వింత పేర్లతో ఈ మెయిల్ ఐడీలను క్రియేట్ చేసుకుంటారు. ఆ తర్వాత ఫ్రొఫెషనల్ లైఫ్‌లోకి వచ్చాక, ఆ పేర్లు వాడాలంటే ఇబ్బందిగా అనిపిస్తుంటుంది. అయితే.. ఇప్పటి వరకు గతంలో వాడినా జీమెయిల్ అడ్రస్ మార్చుకోవడం అనేది అసాధ్యంగా ఉండేది. కానీ గూగుల్ ఎట్టకేలకు యూజర్ల దశాబ్దాల కల నెరవేరుస్తూ నేడు (ఏప్రిల్ 1) న కీలక అప్ డేట్ ఇచ్చింది. ఇప్పుడు పాత డేటా పోకుండానే మీకు నచ్చినట్లుగా మెయిల్ మార్చుకోవచ్చు.
సాధారణంగా జీమెయిల్ అడ్రస్ మార్చాలంటే మాత్రం కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకుని, పాత అకౌంట్‌లోని కాంటాక్ట్స్, ఫోటోలతో పాటు డ్రైవ్ ఫైల్స్ మ్యాన్యువల్ గా ట్రాన్స్ ఫర్ చేసుకోవాల్సి వచ్చేది. ఇది చాలా పెద్ద ప్రాసెస్. కానీ తాజా అప్ డేట్ ప్రకారం యూజర్లు తమ ప్రైమరీ జీమెయిల్ అడ్రస్‌ను నేరుగా మార్చుకోవడానికి అవకాశం ఉంది. దీని అర్థం ఏంటంటే.. మీ అకౌంట్ లో ఉన్న గూగుల్ ఫోటోలు, డ్రైవ్ డాక్యుమెంట్స్, యూట్యూబ్ సబ్ స్క్రిప్షన్లు , ప్లే స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసిన యాప్స్ ఏవీ కూడా మారవు. కేవలం మీ మెయిల్ ఐడీ మాత్రమే మారుతుంది.
ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది కదా అని ఎన్నిసార్లైనా మర్చుకోవచ్చని అనుకుంటే పొరపాటే.. ఎందుకంటే దీనికి సంబంధించి గూగుల్ కొన్ని కఠినమైన నిబంధనలు కూడా పెట్టింది.
1.ఏడాదికి ఒకసారి : మీరు మీ జీమెయిల్ అడ్రస్‌ను ఏడాదికి మాత్రమే మార్చుకునేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి పేరు ఎంచుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.
2. గరిష్టంగా: యూజర్ తన గూగుల్ అకౌంట్‌ను జీవితకాలంలో కేవలం 3 సార్లు మాత్రమే ఇలా పేరు మార్చుకోవడానికి వీలుంటుంది.
ఇది చాలా కీలకమైన పాయింట్. మీరు అడ్రస్ మార్చిన తర్వాత.. మీ పాత ఈమెయిల్ ఐడీ ఒక ‘Alias’ (మారుపేరు) గా పని చేస్తుంది. అంటే.. ఎవరైనా పాత అడ్రస్‌కు మెయిల్ పంపినా అది ఆటోమేటిక్‌గా మీ కొత్త మెయిల్ బాక్స్‌కు చేరుతుంది.
లాగిన్ : మీరు మీ పాత ఈమెయిల్ ఐడీతో కూడా గూగుల్ సర్వీసులకు లాగిన్ అవ్వొచ్చు.
మీరు మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ (iOS) మొబైల్స్ లేదా కంప్యూటర్ ద్వారా సింపుల్ గా జీమెయిల్ అడ్రస్ మార్చుకోవచ్చు.
వెబ్‌సైట్ ఓపెన్ చేయండి: ముందుగా మీ బ్రౌజర్‌లో myaccount.google.com/google-account-email అనే లింక్‌కు వెళ్లండి.
లాగిన్: మీ ప్రస్తుత గూగుల్ క్రెడెన్షియల్స్‌తో లాగిన్ అవ్వండి.
పర్సనల్ డేటా: పేజీ పైన ఉన్న ‘Personal info’ ట్యాబ్ పై క్లిక్ చేయండి.
ఈమెయిల్ సెక్షన్: కిందకు స్క్రోల్ చేస్తే మీకు ‘Email’ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి.
చేంజ్ ఆప్షన్: అక్కడ ‘Google Account email’ కింద ఉన్న ‘Change Google Account email’ ను సెలక్ట్ చేసుకోండి.
కొత్త పేరు: మీకు కావాల్సిన కొత్త యూజర్ నేమ్ టైప్ చేయండి. అది అందుబాటులో ఉంటేనే.. మీకు అవకాశం ఉంటుంది.
కన్ఫర్మేషన్: చివరగా ‘Change email’క్లిక్ చేసి, వచ్చే పాప్-అప్‌లో ‘Yes, change email’ అని సెలెక్ట్ చేయండి.
అంతే..మీ కొత్త జీమెయిల్ అడ్రస్ వెంటనే అప్‌డేట్ అయిపోతుంది.
చాలా మందికి ఉండే ప్రధాన సందేహం.. అడ్రస్ మార్చితే పాత మెయిల్స్ లేదా ఫైల్స్ పోతాయా అని. గూగుల్ దీనిపై స్పష్టమైన వివరణ ఇచ్చింది.
1.మీ Google Drive లోని ఫైల్స్ అన్నీ సురక్షితంగా ఉంటాయి.
2.Google Photos లోని పాత ఫోటోలకు ఎలాంటి ఢోకా లేదు.
3. మీరు ప్లే స్టోర్‌లో కొన్న సబ్‌స్క్రిప్షన్లు యథావిధిగా కొనసాగుతాయి.
అయితే ఒక చిన్న హెచ్చరిక.. కొన్ని థర్డ్ పార్టీ యాప్స్ లేదా వెబ్‌సైట్లలో మీరు మీ పాత జీమెయిల్ ఐడీతో సైన్-ఇన్ అయి ఉంటే.. అక్కడ కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అలాంటి చోట్ల మళ్ళీ ఒకసారి లాగిన్ వివరాలను అప్‌డేట్ చేసుకోవడం మంచిది.
Also Read: LPG Gas Saving Tips: LPG గ్యాస్ ఆదా సీక్రెట్: ప్రెజర్ కుక్కర్ Vs ఓపెన్ కుకింగ్.. ఏది వాడితే మంచిది?
ప్రస్తుతానికి గూగుల్ ఈ రోల్ అవుట్‌ను అమెరికా (US) లోని యూజర్లకు మాత్రమే అందుబాటులోకి తెచ్చింది. సాఫ్ట్‌వేర్ పరంగా ఏవైనా బగ్స్ ఉన్నాయేమో చెక్ చేసిన తర్వాత, రాబోయే కొన్ని వారాల్లోనే ఇండియా సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిగతా దేశాలకు విస్తరించనుంది.
గూగుల్ తీసుకున్న ఈ నిర్ణయం లక్షలాది మందికి ఉపశమనం కలిగించే అంశం. ముఖ్యంగా ఉద్యోగ వేటలో ఉన్నవారు.. తమ పాత “అన్‌ప్రొఫెషనల్” ఈమెయిల్ ఐడీలను మార్చుకోవడానికి ఇది ఒక సువర్ణావకాశం. ఒకవేళ మీరు కూడా మీ జీమెయిల్ అడ్రస్ మార్చాలని ఎప్పటి నుంచో అనుకుంటుంటే.. ఈ అప్‌డేట్ మీ కోసమే.