E-Paper
Advertisement

సౌండ్‌బార్ కొనాలో.. హోమ్ థియేటర్ కొనాలో అర్థం కావట్లేదా? ఈ ఒక్క సీక్రెట్ తెలిస్తే ఈజీగా డిసైడవుతారు!

సౌండ్‌బార్ కొనాలో.. హోమ్ థియేటర్ కొనాలో అర్థం కావట్లేదా? ఈ ఒక్క సీక్రెట్ తెలిస్తే ఈజీగా డిసైడవుతారు!
Advertisement

Best Home Theatre Systems: ఇప్పుడంతా టీవీల స్క్రీన్ క్వాలిటీ పెరిగింది కానీ, వాటి ఇన్‌బిల్ట్ సౌండ్ మాత్రం ఆ దృశ్యాలకు తగ్గట్టుగా ఉండటం లేదు. అందుకే ఇళ్లలో హోమ్ థియేటర్ల అవసరం పెరుగుతోంది. అయితే చాలామంది బ్రాండ్ల వెనుక పడతారు కానీ, గది పరిమాణం, బడ్జెట్ అనే ముఖ్యమైన విషయాలను మర్చిపోతుంటారు. ఈ క్రమంలో గదికి పరిమాణాన్ని బట్టి సరైన హోమ్ థియేటర్ సిస్టమ్‌ను ఎంచుకోవడం ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

గది సైజును బట్టి ఎంపిక:

హోమ్ థియేటర్ కొనే ముందు రూమ్ సైజ్ చూసుకోవడం చాలా ముఖ్యం. 100 లేదా 150 చదరపు అడుగుల చిన్న గదిలో పెద్ద సౌండ్ సిస్టమ్ పెడితే.. శబ్దం గోడలకు తగిలి రీసౌండ్ వచ్చి వినసొంపుగా ఉండదు. అలాంటి చిన్న గదులకు సౌండ్‌బార్ లేదా చిన్న 2.1 సిస్టమ్ సరిపోతుంది. మీడియం రూమ్స్ అయితే 5.1 సిస్టమ్, పెద్ద హాల్స్ అయితే 7.1 లేదా డాల్బీ అట్మాస్ సిస్టమ్స్ అద్భుతంగా పనిచేస్తాయి.

టెక్నికల్ నెంబర్ల అర్థం ఇదే:

Advertisement

మనం తరచూ వినే 2.1 లేదా 5.1 నంబర్ల వెనుక ఒక చిన్న లాజిక్ ఉంది. మొదటి నెంబర్ స్పీకర్ల సంఖ్యను, రెండో నెంబర్ సబ్‌వూఫర్‌ను సూచిస్తుంది. 5.1 సిస్టమ్‌లో చుట్టూరా ఐదు స్పీకర్లు, ఒక బేస్ వూఫర్ ఉండి థియేటర్ లాంటి ఫీలింగ్ ఇస్తాయి. ఇక డాల్బీ అట్మాస్ అయితే శబ్దం పక్కల నుంచే కాకుండా పైనుంచి కూడా వస్తున్నట్లు త్రీడీ అనుభూతిని కలిగిస్తుంది.

బడ్జెట్‌ను ముందే నిర్ణయించుకోండి:

మార్కెట్లో రకరకాల మోడల్స్ ఉంటాయి కాబట్టి.. ముందే బడ్జెట్ అనుకోవడం మంచిది. బడ్జెట్ రేంజ్ సాధారణంగా రూ.15వేల లోపు బేసిక్ సౌండ్‌బార్స్, రూ.30వేల లోపు మిడ్‌రేంజ్ సిస్టమ్స్, ఆ పైన ప్రీమియం హోమ్ థియేటర్లుగా ఉంటుంది. మీ బడ్జెట్ పరిధిని ముందే ఫిక్స్ చేసుకుంటే అనవసరమైన ఆప్షన్లను పక్కన పెట్టి తక్కువ సమయంలోనే బెస్ట్ మోడల్‌ను ఎంచుకోవచ్చు.

Advertisement

Also Read: GST రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేయాలా? ఆఫీసుల చుట్టూ తిరగకుండా ఇంట్లోనే ఇలా చేసుకోండి!

వాటేజ్ ముఖ్యం కాదు.. ఫీచర్లు ముఖ్యం:

చాలామంది ఎక్కువ వాట్స్ ఉంటే ఎక్కువ సౌండ్ వస్తుందని భ్రమపడతారు. కానీ ఎక్కువ వాటేజ్ ఉన్న సిస్టమ్ చిన్న గదిలో ఘోరంగా వినిపించవచ్చు. దానికంటే మీ టీవీకి HDMI eARC సపోర్ట్ ఉందో లేదో చూసుకోవడం ముఖ్యం. ఇది టీవీ లోని ఒరిజినల్ ఆడియో క్వాలిటీని ఏమాత్రం తగ్గకుండా హోమ్ థియేటర్‌కు అందిస్తుంది. అలాగే స్మార్ట్ బాక్స్‌లు, గేమింగ్ కన్సోల్‌లకు ఇది కనెక్ట్ అవుతుందో లేదో కూడా చెక్ చేసుకోవాలి.

అవసరానికి తగ్గట్టు ఎంచుకోవాలి:

సినిమాలు ఎక్కువగా చూసేవారికి డాల్బీ డిజిటల్ సపోర్ట్ చేసే సౌండ్‌బార్ చాలు. అదే స్పోర్ట్స్ ఇష్టపడేవారికి మంచి బేస్ ఉన్న 5.1 సిస్టమ్ బాగుంటుంది. ఇక గేమర్స్ విషయానికి వస్తే.. లాటెన్సీ తక్కువగా ఉండే సిస్టమ్స్ ఉత్తమం. బ్రాండ్ల కంటే మీ గది పరిమాణం, బడ్జెట్, మీ అవసరాలను బట్టి కొనుగోలు చేస్తే మీ ఇంటికి పర్ఫెక్ట్ హోమ్ థియేటర్‌ సెట్ చేసుకోవచ్చు.

Also Read: ఇక థియేటర్‌కు వెళ్లక్కర్లేదు.. 4 స్పీకర్లు, మినీ ఎల్‌ఈడీ డిస్‌ప్లేతో వచ్చేస్తోన్న షావోమి కొత్త సిరీస్!

Related News

Facebook వాడే ప్రతి ఒక్కరూ మార్చాల్సిన 5 సీక్రెట్ సెక్యూరిటీ సెట్టింగ్స్ ఇవే!

iPhone 18 Pro Max లీక్స్.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే, కానీ ఆ ఒక్కటే పెద్ద ట్విస్ట్!

గేమర్స్‌కు పూనకాలు తెప్పిస్తున్న Oppo K15.. నీళ్లలో పడినా, రఫ్ అండ్ టఫ్ వాడినా తగ్గేదే లేదంట!

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

బడ్జెట్ ధరలో బెస్ట్ 3-డోర్ ఫ్రిజ్.. వర్ల్‌పూల్ ప్రోటాన్ రివ్యూ

రూ.1,599 కే బెస్ట్ ఇయర్‌బడ్స్..హెవీ బేస్‌తో మార్కెట్ షేక్!

మార్కెట్‌ను షేక్ చేస్తున్న 43 ఇంచుల టీవీ.. ఫీచర్స్ నెక్స్ట్ లెవెల్!

కేవలం రూ. 999 కే హెడ్‌ఫోన్స్..సౌండ్ క్వాలిటీ చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

Big Stories

Advertisement
×