IPL 2026 Finals: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ (Indian Premier League 2026 Tournament) ఫైనల్ మ్యాచ్ మరికొద్ది గంటలోనే ప్రారంభం కానుంది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ గుజరాత్ టైటాన్స్ ( Royal Challengers Bengaluru vs Gujarat Titans, Final) మధ్య ఈ ఫైనల్స్ జరగనుంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం (Narendra Modi Stadium, Ahmedabad) వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ నేపథ్యంలో రాయల్ చాలెంజర్స్ జట్టుకు ఊహించిని షాక్ తగిలినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. 2016 ఐపిఎల్ ఫైనల్స్ సందర్భంగా బెంగళూరు జట్టుకు చుక్కలు చూపించిన బెన్ కట్టింగ్ గుజరాత్ తరఫున బరిలోకి దిగుతున్నట్లు సోషల్ మీడియాలో దారుణంగా పోస్టులు పెడుతున్నారు. మీ రంకు మొగుడు వచ్చేస్తున్నాడు రా ? అంటూ బెంగళూరు జట్టును దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు హైదరాబాద్ అభిమానులు. ఈ మేరకు బెన్ కట్టింగ్ ( Ben Cutting SRH) 2016 ఫైనల్స్ సందర్భంగా ఆడిన ఇన్నింగ్స్ వీడియోను కూడా వైరల్ చేస్తున్నారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2016 సంవత్సరంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ను చిత్తుగా ఓడించి మరీ చాంపియన్ అయింది సన్ రైజర్స్ హైదరాబాద్. ఈ మ్యాచ్ లో 8 పరుగుల తేడాతో హైదరాబాద్ గెలిచి ఛాంపియన్ అయింది. ఈ మ్యాచ్ లో బెన్ కట్టింగ్ ఆల్ రౌండర్ ప్రదర్శన కనబరిచాడు. ఈ మ్యాచ్ లో 8వ వికెట్ కు బరిలోకి దిగిన బెన్ కట్టింగ్ 15 బంతులో 39 పరుగులు సాధించాడు. 260 స్ట్రైక్ రేట్ సాధించిన బెన్ కట్టింగ్, నాలుగు సిక్సర్లు అలాగే మూడు బౌండరీలు సాధించాడు. ఈ దెబ్బకు నిర్ణీత 20 ఓవర్లలో హైదరాబాద్ ఏడ్ వికెట్ల నష్టానికి 208 పరుగులు సాధించింది. అతడు ఆడిన కీలక ఇన్నింగ్స్ హైదరాబాద్ జట్టుకు చాలా ప్లస్ అయింది. అలాగే ఈ మ్యాచ్ లో నాలుగు ఓవర్లు వేసిన బెన్ కట్టింగ్, 35 పరుగులు ఇచ్చి ఏకంగా రెండు వికెట్లు పడగొట్టాడు. ఈ దెబ్బకు 8 పరుగుల తేడాతో హైదరాబాద్ విజయం సాధించింది. ఈ మ్యాచ్లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కూడా బెన్ కట్టింగ్ సొంతం చేసుకున్నాడు. దీంతో అప్పటినుంచి బెంగళూరు పాలిట విలన్ గా బెన్ కట్టింగ్ మారినట్లు సోషల్ మీడియాలో చాలా ట్రోల్స్ చేస్తారు.
ఇవాళ బెంగళూరు వర్సెస్ గుజరాత్ మధ్య ఫైనల్స్ జరగనుంది. ఇలాంటి క్రమంలో బెన్ కట్టింగ్ మరోసారి గుజరాత్ టైటాన్స్ తరఫున బరిలోకి దిగుతున్నాడని కొంతమంది ట్రోల్స్ చేస్తున్నారు. గుజరాత్ ఆటగాడు షారుక్ ఖాన్ కు గాయమైందని.. ఇందులో భాగంగానే ఆస్ట్రేలియా నుంచి నేరుగా ఇవాళ సాయంత్రం 6 గంటలకు మోడీ స్టేడియంలో దిగుతాడని బెన్ కట్టింగ్ ఫోటోలను వైరల్ చేస్తున్నారు. కావాలనే బెంగుళూరు జట్టును భయపట్టించే ప్రయత్నం చేస్తున్నారు నెటిజెన్స్. కానీ ఇందులో ఎలాంటి వాస్తవం లేదు. బెంగళూరును ఆడుకునేందుకు గాను ఇలా ట్రోల్ చేస్తున్నారు.
🚨🚨 BIG BREAKING 🚨🚨
> Gujarat Titans player Shah Rukh Khan has reportedly suffered an injury during a practice session.
> All-rounder Ben Cutting is all set to replace him before 6pm today.
> He is expected to join the squad before the toss and will be included in the… pic.twitter.com/YUQZ1GTii9— Ishan Ghosh¹⁷🇮🇳 (@PantVerse) May 31, 2026