E-Paper
Advertisement

AC Buying Guide: ఎండ నేరుగా పడే పైఅంతస్తులకు.. ఎలాంటి ఏసీ కొంటే బెస్ట్.. సూటిగా సూత్తి లేకుండా..!

AC Buying Guide: ఎండ నేరుగా పడే పైఅంతస్తులకు.. ఎలాంటి ఏసీ కొంటే బెస్ట్.. సూటిగా సూత్తి లేకుండా..!
Advertisement

AC Buying Guide: ఏసీలు కొనుగోలు చేసే సమయంలో పూర్తి అవగాహన తప్పనిసరి అని నిపుణులు సూచిస్తున్నారు. నేరుగా షాపుకు వెళ్లి నచ్చింది తీసుకోవడం కాకుండా.. గది పరిమాణం, ఒకవేళ అపార్ట్ మెంట్ అయితే ఏ అంతస్తులో ఉంటున్నారు? వంటివి కూడా ఏసీ పనితీరుపై ప్రభావం చూపిస్తాయని స్పష్టం చేస్తున్నారు. అంతేకాకుండా ఇంట్లో సీలింగ్ ఎత్తు కూడా ఏసీ కూలింగ్ ను ప్రభావితం చేస్తుందని తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో గది విస్తీర్ణం, సీలింగ్ ఎత్తు, టాప్ ఫ్లోర్ లో ఉంటే ఎలాంటి ఏసీ కొనాలో ఈ కథనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

గది విస్తీర్ణాన్ని బట్టి..

ప్రస్తుతం మార్కెట్లో 0.8 టన్ నుంచి 2.0 టన్ సామర్థ్యం వరకూ ఏసీలు అందుబాటులో ఉన్నాయి. టన్ పెరుగుతున్న కొద్ది.. ఏసీ కూలింగ్ సామర్థ్యం అంత మెరుగు అవుతున్నట్లు లెక్క. ఒకవేళ మీరు ఏసీ పెట్టాలని భావిస్తున్న గది విస్తీర్ణం.. 100 చదరపు అడుగుల లోపు ఉంటే 0.8 నుండి 1.0 టన్ ఏసీ సరిపోతుంది. అలా కాకుండా 100-150 చ. అ. ఉంటే 1.5 టన్ సామర్థ్యమున్న ఏసీ కొనాల్సి ఉంటుంది. లేదంటే గది ఇంకా పెద్దగా 150-250 చ.అ. విస్తీర్ణంలో ఉన్నట్లైతే తప్పనిసరిగా 2.0 టన్ ఏసీనే కొనుగోలు చేయాలి. అంతకంటే తక్కువ టన్ ఏసీని తీసుకుంటే గది విస్తీర్ణానికి.. ఏసీ సామర్థ్యం సరిపోక కూలింగ్ ఉందన్న ఫీలింగే కలగదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

టాప్ ఫ్లోర్ ప్రభావం..

Advertisement

ప్రస్తుతం నగరాలు, పట్టణాల్లో బహుళ అంతస్తులు పెద్దఎత్తున పెరిగిపోయాయి. ఒకవేళ పై అంతస్తుల్లో ఉండేవారికి సూర్యరశ్మి నేరుగా పైకప్పుపై ఇల్లు చాలా వేగంగా వేడెక్కుతుంది. కాబట్టి దీన్ని పరిగణలోకి తీసుకొని కూడా ఏసీ సామర్థ్యాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. మీరు ఇంటి పై అంతస్తులో ఉంటున్నట్లైతే.. పైన సూచించిన గది విస్తీర్ణం లెక్కకు అదనంగా 0.5 టన్ పెంచుకుంటే బెటర్. ఉదాహరణకు మీ గది 120 చదరపు అడుగులు అని భావిస్తే.. పై పారాగ్రాఫ్ లెక్కల ప్రకారం 1.5 టన్ ఏసీ తీసుకుంటే సరిపోతుంది. కానీ మీరు పై అంతస్తులో ఉన్నందువల్ల.. 1.5 టన్ కు బదులు 2.0 టన్ ఏసీ తీసుకుంటే గది త్వరగా చల్లబడేందుకు వీలు కలుగుతుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

సీలింగ్ ఎత్తులో ఉంటే..

సాధారణంగా ఏ ఇంట్లో అయినా గదులు సీలింగ్ ఎత్తు 10 అడుగుల లోపే ఉంటుంది. ఒకవేళ మీ ఇంట్లోని గది ఎత్తు 12 అడుగులు, అంతకంటే ఎక్కువ ఉంటే.. గదిలో అధికంగా కూలింగ్ ను నింపాల్సి వస్తుంది. అలాంటి సందర్భాల్లో గది విస్తీర్ణాన్నే కాకుండా.. సీలింగ్ ఎత్తును సైతం పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఎత్తు పెరిగే కొద్ది ఏసీ లోడ్ ను సైతం పెంచాల్సి వస్తుంది. కాబట్టి విస్తీర్ణంతో పాటు సీలింగ్ ఎత్తు పెరిగే కొద్ది 0.5 టన్ ఏసీ సామర్థ్యాన్ని పెంచుకోవాలని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

Advertisement

Also Read: LPG యూజర్లకు బిగ్ అలర్ట్.. కొత్త రూల్స్ అమల్లోకి వచ్చేశాయ్.. ఈ పొరపాట్లు అస్సలు చేయెుద్దు!

మరికొన్ని చిట్కాలు..

ఒకవేళ గదిలో కిటికీలు ఎక్కువగా ఉన్నట్లైతే.. వేడి త్వరగా చేరి రూమ్ హీటెక్కవచ్చు. అలాంటి సమయాల్లో 0.2 టన్ అధినంగా అవసరం అవుతుంది. అలాగే గది కిటికీలు.. పడమర వైపు ఉంటే మధ్యాహ్నం వేళ ఎండ నేరుగా కిటికిపై పడుతుంది. అలాంటప్పుడు ఇన్వర్టర్ ఏసీకి ప్రాధాన్యత ఇస్తే మంచిదని నిపుణులు పేర్కొంటున్నారు. మరోవైపు గదిలో ఉండే వ్యక్తులను సైతం ఏసీ కొనేటప్పుడు పరిగణలోకి తీసుకోవాలని సూచిస్తున్నారు. నలుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది ఏసీ గదిలో నిత్యం ఉండేట్లు అయితే తప్పనిసరిగా 1.5 టన్ లేదా 2.0 సామర్థ్యమున్న ఏసీని తీసుకోవాలని దిశానిర్దేశం చేస్తున్నారు.

Also Read: హైదరాబాద్‌లో సరికొత్త టెక్నాలజీ.. ఏసీ, కూలర్ లేకుండానే కూలింగ్.. ఇదేదో భలే ఉందే!

Related News

రూ.లక్షలు పెట్టి ఏఐ ఫోన్ కొనాలా? లేక సాధారణ ఫోనే బెటరా? రెండింటికీ తేడా ఇదే!

క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తున్నారా? ఈ తప్పులు చేయకండి.. లేదంటే ఖాతాలో డబ్బులు మటాష్!

ఇంటర్నెట్ లేకపోయినా.. BSNL బ్యాలెన్స్, వ్యాలిడిటీ క్షణాల్లో తెలుసుకోండిలా!

కనిపించకుండా పోయిన వస్తువులను ఇట్టే వెతికి పట్టుకోవచ్చు.. శాంసంగ్ నుంచి క్రేజీ డివైజ్!

అమెజాన్ దసరా ఆఫర్.. రూ. 45,000 లోపే యాపిల్ ఐప్యాడ్.. రూ. 20,000 లోపే టాప్ ఫోన్లు!

Samsung Galaxy S27 Ultraలో స్నాప్‌డ్రాగన్‌కు నో ఎంట్రీ.. కారణం ఎంటో తెలుసా?

వీఐ సంచలనం.. దేశంలో తొలి ప్రీపెయిడ్ ఫ్యామిలీ ప్లాన్ లాంచ్.. డేటా షేరింగ్‌తోపాటు 10% డిస్కౌంట్!

ఈ సీక్రెట్ ట్రిక్స్ తెలిస్తే.. రోజంతా ఏసీ, ఫ్రిజ్ వాడినా కరెంట్ బిల్లు సగమే!

Big Stories

Advertisement
×