E-Paper
Advertisement

Janhvi Kapoor: రామ్ చరణ్ ‘పెద్ది’ నుంచి జాన్వీ కపూర్ బర్త్‌డే గ్లింప్స్..

Janhvi Kapoor: రామ్ చరణ్ ‘పెద్ది’ నుంచి జాన్వీ కపూర్ బర్త్‌డే గ్లింప్స్..
Advertisement

Janhvi Kapoor: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘పెద్ది’. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ నటిస్తోంది. ఆమె పుట్టినరోజు కావడంతో, చిత్ర బృందం ఆమె పాత్రకు సంబంధించిన ఒక చిన్న గ్లింప్స్‌ను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ఈ గ్లింప్స్‌లో జాన్వీ కపూర్ ఎంతో సంప్రదాయబద్ధంగా, అచ్చతెలుగు పల్లెటూరి అమ్మాయిలా కనిపిస్తోంది. పక్కా లోకల్ అమ్మాయిగా జాన్వీ తన నటనతో మెప్పించబోతోందని ఈ చిన్న గ్లింప్స్ ద్వారా అర్థమవుతోంది.

Read also-Dhurandhar Trailer: రణ్‌వీర్‌ సింగ్ ‘ధురంధర్: ద రివేంజ్’ ట్రైలర్ డేట్ ఫిక్స్.. వచ్చేది ఎప్పుడంటే?

Advertisement

ఈ సినిమా కేవలం రామ్ చరణ్, జాన్వీ కపూర్ కలయిక వల్లే కాకుండా, ఇందులో నటిస్తున్న ఇతర ప్రముఖ నటుల వల్ల కూడా వార్తల్లో నిలుస్తోంది. కన్నడ కంఠీరవ శివ రాజ్‌కుమార్, వెర్సటైల్ యాక్టర్ జగపతి బాబు, మరియు బాలీవుడ్ నటుడు దివ్యేందు శర్మ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. సాంకేతిక పరంగా కూడా ఈ సినిమా అత్యున్నత ప్రమాణాలతో రూపొందుతోంది. ఆస్కార్ విజేత ఏ.ఆర్. రెహమాన్ ఈ చిత్రానికి అద్భుతమైన స్కోర్‌ను అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన్ రెండు పాటలు చాట్ బాస్టర్లుగా నిలిచాయి. ప్రముఖ కెమెరామెన్ రత్నవేలు దృశ్యాలను బంధిస్తున్నారు. బుచ్చిబాబు సన తనదైన శైలిలో ఒక స్పోర్ట్స్ డ్రామాను ఎమోషనల్ టచ్‌తో తెరకెక్కిస్తున్నారు.

Read also-Psychological horror thriller OTT: పెళ్ళి కాకుండానే ప్రెగ్నెన్సీ… నరకం చూపించే సైతాన్… ఏం సినిమా సామి

Advertisement

వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పిస్తున్నాయి. ‘పెద్ది’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 2026, ఏప్రిల్ 30న విడుదల కానుంది. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత రామ్ చరణ్ క్రేజ్ అంతర్జాతీయ స్థాయిలో పెరిగింది. బుచ్చిబాబు సన గత చిత్రం ‘ఉప్పెన’ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో, వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న ‘పెద్ది’పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు జాన్వీ కపూర్ ‘చికీరి’ గ్లింప్స్ విడుదలవడంతో సినిమాపై ఆసక్తి మరింత రెట్టింపు అయ్యింది.

Related News

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

Big Stories

Advertisement
×