E-Paper
Advertisement

Solar Power Bank: అమెజాన్‌లో హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న సోలార్ పవర్ బ్యాంక్స్.. వాటి ప్రత్యేకతలు తెలిస్తే!

Solar Power Bank: అమెజాన్‌లో హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న సోలార్ పవర్ బ్యాంక్స్.. వాటి ప్రత్యేకతలు తెలిస్తే!
Advertisement

Solar Power Bank: ప్రస్తుత రోజుల్లో ఎక్కడికి వెళ్లాలన్నా చేతిలో ఫోన్ ఉండాల్సిందే. మరీ ముఖ్యంగా ట్రెకింగ్ అని, క్యాంపింగ్ అని ఊర్లు తిరిగే వాళ్లకైతే ఫోన్ ఛార్జింగ్ పెద్ద తలనొప్పి అనే చెప్పాలి. ఎందుకంటే.. కరెంటు సదుపాయం లేని ప్రదేశాల్లోకి వెళ్లినప్పుడు ఫోన్‌కు ఛార్జింగ్ పెట్టుకోవాలంటే కుదరదు కదా. ఇలాంటి నేపథ్యంలో సోలార్ పవర్ బ్యాంకులు ఉండాల్సిందే. పర్యావరణానికి మేలు చేస్తూ, కరెంట్ లేకపోయినా ఎండ సాయంతో ఫోన్‌ను ఛార్జ్ చేసే బెస్ట్ సోలార్ పవర్ బ్యాంకులు ఇప్పుడు అమెజాన్‌లో అందుబాటులో ఉన్నాయి.

Alain SolRover Solar Power Bank

ఈ అలైన్ సోల్‌రోవర్ పవర్ బ్యాంక్ 10000mAh భారీ బ్యాటరీతో వస్తుంది. దీని స్పెషాలిటీ ఏంటంటే.. ఎలాంటి కేబుల్స్ లేకుండానే వైర్‌లెస్ ఛార్జింగ్‌తో ఫోన్‌‌ను ఛార్జ్ చేస్తుంది. దీనికి ఉండే అయస్కాంతం వల్ల ఫోన్‌ను గట్టిగా పట్టుకుని ఉంటుంది. పైగా ఇది వాటర్‌ప్రూఫ్ కాబట్టి.. వర్షంలో తడిచినా ఏం కాదు. ఎకో ఫ్రెండ్లీగా ఛార్జింగ్ కావాలనుకుంటే ఈ అలైన్ సోల్‌రోవర్ పవర్ బ్యాంక్‌‌ను కొనుగోలు చేయొచ్చు.

Advertisement

Also Read: వాయిస్ కంట్రోల్ ఫీచర్లతో బెస్ట్ ఏసీలు.. ‘హే గూగుల్.. ఏసీ ఆన్ చెయ్’ అంటే చాలు!

Yashidun Waterproof Solar Power Bank

వారం నుంచి పది రోజులపాటు బయట తిరిగే వాళ్లకి యాషిదున్ 20000mAh పవర్ బ్యాంక్ కరెక్ట్‌గా సెట్ అవుతుంది. దీని కెపాసిటీ ఎక్కువ కాబట్టి.. ఎక్కువసార్లు ఫోన్ ఛార్జ్ చేసుకోవచ్చు. ఈ పవర్ బ్యాంక్ చాలా స్లిమ్‌గా ఉండటం వలన జేబులో పెట్టుకుని వెళ్లిపోవచ్చు. దీనిలో ఒకేసారి రెండు ఫోన్లను ఛార్జ్ చేయొచ్చు. ఈ పవర్‌ బ్యాంక్‌కు దిక్సూచి కూడా ఉండటం వల్ల దారి తప్పిపోయే ఛాన్సే ఉండదు.

PRAANA 3 In 1 Solar Survival Kit

Advertisement

బరువు తక్కువగా ఉండి, మెరుగైన పనితీరును అందించాలనుకుంటే.. ఈ సోలార్ పవర్‌ను బ్యాంక్‌ను కొనుగోలు చేయొచ్చు. దీనిలో సోలార్ ప్యానెల్, టార్చ్ లైట్, 5000mAh పవర్ బ్యాంక్ అన్నీ కలిసే ఉంటాయి. ముఖ్యంగా కరెంట్ పోయినప్పుడు లేదా కొండల్లో క్యాంపింగ్ వేసినప్పుడు ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది.

HACER Camping Solar Power Bank

తరచూ ట్రెకింగ్, క్లైంబింగ్ చేసే వాళ్లకి హాసర్ 10000mAh పవర్ బ్యాంక్ బెస్ట్ ఆప్షన్. దీనికి ఉండే COB ఫ్లాష్‌లైట్ రాత్రిపూట మామూలు టార్చ్ కంటే ఎక్కువ వెలుతురునిస్తుంది. బ్యాటరీ ఎంత ఉందో తెలియడానికి LED ఇండికేటర్స్ కూడా ఉంటాయి. ఇది చాలా తేలికగా ఉండటం వల్ల మోయడం కూడా పెద్ద కష్టమేమీ కాదు. ఈ పవర్ బ్యాంకు వలన ఖర్చుతో పాటు పర్యావరణాన్ని కూడా కాపాడుకున్న వాళ్లమవుతాం. ఇవీ మీ దగ్గరుంటే కరెంట్ లేకపోయినా హ్యాపీగా ప్రయాణాన్ని ఎంజాయ్ చేయొచ్చు.

Also Read: మీ స్మార్ట్‌ఫోన్‌లో ఈ 4 మార్పులు కనిపిస్తే.. దాని బ్యాటరీ పని అయిపోయినట్టే!

Related News

కన్నుల పండుగే.. ఏకంగా రూ.18,000 తగ్గింది, ఫ్లిప్‌కార్ట్‌లో రియల్‌మీ బంపర్ డిస్కౌంట్!

ఐకూ నుంచి క్రేజీ కాంపాక్ట్ టాబ్లెట్.. నెక్ట్స్ జనరేషన్ చిప్‌సెట్‌తో ఎంట్రీ!

ఐఫోన్ యూజర్లకు మెటా బిగ్ ఆఫర్.. ఐక్లౌడ్ లేకున్నా వాట్సప్ చాట్ బ్యాకప్ ఇక ఈజీ!

ఆకాశం నీలం, సూర్యాస్తమయం ఎరుపు.. అంతరిక్షం నలుపు.. అసలేంటీ రంగుల మిస్టరీ?

జస్ట్.. రూ.3,000 లోపే 45 రోజుల బ్యాటరీ బ్యాకప్.. ఐఫోన్ కంటే పవర్‌ఫుల్ టార్చ్‌తో Nokia 4G ఫోన్!

8,100mAh బ్యాటరీ, AI బటన్‌తో హానర్ నుంచి క్రేజీ ఫోన్.. ధరెంతో తెలిస్తే Buy Now నొక్కేస్తారు!

జియో, విఐ బెటర్ అంటున్న యూజర్లు.. ఎయిర్‌టెల్ 5G హాట్‌స్పాట్ బ్యాన్‌పై సోషల్ మీడియాలో ఆగ్రహం!

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ.. గేమర్స్ కోసం నెక్ట్స్ లెవెల్ టాబ్లెట్ వచ్చేసింది!

Big Stories

Advertisement
×