E-Paper
Advertisement

ఏసీ లేకపోయినా ఇల్లు కూల్ కూల్‌గా ఉండాలా? అయితే మన తాతల కాలపు ఈ ‘కూలింగ్ హ్యాక్స్’ ట్రై చేయండి!

ఏసీ లేకపోయినా ఇల్లు కూల్ కూల్‌గా ఉండాలా? అయితే మన తాతల కాలపు ఈ ‘కూలింగ్ హ్యాక్స్’ ట్రై చేయండి!
Advertisement

Summer Cooling Tips: మార్చి నెల దాటిందంటే చాలు.. పట్టణం, పల్లె అనే తేడా లేకుండా ఎండలు మండిపోతాయి. ఈ క్రమంలో 24 గంటలూ ఇళ్లల్లో ఏసీలు రయ్‌మంటూ తిరగడం మొదలవుతుంది. దీంతో నెలాఖరున కరెంటు బిల్లు చూసి అవాక్కవడం మన వంతు అవుతుంది. అయితే ఒకప్పుడు ఇవేవీ లేకపోయినా మన అమ్మమ్మలు, తాతయ్యలు పెంకుటిళ్లు, మట్టిళ్లలో హాయిగా, చల్లగా ఎలా గడిపారో తెలుసా? ఎందుకంటే.. ప్రకృతిని బట్టి ఇళ్లను మలుచుకోవడం వాళ్లకు బాగా తెలుసు. మరి ఈ రోజుల్లో అపార్ట్‌మెంట్‌ లైఫ్‌లో ఉండే మనం.. ఆనాటి ఐడియాలను ఇప్పుడెలా వాడుకోవాలో తెలుసుకుందామా..

సింథటిక్ బట్టలు జోలికి వెళ్లొద్దు:

వేసవిలో మనం ఎలాంటి బట్టలు వేసుకుంటున్నామనేదే కాదు.. ఇంట్లో ఎలాంటి వస్త్రాలు వాడుతున్నామనేది కూడా ముఖ్యమే. ఈ మధ్య చాలామంది ఇళ్లల్లో పాలీస్టర్ తెరలు, నైలాన్ సోఫా కవర్లు, దట్టమైన కార్పెట్లు వాడుతున్నారు. ఇవి ఇంట్లోని వేడిని బయటకు పోనివ్వకుండా లోపలే నొక్కేస్తాయి. అందుకే.. ఈ ఎండకాలం కాస్త ఓపిక తెచ్చుకుని వాటి స్థానంలో ప్యూర్ కాటన్, ఖాదీ లేదా జనపనారతో చేసిన కర్టెన్లు, బెడ్‌షీట్లు వాడండి. ఇవి గాలిని ఫ్రీగా రానించడమే కాదు.. ఉక్కపోతను కూడా తగ్గిస్తాయి. ఇల్లు కూడా చూడటానికి లైట్‌గా, ప్రశాంతంగా అనిపిస్తుంది.

వేడిగాలిని బయటికి పంపడం ముఖ్యం:

Advertisement

మనలో చాలామంది చేసే పెద్ద పొరపాటు ఏంటంటే.. ఎండగా ఉందని కిటికీలు, తలుపులన్నీ మూసేసి ఫ్యాన్ ఫుల్ స్పీడ్‌లో పెడతాం. దీనివల్ల లోపల ఉన్న వేడి గాలే మళ్లీ మళ్లీ తిరుగుతుంది తప్ప రూమ్ చల్లబడదు. పాతకాలంలో గాలి ఒకవైపు నుంచి వచ్చి మరోవైపు నుంచి బయటకు వెళ్లేలా ‘క్రాస్ వెంటిలేషన్’ చూసుకునేవారు. అందుకే ఇప్పుడు మనం ఏం చేయాలంటే.. రూంలో ఉన్న ఒక టేబుల్ ఫ్యాన్‌ను కిటికీ వైపు తిప్పి పెట్టాలి. అది లోపలి వేడి గాలిని బయటకు తోసేస్తుంది. అదే సమయంలో నీడ వైపు ఉన్న మరో కిటికీ నుంచి చల్లటి గాలి లోపలికి వచ్చేలా ప్లాన్ చేసుకోవాలి.

ఆ టైంలో కిటికీలు, తలుపులు తెరవాలి:

ముఖ్యంగా కాంక్రీట్ బిల్డింగులు పగలంతా ఎండను బాగా పీల్చుకుని, రాత్రి వేళ ఆ వేడిని గదుల్లోకి వదులుతాయి. అందుకే రాత్రిళ్లు బెడ్‌రూమ్‌లో ఉక్కపోత అధికంగా ఉంటుంది. దీనికి సింపుల్ విరుగుడు.. సూర్యుడు అస్తమించాక ఇంట్లోని తలుపులు, కిటికీలన్నీ కాసేపు పూర్తిగా తెరిచి ఉంచాలి. ఫ్యాన్లు ఆన్ చేసి లోపల నిండిపోయిన ఆ వేడి గాలినంతా బయటకు పంపేయాలి. ముఖ్యంగా మన దగ్గర రాత్రి పూట ఉష్ణోగ్రతలు తగ్గుతాయి కాబట్టి.. తెల్లవారేసరికి ఇల్లు మళ్లీ చల్లదనంతో ఫ్రెష్‌గా తయారవుతుంది.

Advertisement

Also Read: ఎండల ధాటికి పేలుతున్న ఫ్రిడ్జ్‌లు.. ఈ సౌండ్స్ వస్తే జాగ్రత్త, లేదంటే బ్లాస్టే!

వరండా‌ను ఇలా మార్చుకోండి:

పూర్వం ఇళ్ల ముందర పెద్ద అరుగులు, వరండాలు ఉండి ఎండ నేరుగా గదుల్లోకి రాకుండా అడ్డుకునేవి. ఇప్పుడు మన అపార్ట్‌మెంట్‌ బాల్కనీలను కూడా అలా వాడుకోవచ్చు. బాల్కనీ గ్రిల్స్‌కు దట్టంగా పెరిగే మనీ ప్లాంట్లు, తీగలు, లేదా వెదురు తడకలు (బ్లైండ్స్) కట్టేయండి. ఇవి సూర్యకిరణాలు నేరుగా గోడలపై, కిటికీ అద్దాలపై పడకుండా ఆపుతాయి. ఒక రకంగా చెప్పాలంటే.. మన ఇంటికి ఇవి చల్లటి రక్షణ కవచంలా పనిచేస్తాయి.

మధ్యాహ్నం ఆ పని చేయొద్దు:

నీరు ఆవిరియ్యేటప్పుడు చుట్టుపక్కల ఉండే వేడిని లాగేసుకుంటుంది. అందుకే కిటికీల దగ్గర లేదా ఫ్యాన్ గాలి తగిలేలా వెడల్పాటి మట్టి పాత్రల్లో నీళ్లు పోసి పెట్టండి. కుదిరితే కాటన్ తెరలను కాస్త తడిపి గాలి వచ్చే దారిలో వేయండి. ఆ గాలి రూమంతా చల్లదనాన్ని పంచుతుంది. దీంతో పాటు, మధ్యాహ్నం వేడి ఎక్కువగా ఉన్నప్పుడు కిటికీ తెరలు పూర్తిగా వేసేయడం.. ఓవెన్లు, ఐరన్ బాక్సులు, వాషింగ్ మెషీన్ల వాడకాన్ని ఉదయం లేదా రాత్రి వేళలకు మార్చుకోవడం చేస్తే ఇల్లు లోపల అస్సలు ఉక్కపోయదు.

Also Read: కెమెరా ప్రియులకు పండగే.. లీకైన Vivo V80, Vivo S2 ఫీచర్లు.. లుక్స్ వేరే లెవల్ అంతే!

Related News

ఈ సీక్రెట్ ట్రిక్స్ తెలిస్తే.. రోజంతా ఏసీ, ఫ్రిజ్ వాడినా కరెంట్ బిల్లు సగమే!

ట్రెండింగ్ vs యూజ్‌ఫుల్.. గ్యాడ్జెట్స్ కొనేముందు ఈ క్లారిటీ లేకపోతే డబ్బులు వేస్టే!

ఫోన్ ధర రూ.1.68 లక్షలు.. అయినా తగ్గదేలే అంటున్న జనాలు, iPhone Duoలో అంతలా ఏముంది?

చేతిలో ఇమిడిపోయే ప్రింటర్‌ తెచ్చిన షావోమీ.. దీని స్మార్ట్ ఫీచర్లు చూస్తే ఎవరైనా వావ్ అనాల్సిందే!

మన మాటల్ని సీక్రెట్‌గా రికార్డ్ చేసే AI డివైజ్‌లు.. అమెజాన్ కొత్త ప్రయోగం ఇదే!

ఒక్క రూపాయి ఖర్చు లేకుండా క్రెడిట్ కార్డ్ పాయింట్లను క్యాష్‌గా మార్చడం ఎలా?

నకిలీ QR కోడ్‌లను స్కాన్ చేసే ముందే ఇలా కనిపెట్టండి.. ఈ చిన్న ట్రిక్ తెలిస్తే మీ డబ్బు సేఫ్!

గూగుల్ ప్లేస్టోర్‌లో ఫేక్ వాట్సప్ యాప్.. అసలైనదో కాదో ఎలా గుర్తించాలి?

Big Stories

Advertisement
×