E-Paper
Advertisement

కెమెరా ప్రియులకు పండగే.. లీకైన Vivo V80, Vivo S2 ఫీచర్లు.. లుక్స్ వేరే లెవల్ అంతే!

కెమెరా ప్రియులకు పండగే.. లీకైన Vivo V80, Vivo S2 ఫీచర్లు.. లుక్స్ వేరే లెవల్ అంతే!
Advertisement

Vivo V80 and Vivo S2: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ వివో త్వరలోనే ఒక గుడ్ న్యూస్ చెప్పబోతోంది. చైనా మార్కెట్లో రెండు అదిరిపోయే స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేయడానికి కంపెనీ అంతా సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. అవే Vivo V80, Vivo S2. కంపెనీ ఇప్పటివరకు వీటి గురించి అధికారికంగా ప్రకటనా చేయలేదు కానీ, గ్లోబల్ సర్టిఫికేషన్ డేటాబేస్ (GSMA)లో ఈ రెండు ఫోన్ల పేర్లు కనిపించడంతో టెక్ ప్రపంచంలో గట్టిగా చర్చ నడుస్తోంది. డేటాబేస్‌లోకి వచ్చాయంటే.. ఇక మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వడం దాదాపు ఖాయమేనని నిపుణులు చెప్తున్నారు.

సిగ్నల్స్ అయితే వచ్చేసాయి..

లీకైన వివరాల ప్రకారం.. వివో V80 ఫోన్ V2630 మోడల్ నెంబర్‌తో, వివో S2 ఫోన్ V2576 మోడల్ నెంబర్‌తో ఆన్‌లైన్ డేటాబేస్‌లో కనిపించాయి. సాధారణంగా ఏదైనా ఫోన్ మార్కెట్లోకి వచ్చే ముందు ఇలాంటి సర్టిఫికేషన్లు రావడం కామనే. అంటే.. కంపెనీ ఈ ఫోన్ల విడుదలకు ఫినిషింగ్ పనులు చూసుకుంటోందని అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ లిస్టింగ్‌లో ఫోన్ల ఫీచర్లు ఎలా ఉంటాయి? ధర ఎంత ఉంటుంది అనే విషయాలను మాత్రం ప్రస్తుతానికి సీక్రెట్‌గానే ఉంచారు.

Advertisement

Also Read: ఐకూ దెబ్బ మామూలుగా లేదుగా.. 8000mAh బ్యాటరీతో 15T మోడల్ వచ్చేస్తోంది.. ఆ రోజే లాంచ్!

వివో V80 ఎలా ఉండబోతోంది?

గతంలో వచ్చిన వివో V70 సిరీస్‌కు అప్‌డేటెడ్ వెర్షన్‌గా ఈ వివో V80 రానుంది. ఎప్పటిలాగే వివో ఈసారి కూడా కెమెరా, స్లిమ్ లుక్‌పైనే ఎక్కువ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా Zeiss బ్రాండింగ్‌తో వచ్చే పోర్ట్రెయిట్ కెమెరా ఈ ఫోన్‌కు మెయిన్ హైలైట్ కానుంది. దీనిలో మీడియాటెక్ లేదా స్నాప్‌డ్రాగన్‌కు చెందిన మంచి పవర్‌ఫుల్ మిడ్‌రేంజ్ ప్రాసెసర్‌ను వాడతారట. అయితే, చైనాలో రాబోయే వివో S60 మోడల్‌ను బేస్ చేసుకుని దీనిని తయారు చేస్తున్నారని, ఒకవేళ అదే నిజమైతే.. ఇందులో స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్, 6.59 ఇంచుల స్క్రీన్, ఏకంగా 7,000mAh భారీ బ్యాటరీ ఉండే అవకాశం ఉందని టాక్ నడుస్తోంది.

వివో S2 విషయానికొస్తే..

Advertisement

ఇక Vivo S2 పరంగా చూసుకుంటే.. ఇది మొదట చైనాలోనే రిలీజ్ కానుంది. అసలే వివో S సిరీస్ అంటేనే అదిరిపోయే సెల్ఫీలు, స్టైలిష్ లుక్స్‌కు పెట్టింది పేరు. కాలేజీ స్టూడెంట్స్, యూత్‌ను టార్గెట్ చేస్తూ సూపర్ డిజైన్, క్రేజీ కెమెరా ఫీచర్లతో దీనిని తీసుకురాబోతున్నారు. ఈ రెండు ఫోన్ల అసలు ఫీచర్లు, ధర భారత్‌కు ఎప్పుడు వస్తాయి అనే వివరాలు తెలియాలంటే మాత్రం కంపెనీ అధికారికంగా ప్రకటించే వరకు ఆగాల్సిందే మరి.

Also Read: పాత ఫోన్ ఇస్తే రూ.22,000 డిస్కౌంట్.. Oppo Find X9s లాంచ్ ఆఫర్స్ లీక్!

Related News

స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు భూకంప హెచ్చరికల సాధనంగా.. గూగుల్ బిగ్ అప్‌డేట్!

యూట్యూబ్ ఛానెల్ పెడుతున్నారా? ఈ కంటెంట్‌తో వీడియోలు చేస్తే మీరే కింగ్.. కనక వర్షం కురవాల్సిందే!

యాపిల్ ప్రియులకు ఊహించని షాక్.. ఆన్‌లైన్ స్టోర్ బంద్, కారణం ఏమిటంటే?

యూట్యూబ్‌లో ఏఐ పాటలకు ప్రత్యేక లేబుల్స్.. అసలు ఇవి ఎలా పనిచేస్తాయంటే?

మెమరీ చిప్‌ల కొరత.. 14 ఏళ్ల కనిష్టానికి పడిపోయిన గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్!

iPhone 16 తక్కువ ధరకే వస్తోందని కొంటున్నారా? ఈ విషయం తెలిస్తే ప్లాన్ మార్చుకుంటారు!

యాపిల్ వాచ్ సిరీస్ 11పై ఊహించని డిస్కౌంట్.. అమెజాన్ పండుగ సేల్‌లో టాప్-5 డీల్స్ ఇవే!

శీతాకాలం అలర్ట్.. ఏసీ అవుట్ డోర్ యూనిట్‌కు కవర్.. కేవలం రూ.200తో రూ.20 వేల నష్టానికి చెక్!

Big Stories

Advertisement
×