E-Paper
Advertisement

జనాభా పెంపు ఇష్యూ.. సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు, వైసీపీ కొర్రీలు-చట్టబద్దత ఇవ్వాలంటూ డిమాండ్

జనాభా పెంపు ఇష్యూ.. సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు, వైసీపీ కొర్రీలు-చట్టబద్దత ఇవ్వాలంటూ డిమాండ్
Advertisement

Amaravati: ఏపీలో అధికార-విపక్షాల మధ్య మళ్లీ మాటల యుద్ధం మొదలైంది. జనాభా పెంపుపై సీఎం చంద్రబాబు చేస్తున్న ప్రకటనపై వైసీపీ తీవ్రస్థాయిలో రియాక్ట్ అయ్యింది. అంతేకాదు ఆయన మాటలు నమ్మి తల్లిదండ్రులు ఎవరూ మోసపోవద్దని ప్రకటన చేస్తుండడంతో రాజకీయాలు మరింత వేడెక్కాయి.

ఏపీలో రాజకీయాలు జనాభా పెంపు చుట్టూ తిరుగుతున్నాయి

Advertisement

అధికార ప్రభుత్వం ఏది చేసినా దానికి వ్యతిరేకంగా చేయడం వైసీపీ ముఖ్య ఉద్దేశం. రాజధాని అమరావతి, పరిశ్రమలు రావడం ఇలా ఏ విషయం తీసుకున్నా, దానిక యాంటీ స్టాండ్ తీసుకోవడం కనిపిస్తోంది. జనాభా పెంపుపై సీఎం చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలపై ధీటుగా స్పందించారు ఆ పార్టీ నాయకులు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ సోమవారం మీడియా ముందుకొచ్చారు.

సీఎం చంద్రబాబు మాటలు నమ్మి తల్లిదండ్రులు ఎవరూ మోసపోవద్దన్నారు. ఎక్కువ మంది పిల్లల్ని కంటే ప్రభుత్వం ఇచ్చే నజరానా కేవలం కాన్పు ఖర్చులకే సరిపోతుందన్నారు. అంతేకాదు దానికి కొత్త మెలిక పెట్టారు. సంతానం కంటే తల్లిదండ్రులకు ప్రభుత్వం రూ.50 లక్షల ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాదు ప్రతి ఏటా లక్ష రూపాయల వరకు ఆర్థిక సాయం ఇవ్వాలన్నారు.

Advertisement

సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు.. మోసపోవద్దంటూ వైసీపీ కౌంటర్

వారి అర్హతను బట్టి ఉద్యోగం ఇచ్చేలా జీవో కూడా విడుదల చేయాలన్నారు. ఆ జీవోకు శాశ్వత గ్యారెంటీ ఉండాలని, భవిష్యత్తులో ప్రభుత్వాలు మారినా చెల్లుబాటు అయ్యేలా చట్టబద్ధమైన గ్యారెంటీ ఇవ్వాలన్నారు. వైసీపీ నేతల మాటలు విన్న ప్రజలు, రేపటి రోజున వైసీపీ ప్రభుత్వం ఒకవేళ వచ్చినా వాటిని ఎత్తేసినా ఆశ్యర్యపోనక్కర్లేదని అంటున్నారు.

ఇప్పుటికే రాజధాని అమరావతిని నాశనం చేశారని, ఇలాంటి స్కీమ్‌లకు ఒక్క లెక్కా అంటూ చర్చించుకోవడం మొదలైంది. వైసీపీ నేతల మాటలను అధికార పార్టీ గమనిస్తోంది. ఇంతకీ శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట ప్రజావేదిక సభలో సీఎం చంద్రబాబు ఏమన్నారు? మూడో బిడ్డ కంటే 30 వేలు, నాలుగో బిడ్డయితే 40 వేలు ఇస్తామంటూ ప్రకటన చేశారు.

ALSO READ: భానుడి ప్రతాపం.. అల్లాడిపోతున్న జనం, అమాంతంగా పెరిగిన ఉష్ణోగ్రతలు, వారం పాటు ఇదే పరిస్థితి!

అంతేకాదు భవిష్యత్ లో తల్లికి వందనం స్కీమ్ సాయం పెంచుతామన్నారు. మహిళలు సృష్టికర్తలను, పిల్లలను భారంగా భావించొద్దన్నారు. మొత్తానికి వైసీపీ నేతల ప్రకటన ప్రజలను గందరగోళంలో పడేసిందన్నమాట. రాజధాని మాదిరిగా పిల్లలు కనడానికి చట్టబద్దత డిమాండ్ చేస్తోంది. దీనిపై కూటమి ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీ వస్తుందో చూడాలి. మరి వైసీపీ నేతలు చెప్పినట్టుగా ప్రభుత్వం ఏమైనా అడుగు ముందుకు వేస్తుందా? వెయిట్ అండ్ సీ.

 

Related News

స్థానిక ఎన్నికల వేల నేతలకు సీఎం చంద్రబాబు వార్నింగ్.. ఎమన్నారంటే?

ఎంపీ మిథున్ రెడ్డికి బిగ్ షాక్.. ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేసే చాన్స్..?

ఏపీలో తీవ్ర విషాదం.. అమలాపురం మాజీ ఎంపీ బుచ్చిబాబు కన్నుమూత!

తెలుగుదేశం పార్టీ రెండో జాబితా విడుదల.. ఇందులోను మహిళలదే హవా!

పులివెందులలో హైటెన్షన్.. నామినేషన్ కేంద్రం వద్ద కాల్పులు జరిపిన పోలీసులు!

సాలూరు జనసేనలో భగ్గుమన్న చైర్మన్ టికెట్ వివాదం.. కేడర్ తీవ్ర ఆగ్రహం!

రాజంపేటలో ఉద్రిక్తత.. వైసీపీ ఎమ్మెల్యే అమర్‌నాథ్ రెడ్డి ఇంటిపై దాడి!

ఏపీలో స్థానిక ఎన్నికల ఘర్షణలు.. వైఎస్ షర్మిల సంచలన కామెంట్స్!

Big Stories

Advertisement
×