E-Paper
Advertisement

రూ.5000 డిస్కౌంట్‌తో Xiaomi 17T.. భారీ బ్యాటరీ, లైకా కెమెరాలతో అదరగొడుతోంది!

రూ.5000 డిస్కౌంట్‌తో Xiaomi 17T.. భారీ బ్యాటరీ, లైకా కెమెరాలతో అదరగొడుతోంది!
Advertisement

Xiaomi 17T: ప్రీమియం ఫీచర్లను ఇష్టపడే స్మార్ట్‌ఫోన్ ప్రియుల కోసం షావోమి సంస్థ సరికొత్త ‘షావోమి 17T’ ఫోన్‌ను భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. అద్భుతమైన లైకా కెమెరాలు, శక్తివంతమైన ప్రాసెసర్, అలాగే మునుపెన్నడూ లేని విధంగా భారీ బ్యాటరీతో ఈ ఫోన్ విడుదలైంది. ప్రస్తుతం అప్పర్ మిడ్‌రేంజ్ విభాగంలో గట్టి పోటీ ఇవ్వడానికి ఈ సరికొత్త మొబైల్ సిద్ధంగా ఉంది.

లాంచ్ ఆఫర్ రూ.5వేలు:

ఈ ఫోన్ రెండు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. 12Gb RAM+256GB స్టోరేజ్ మోడల్ ధర రూ.59,999 కాగా.. 512GB స్టోరేజ్ మోడల్ ధర రూ.64,999గా ఉంది. అయితే, లాంచ్ ఆఫర్ కింద ఎంపిక చేసిన క్రెడిట్ కార్డులు లేదా ఈఎంఐ ద్వారా కొనుగోలు చేస్తే రూ.5,000 తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది. దీనివల్ల ఫోన్ ప్రారంభ ధర రూ.54,999కే సొంతం చేసుకోవచ్చు. కార్డు లేని వారికి రూ.5,000 ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా ఉంది. వీటికి తోడు ఏడాది లోపు ఫోన్ వెనక్కి ఇస్తే 60 శాతం వరకు డబ్బులు తిరిగిచ్చే అష్యూర్డ్ బైబ్యాక్ డీల్ కూడా లభిస్తుంది.

Advertisement

Also Read: Wi-Fi లేకుండానే వాడేసుకోవచ్చా? శాంసంగ్ సరికొత్త 5G రగ్గడ్ ట్యాబ్ ప్రత్యేకతలివే!

అద్భుతమైన లైకా కెమెరాలు:

ఈ Xiaomi 17T ఫోన్‌కు ప్రధాన ఆకర్షణ దీని కెమెరాలే. వెనుక వైపు మూడు కెమెరాల సెటప్ ఉంది. ఇందులో ఓఐఎస్ సపోర్ట్‌తో కూడిన 50 మెగాపిక్సెల్ లైకా మెయిన్ కెమెరా, 50 మెగాపిక్సెల్ 5x పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్, 12 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి. అలాగే, సెల్ఫీల కోసం ముందు భాగంలో 32 మెగాపిక్సెల్ కెమెరాను అమర్చారు.

మెరుగైన పర్ఫార్మెన్స్:

Advertisement

ఈ ఫోన్‌లో 120Hz రిఫ్రెష్ రేట్‌తో కూడిన 6.59 ఇంచుల అమోలెడ్ డిస్‌ప్లే ఉంది. ఎండలో కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపించేలా 3,500 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్ ఇచ్చారు. కంటికి హాని కలగకుండా ఐ-కేర్ సర్టిఫికేషన్ కూడా ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 8500 ఆల్ట్రా ప్రాసెసర్‌తో నడిచే ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత హైపర్‌ఓఎస్ 3తో పనిచేస్తుంది. అలాగే ఇందులో గూగుల్ జెమిని ఏఐ ఫీచర్లు, సర్కిల్ టు సెర్చ్ వంటి స్మార్ట్ ఆప్షన్లు కూడా ఉన్నాయి.

రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్:

ఛార్జింగ్ త్వరగా అయిపోతుందనే భయం లేకుండా ఇందులో 6,500mAh భారీ సిలికాన్ కార్బన్ బ్యాటరీని అందించారు. దీంతో పాటు 67W ఫాస్ట్ ఛార్జింగ్, వేరే డివైజ్‌లను ఛార్జ్ చేసుకునేందుకు వీలుగా రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. ఫోన్ వేడెక్కకుండా కూలింగ్ సిస్టమ్, నీటిలో పడినా పాడవకుండా ఐపీ68 రేటింగ్ వంటి ఎన్నో ప్రీమియం ఫీచర్లు ఈ ఫోన్ సొంతం. అమెజాన్, షావోమి వెబ్‌సైట్లలో ఇది కొనుగోలుకు అందుబాటులో ఉంది.

Also Read: ఇంత తక్కువ ధరకా? సినిమా హాల్ లాంటి 48W సౌండ్, Google TVతో Blaupunkt QLED TV సంచలనం!

Tags

Related News

బడ్జెట్ ధరలో సోనీ కొత్త హెడ్‌ఫోన్స్ లాంచ్.. బ్లూటూత్ 6.0, ఏఐ కాల్స్ ప్రత్యేకత!

నుదుటిపై ఈ డివైజ్‌ను పెట్టుకుంటే చాలు.. బ్రెయిన్ సీక్రెట్స్ అన్నీ బయటపడతాయట?!

ఏటీఎం కీప్యాడ్ ప్లాస్టిక్‌లో కాకుండా.. మెటల్‌‌ లోనే ఎందుకు? దీని వెనుక ఉన్న సైంటిఫిక్ రీజన్ ఏంటి?

రూ. 349 vs రూ. 379.. Airtel చౌకైన ప్లాన్ల మధ్య పోటీ.. బెనిఫిట్స్ పరంగా విజేత ఎవరంటే?

జియో బంపరాఫర్.. ఈ ప్లాన్లతో అమెజాన్ ప్రైమ్ ఉచితం.. ఇంకా మరెన్నో బెనిఫిట్స్!

మీ ఐఫోన్ స్పీడ్ పెంచే సూపర్ అప్‌డేట్ వచ్చేస్తోంది.. ఈ డేట్ గుర్తుపెట్టుకోండి!

భారీ బ్యాటరీ, వాటర్ ప్రూఫ్ ఫీచర్‌తో Oppo A7 Pro లాంచ్.. ధర ఎంతంటే?

వాట్సప్‌లో చలాన్ మెసేజ్ వచ్చిందా? ఆ లింక్ క్లిక్ చేశారో.. మీ బ్యాంక్ ఖాతా ఖాళీ!

Big Stories

Advertisement
×