E-Paper
Advertisement

ఫోన్ బ్యాటరీ త్వరగా అయిపోవడానికి అసలు కారణాలు ఇవే.. ఈ తప్పులు అస్సలు చేయొద్దు

ఫోన్ బ్యాటరీ త్వరగా అయిపోవడానికి అసలు కారణాలు ఇవే.. ఈ తప్పులు అస్సలు చేయొద్దు
Advertisement

How to increase phone battery life: పొద్దున్నే వంద శాతం ఛార్జింగ్‌తో ఇల్లు దాటితే.. మధ్యాహ్నానికి అది కాస్తా ముప్పై శాతానికి పడిపోతుందా? అర్జెంట్‌గా ఎవరికైనా ఫోన్ చేయాలన్నా, యూట్యూబ్‌లో ఒక వీడియో చూడాలన్నా బ్యాటరీ సిగ్నల్ రెడ్ కలర్‌లోకి వచ్చి భయపెడుతోందా? ప్రస్తుతం చాలా మంది స్మార్ట్‌ ఫోన్ యూజర్లు ఫేస్ చేస్తున్న అతిపెద్ద తలనొప్పి ఇదొక్కటే. అయితే ఫోన్ పాతదైపోవడం వల్లే ఇలా జరుగుతుందని అనుకుంటే పొరపాటే. మనకు తెలియకుండానే ఫోన్ బ్యాటరీని పిండేసే కొన్ని సెట్టింగ్స్, మనం చేసే చిన్న చిన్న తప్పులే దీనికి కారణం. మరి ఆ సమస్యల నుంచి బయటపడి బ్యాటరీ లైఫ్‌ను ఎలా పెంచుకోవాలో ఇప్పుడు చూద్దాం.

బ్యాటరీ బ్యాకప్‌ను రెట్టింపు చేసే అద్భుతమైన టిప్స్:

Advertisement

1. బ్యాక్‌గ్రౌండ్ యాప్స్‌కు బ్రేక్ వేయండి:
మనం ఒక యాప్ వాడేసి హోమ్ స్క్రీన్‌కి వచ్చేస్తాం. కానీ ఆ యాప్ బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అవుతూనే ఉంటుంది. ముఖ్యంగా సోషల్ మీడియా యాప్స్ (ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, వాట్సాప్) మీ ఫోన్ ర్యామ్, బ్యాటరీని నిరంతరం వాడుకుంటూనే ఉంటాయి. ఏం చేయాలి? మీ ఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి ‘Battery’ ఆప్షన్ క్లిక్ చేయండి. అక్కడ ఏ యాప్ ఎక్కువ బ్యాటరీ తీసుకుంటుందో చూసి.. దానికి ‘Background Restriction’ లేదా ‘Optimize’ మోడ్ ఆన్ చేయండి.

2. బ్రైట్‌నెస్ ,డిస్‌ప్లే సెట్టింగ్స్ :
ఫోన్ స్క్రీన్ పెద్దదిగా, కలర్‌ఫుల్‌గా ఉన్నప్పుడు అది ఎక్కువ పవర్ తీసుకుంటుంది. బ్రైట్‌నెస్ ఎప్పుడూ వంద శాతం ఉంచడం వల్ల బ్యాటరీ చాలా వేగంగా కరిగిపోతుంది.

Advertisement

ఆటో బ్రైట్‌నెస్: ‘Auto-Brightness’ ఆప్షన్ ఆన్ చేసి ఉంచండి. ఇది చుట్టుపక్కల ఉన్న వెలుతురును బట్టి స్క్రీన్ లైటింగ్‌ను అడ్జస్ట్ చేస్తుంది.

డార్క్ మోడ్: మీ ఫోన్‌లో అమోలెడ్ స్క్రీన్ ఉంటే వెంటనే ‘Dark Mode’ ఆన్ చేసుకోండి. డార్క్ మోడ్‌లో ఉన్నప్పుడు స్క్రీన్‌పై బ్లాక్ కలర్ ఉండే భాగాల్లో పిక్సెల్స్ ఆఫ్ అవుతాయి. దీని వల్ల బ్యాటరీ దాదాపు 30% వరకు ఆదా అవుతుంది.

3. లొకేషన్, కనెక్టివిటీ ఫీచర్స్ :
చాలామంది ఫోన్లలో జీపీఎస్, బ్లూటూత్, వై-ఫై, హాట్‌స్పాట్ ఎప్పుడూ ఆన్‌లోనే ఉంటాయి. ఇవి ఆన్‌లో ఉన్నప్పుడు ఫోన్ నిరంతరం సిగ్నల్స్ కోసం వెతుకుతూనే ఉంటుంది. దీని వల్ల ప్రొటెక్షన్ చిప్స్ , బ్యాటరీపై భారం పడుతుంది.

పరిహారం: అవసరం లేనప్పుడు లొకేషన్ , బ్లూటూత్‌లను ఆఫ్ చేయండి. అలాగే ‘Auto-Sync’ ఫీచర్‌ని ఆఫ్ చేయడం ద్వారా జీమెయిల్, క్లౌడ్ అకౌంట్లు పదే పదే బ్యాకప్ అవ్వకుండా ఆపొచ్చు.

4. ఈ సమ్మర్‌లో హీటింగ్ సమస్య :
ప్రస్తుతం ఎండలు ఎక్కువగా ఉండటం వల్ల ఫోన్లు త్వరగా వేడెక్కుతున్నాయి. లిథియం-అయాన్ బ్యాటరీలకు వేడి అనేది శత్రువు లాంటిది. ఫోన్ హీట్ ఎక్కినప్పుడు బ్యాటరీ కెపాసిటీ ఆటోమేటిక్‌గా పడిపోతుంది.

జాగ్రత్తలు: ఛార్జింగ్ పెట్టేటప్పుడు ఫోన్ బ్యాక్ కేస్ (కవర్) తీసేయండి. ఎండ తగిలే చోట లేదా కారు డాష్‌బోర్డ్‌పై ఫోన్‌ను ఉంచకండి. గేమ్స్ ఆడుతున్నప్పుడు ఫోన్ వేడెక్కితే కాసేపు పక్కన పెట్టేయండి.

Also Read: స్మార్ట్‌ఫోన్ హ్యాంగింగ్ ప్రాబ్లమ్‌కు శాశ్వత పరిష్కారం.. నిమిషాల్లో ఫోన్ సూపర్ ఫాస్ట్!

5. ఛార్జింగ్ చేసే పద్ధతి మార్చండి :
ఫోన్ బ్యాటరీ 0% అయ్యే వరకు వాడటం, ఆపై 100% వరకు రాత్రంతా ఛార్జింగ్ పెట్టడం చాలా తప్పు. ఇది బ్యాటరీ లైఫ్ సైకిల్‌ను దెబ్బతీస్తుంది.

గోల్డెన్ రూల్: మీ ఫోన్ ఛార్జింగ్‌ను ఎప్పుడూ 20% నుంచి 80% మధ్య ఉంచడానికి ప్రయత్నించండి. వారానికి లేదా నెలకు ఒక్కసారి మాత్రమే 100% ఛార్జ్ చేయండి. అలాగే ఎప్పుడూ లోకల్ ఛార్జర్లు కాకుండా.. కంపెనీ ఇచ్చిన ఒరిజినల్ ఛార్జర్ మాత్రమే వాడండి.

స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ అనేది మనం వాడే విధానంపైనే ఆధారపడి ఉంటుంది. పైన చెప్పుకున్న బ్యాక్‌గ్రౌండ్ యాప్స్ కంట్రోల్, డార్క్ మోడ్ వాడకం, సరైన ఛార్జింగ్ పద్ధతులను పాటిస్తే మీ ఫోన్ బ్యాటరీ బ్యాకప్ ఖచ్చితంగా పెరుగుతుంది. ఇవన్నీ చేసినా కూడా బ్యాటరీ నిలవడం లేదంటే.. మీ బ్యాటరీ హెల్త్ పాడైపోయి ఉండవచ్చు. అలాంటప్పుడు ఒకసారి అఫీషియల్ సర్వీస్ సెంటర్‌కు వెళ్లి బ్యాటరీ మార్పించుకోవడం మంచిది.

Related News

వివో మాస్టర్ ప్లాన్ అదిరింది.. మూడు 200 మెగాపిక్సల్ కెమెరాలతో Vivo X500 Ultra ఎంట్రీ!

ఐఫోన్, శాంసంగ్‌లకు దెబ్బ మీద దెబ్బ.. హువావే నుంచి మరో మైండ్ బ్లోయింగ్ ఫోన్, డిజైన్ లీక్!

సిమ్ కార్డుకు ఒక వైపు ఎందుకు కట్ చేసి ఉంటుందో తెలుసా? దీని వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే!

అమెజాన్‌లో దుమ్ములేపుతున్న..రెడ్‌మీ లేటెస్ట్ స్మార్ట్‌వాచ్!

వార్నీ.. ఇన్నాళ్లూ స్మార్ట్‌ఫోన్ పవర్ బటన్‌ను వేస్ట్‌గా వాడామా? ఇందులో ఇంత మ్యాజిక్ ఉందా!

బడ్జెట్ ధరలో ప్రీమియం లుక్.. సూపర్ ఏఐ ఫీచర్స్ రియల్‌మీ లేటెస్ట్ స్మార్ట్‌వాచ్

జియో క్యూ1 రిజల్ట్స్.. భారీగా పెరిగిన లాభాలు.. రికార్డు స్థాయిలో కస్టమర్లు!

బిగ్ బ్యాటరీ, క్రేజీ AI ఫీచర్లతో రంగంలోకి దిగనున్న iQOO Z11 Lite 5G.. రేటు కూడా బడ్జెట్‌లోనే!

Big Stories

Advertisement
×