E-Paper
Advertisement

బాబోయ్.. బ్రా ధర రూ. 474 కోట్లా? ఇంతకీ అంత ఖరీదు ఎందుకు బ్రో?

బాబోయ్.. బ్రా ధర రూ. 474 కోట్లా? ఇంతకీ అంత ఖరీదు ఎందుకు బ్రో?
Advertisement

Kylie Jenner Fantasy Bra: ఫ్యాషన్ ప్రపంచంలో ఖరీదైన దుస్తులు, అరుదైన ఆభరణాలు ఎప్పుడూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటాయి. తాజాగా అమెరికాకు చెందిన ప్రముఖ మీడియా పర్సనాలిటీ, వ్యాపారవేత్త కైలీ జెన్నర్ ధరించిన ఓ బ్రా ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఏకంగా రూ.474 కోట్ల విలువైన ఫాంటసీ బ్రాతో ఆమె ర్యాంప్‌ పై నడిచి ఫ్యాషన్ రంగంలో టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచింది. విలువైన వజ్రాలు, ప్రత్యేకమైన డిజైన్‌తో రూపొందించిన ఈ బ్రా వెనుక ఎన్నో గంటల శ్రమ దాగి ఉంది.

రూ.474 కోట్ల విలువ.. ఎందుకంత ప్రత్యేకం?

కైలీ జెన్నర్ ధరించిన ఈ ఫాంటసీ బ్రా విలువ 50 మిలియన్ డాలర్లు. భారతీయ కరెన్సీలో ఇది సుమారు రూ.474 కోట్లకు సమానం. సాధారణంగా ఫ్యాషన్ దుస్తులు వాటి డిజైన్, బ్రాండ్‌ను బట్టి ప్రత్యేకతను సంతరించుకుంటాయి. కానీ, ఈ బ్రా మాత్రం అందులో ఉపయోగించిన వజ్రాలు, వాటిని అమర్చిన తీరు, తయారీకి పట్టిన సమయం కారణంగా ప్రత్యేకంగా నిలుస్తోంది. విక్టోరియాస్ సీక్రెట్ ఫ్యాషన్ షోలో ఇలాంటి విలువైన ఆభరణాలతో రూపొందించిన దుస్తులు ప్రదర్శించడం ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది.

ఒక్క బ్రాలో వేలాది వజ్రాలు!

Advertisement

ఈ ఫాంటసీ బ్రాను ప్రముఖ ఆభరణాల రూపకర్త జాకబ్ అరబో రూపొందించినట్లు తెలుస్తోంది. ఇందులో 75.54 క్యారెట్ల రేడియంట్ కట్ పసుపు రంగు వజ్రాన్ని ప్రధాన ఆకర్షణగా అమర్చారు. దాని చుట్టూ మరో 4,410 సహజ వజ్రాలను పొదిగారు. పసుపు వజ్రం ప్రత్యేకమైన మెరుపును అందిస్తే, దాని చుట్టూ అమర్చిన చిన్న వజ్రాలు మొత్తం డిజైన్‌కు మరింత అందాన్ని తీసుకొచ్చాయి. ఇంత పెద్ద సంఖ్యలో వజ్రాలను ఒకే డిజైన్‌లో అమర్చడం సాధారణమైన పని కాదు. ప్రతి వజ్రాన్ని జాగ్రత్తగా అమర్చడం, వాటి మెరుపు సమతుల్యంగా కనిపించేలా చూడటం నైపుణ్యంతో కూడుకున్న పని.

15 మంది కళాకారులు.. 1,000 గంటల శ్రమ..

ఈ బ్రా తయారీ వెనుక 15 మంది కళాకారులు కృషి ఉంది. మొత్తం డిజైన్‌ను పూర్తి చేయడానికి సుమారు 1,000 గంటల సమయం పట్టింది. అంటే.. రోజుల తరబడి ఎంతో శ్రద్ధతో పని చేసి దీనిని రూపొందించారు. ఈ బ్రా బరువు సుమారు 1.8 కిలోలు. ఇన్ని వజ్రాలు పొదిగిన డిజైన్‌ను ధరించి ర్యాంప్‌పై నడవడం కూడా ప్రత్యేకమైన ఎక్స్ పీరియెన్స్ గా చెప్పుకోవచ్చు. అందం మాత్రమే కాకుండా, ఆభరణాలను ప్రదర్శించే విధానం కూడా అందరినీ ఆకట్టుకుంటుంది.

ఫ్యాషన్ ప్రపంచంలో ఖరీదైన ప్రదర్శన..

Advertisement

కైలీ జెన్నర్ తన బిజినెస్ కార్యకలాపాలు, ఫ్యాషన్ ఎంపికలతో తరచుగా వార్తల్లో నిలుస్తుంటారు. ఈసారి రూ.474 కోట్ల విలువైన ఫాంటసీ బ్రా వార్తల్లోకి రావడంతో మరోసారి చర్చ మొదలైంది. వేలాది సహజ వజ్రాలు, వందల గంటల శ్రమ, కోట్ల రూపాయల విలువ.. ఫ్యాషన్ ప్రపంచంలో అరుదైన ప్రదర్శనగా నిలిచింది.

Read Also: దసరా, దీపావళి ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఫారిన్ లో టాప్ టూరిస్ట్ ప్లేసెస్ ఇవే!

 

Tags

Related News

రైల్లోనే ఫైవ్‌స్టార్ హోటల్ ఎక్స్ పీరియెన్స్.. ‘ప్యాలెస్ ఆన్ వీల్స్’ బాత్రూమ్ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

దసరా, దీపావళి ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఫారిన్ లో టాప్ టూరిస్ట్ ప్లేసెస్ ఇవే!

రైళ్లలో పెద్ద సౌండ్ పెట్టి ఫోన్ వాడుతున్నారా? అయితే, ఇక షాక్ తప్పదు!

ఇండియన్ టూరిస్టులపై స్విట్జర్లాండ్ స్పెషల్ ఫోకస్.. ఏకంగా జెమీమాతో ప్రమోషన్స్!

విమానంలో బిడ్డ పుడితే ఏ దేశ పౌరసత్వం వస్తుంది? రూల్స్ ఏం చెప్తున్నాయంటే?

చలికాలానికి ముందే మంచు అందాలను చూడాలనుందా? దేశంలో 7 అదిరిపోయే ప్లేసెస్ ఇవే!

ప్రయాణికుడి చెవిలో ఇరుక్కుపోయిన ఇయర్‌ బడ్.. రైల్వే సిబ్బంది చేసిన పనికి ప్రశంసలు!

Big Stories

Advertisement
×