E-Paper
Advertisement

జిమెయిల్ స్టోరేజ్ ఫుల్ అయిందా? పైసా ఖర్చు లేకుండా.. ఒక్క క్లిక్‌తో క్లీన్ చేసుకోండి!

జిమెయిల్ స్టోరేజ్ ఫుల్ అయిందా? పైసా ఖర్చు లేకుండా.. ఒక్క క్లిక్‌తో క్లీన్ చేసుకోండి!
Advertisement

Google Storage: ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్ వాడుతున్న ప్రతి ఒక్కరికీ గూగుల్ అకౌంట్ సర్వసాధారణంగా అయిపోయింది. అయితే గూగుల్ మనకు ఫ్రీగా ఇచ్చేది కేవలం 15 GB స్టోరేజ్ మాత్రమే. ఇందులో జిమెయిల్ (Gmail), గూగుల్ డ్రైవ్ (Google Drive), గూగుల్ ఫొటోస్ (Google Photos) అన్నీ కలిసి ఉంటాయి. కొద్దిరోజుల వాడకం తర్వాత ‘స్టోరేజ్ ఫుల్’ అనే నోటిఫికేషన్ రావడం, కొత్త ఈమెయిల్స్ ఆగిపోవడం వంటి ఇబ్బందులు చాలా మంది ఫేస్ చేసే ఉంటారు. అయితే డబ్బులు పెట్టి అనదంగా స్టోరేజ్ కొనే అవసరం లేకుండా కొన్ని నిమిషాల్లోనే గూగుల్ డ్రైవ్ స్టోరేజ్‌ను ఎలా ఖాళీ చేయాలో ఈ కథనంలో చూద్దాం.

భారీ ఈమెయిల్స్‌ డిలీట్

జిమెయిల్‌లో ఎప్పుడో ఐదేళ్ల క్రితం వచ్చిన పనికిరాని మెయిల్స్, పెద్ద పెద్ద ఫైల్స్ అలాగే స్టోరై పోతుంటాయి. వీటిని ఒక్క క్లిక్‌తో వెతికి డిలీట్ చేయవచ్చు. ఇందుకోసం జిమెయిల్ సెర్చ్ బార్‌లో ‘has:attachment larger:10M’ అని టైప్ చేసి సెర్చ్ చేయండి. దీంతో 10 MB కంటే ఎక్కువ సైజ్ ఉన్న మెయిల్స్ అన్నీ స్క్రీన్ మీద కనిపిస్తాయి. (10 స్థానంలో 5 లేదా 20 MB కూడా పెట్టుకోవచ్చు). వాటిలో మీకు అవసరం లేని వాటిని సెలెక్ట్ చేసి డిలీట్ చేయండి.

‘ట్రాష్’ ఫోల్డర్‌ ఖాళీ

Advertisement

మెయిల్స్ లేదా ఫైల్స్ డిలీట్ చేసినప్పుడు అవి పూర్తిగా డిలీట్ కావు. ‘ట్రాష్’ లేదా ‘బిన్’ ఫోల్డర్‌లోకి వెళ్తాయి. అక్కడ అవి 30 రోజుల పాటు అలాగే ఉండి స్పేస్‌ను ఆక్రమిస్తాయి. కాబట్టి జిమెయిల్, గూగుల్ డ్రైవ్ రెండింటిలోనూ ‘ట్రాష్’ ఫోల్డర్‌లోకి వెళ్లండి. అక్కడ ‘Empty Trash Now’ పై క్లిక్ చేస్తే.. అసలైన స్పేస్ లభిస్తుంది.

పెద్ద ఫైల్స్ చెకింగ్..

గూగుల్ డ్రైవ్‌లో సేవ్ చేసిన పీడీఎఫ్‌లు, వీడియోలు చాలా స్థలాన్ని ఆక్రమిస్తాయి. వాటిని సైజ్ వారీగా ఈజీగా డిలీట్ చేయవచ్చు. ఇందుకోసం గూగుల్ డ్రైవ్ ఓపెన్ చేసి ఎడమవైపు ఉండే Storage ఆప్షన్ మీద క్లిక్ చేయండి. అప్పుడు డ్రైవ్‌లో ఉన్న ఫైల్స్‌ను అత్యధిక సైజ్ నుండి అత్యల్ప సైజ్ క్రమంలో చూపిస్తుంది. పనికిరాని పెద్ద ఫైల్స్, పాత వీడియోలను డిలీట్ చేయడం ద్వారా స్టోరేజ్ ను పెంచుకోవచ్చు.

స్పామ్, ప్రమోషన్స్ మెయిల్స్ క్లీనింగ్

Advertisement

కంపెనీల నుండి వచ్చే అడ్వర్టైజ్‌మెంట్లు, ఆఫర్ల మెయిల్స్ (Promotions), అలాగే స్పామ్ మెయిల్స్ వేలల్లో పేరుకుపోతుంటాయి. వీటిని తొలగించేందుకు జిమెయిల్‌లో ‘స్పామ్’ ‘ప్రొమోషనల్’ ట్యాబ్స్‌లోకి వెళ్లండి. అన్నింటినీ ఒకేసారి సెలెక్ట్ చేసి ‘డిలీట్ ఆల్’ నొక్కండి. భవిష్యత్తులో ఇలాంటి మెయిల్స్ రాకుండా ఉండటానికి అవసరం లేని వెబ్‌సైట్ మెయిల్స్ కింద ఉండే ‘అన్ సబ్ స్క్రైబ్’ బటన్‌ను క్లిక్ చేయండి.

Also Read: అమెరికాలోకి 3.2 కోట్ల దోమలను వదిలిపెట్టనున్న గూగుల్.. ఇదెక్కడి ప్లాన్ మామ?

గూగుల్ ఫొటోస్ క్లీనప్

మనం ఫోన్‌లో తీసే ఫొటోలు, వాట్సాప్ వీడియోలు ఆటోమేటిక్‌గా గూగుల్ ఫొటోస్‌లోకి బ్యాకప్ అయిపోతుంటాయి. దీనివల్ల స్టోరేజ్ త్వరగా నిండిపోయే ఛాన్స్ ఉంది. కాబట్టి గూగుల్ ఫొటోస్ యాప్‌లోకి వెళ్లి బ్లర్ అయిన ఫొటోలు, స్క్రీన్‌షాట్లు, ఒకేలా ఉన్న డూప్లికేట్ ఫొటోలను డిలీట్ చేయండి. ‘గూగుల్ వన్’ యాప్ లేదా వెబ్‌సైట్‌లోకి వెళ్లి ‘స్టోరేజ్ క్లీనర్’ టూల్ ఉపయోగించడం ద్వారా వాట్సాప్ నుండి బ్యాకప్ అయిన భారీ వీడియోలను సులభంగా గుర్తించి తీసేయవచ్చు. నెలకు ఒక్కసారి అయినా ఈ చిన్న క్లీనప్ ప్రాసెస్ చేయడం అలవాటు చేసుకుంటే జీ మెయిల్ స్టోరేజ్ ఎప్పటికీ ఫుల్ అవ్వదని నిపుణులు పేర్కొంటున్నారు.

Also Read: టీవీ రిమోట్లో కలర్ బటన్స్ ఎందుకు ఉంటాయో తెలుసా? వాటి బెనిఫిట్స్ తెలిస్తే షాకే!

Related News

వివో మాస్టర్ ప్లాన్ అదిరింది.. మూడు 200 మెగాపిక్సల్ కెమెరాలతో Vivo X500 Ultra ఎంట్రీ!

ఐఫోన్, శాంసంగ్‌లకు దెబ్బ మీద దెబ్బ.. హువావే నుంచి మరో మైండ్ బ్లోయింగ్ ఫోన్, డిజైన్ లీక్!

సిమ్ కార్డుకు ఒక వైపు ఎందుకు కట్ చేసి ఉంటుందో తెలుసా? దీని వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే!

అమెజాన్‌లో దుమ్ములేపుతున్న..రెడ్‌మీ లేటెస్ట్ స్మార్ట్‌వాచ్!

వార్నీ.. ఇన్నాళ్లూ స్మార్ట్‌ఫోన్ పవర్ బటన్‌ను వేస్ట్‌గా వాడామా? ఇందులో ఇంత మ్యాజిక్ ఉందా!

బడ్జెట్ ధరలో ప్రీమియం లుక్.. సూపర్ ఏఐ ఫీచర్స్ రియల్‌మీ లేటెస్ట్ స్మార్ట్‌వాచ్

జియో క్యూ1 రిజల్ట్స్.. భారీగా పెరిగిన లాభాలు.. రికార్డు స్థాయిలో కస్టమర్లు!

బిగ్ బ్యాటరీ, క్రేజీ AI ఫీచర్లతో రంగంలోకి దిగనున్న iQOO Z11 Lite 5G.. రేటు కూడా బడ్జెట్‌లోనే!

Big Stories

Advertisement
×