Tanveer Ahmed: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ (Indian Premier League 2026 Tournament) ఛాంపియన్ గా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నిలిచింది. నిన్న అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం (Narendra Modi Stadium, Ahmedabad) వేదికగా గుజరాత్ టైటాన్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ( Royal Challengers Bengaluru vs Gujarat Titans, Final ) మధ్య ఫైనల్స్ జరిగింది. ఇందులో అద్భుతంగా రాణించిన బెంగుళూరు, ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. చివరి వరకు పోరాడిన విరాట్ కోహ్లీ, 75 పరుగులతో రాణించాడు. అంతేకాదు చివరలో సిక్సర్ కొట్టి మ్యాచ్ గెలిపించాడు. దీంతో సోషల్ మీడియాలో విరాట్ కోహ్లీని జనాలందరూ మెచ్చుకుంటూ ఉంటే.. పాకిస్తాన్ మాజీ క్రికెటర్ తన్వీర్ అహ్మద్ ( Tanveer Ahmed) మాత్రం దారుణంగా ట్రోలింగ్ చేశాడు. విరాట్ కోహ్లీ (Virat Kohli) కోసం బౌండరీ గేటు చిన్నగా చేశారని.. అందుకే ఇలా భయంకరంగా బ్యాటింగ్ చేసినట్లు వెల్లడించారు.
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ( Royal Challengers Bengaluru ) రెండోసారి ఛాంపియన్ అయిన నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ తన్వీర్ అహ్మద్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. విరాట్ కోహ్లీ సాధించింది ఏమీలేదని.. అతని కోసం బౌండరీ గేట్ నిన్న చిన్నగా చేసినట్లు బాంబు పేల్చారు. 30 మీటర్ల బౌండరీ గేట్ అతని కోసం మాత్రమే సెట్ చేసినట్లు ఆరోపణలు చేశారు. ఇన్నింగ్స్ బ్రేక్ తర్వాత విరాట్ కోహ్లీ డబ్బులు ఇచ్చి మరి, గుజరాత్ క్రికెటర్లను (GT) కొనుగోలు చేసినట్లు షాకింగ్ కామెంట్స్ చేశారు. అలాగే 60 మీటర్ల వరకు ఉన్న నరేంద్ర మోడీ స్టేడియం బౌండరీ గేటను, 30 మీటర్లకు కుదించి స్కెచ్ వేసినట్లు బాంబు పేల్చారు.
భయంకరమైన బెంగుళూరు హిట్టర్స్ రాణించకపోయినా, విరాట్ కోహ్లీ మాత్రమే అద్భుతంగా ఆడడం వెనుక కుట్ర కోణం దాగి ఉందని కూడా ఆరోపణలు చేశారు. 30 మీటర్లకు బౌండరీ గేటు కుదించిన నేపథ్యంలోనే ఆమాత్రం కోహ్లీ బ్యాటింగ్ చేయగలిగాడని పరువు తీశారు. లేకపోతే గుజరాత్ టైటాన్స్ విజయం సాధించేదని కుండ బద్దలు కొట్టి చెప్పారు. ఈ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా కూడా ఫిక్సింగ్ జరిగిందని… మొదటినుంచి తాము చెబుతున్నట్లు వెల్లడించారు. బెంగళూరు ( RCB) వరుసగా టైటిల్ గెలవడంతో ఫిక్సింగ్ ( Match Fixing) జరిగినట్లు తేలిపోయిందని వెల్లడించారు. దీంతో తన్వీర్ అహ్మద్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఇది ఇలా ఉండగా తన్వీర్ అహ్మద్ చేసిన వ్యాఖ్యలకు ఇండియన్ క్రికెట్ అభిమానులు కూడా కౌంటర్ ఇస్తున్నారు. పాకిస్తాన్ వెధవలకు ప్రతిదీ, ఫిక్సింగ్ గానే కనిపిస్తుందని.. ఫైర్ అవుతున్నారు. మ్యాచ్ ఫిక్సింగ్ లో పుట్టి పెరిగిన వాళ్లకు… అన్ని అలాగే కనిపిస్తాయని చురకలు అంటిస్తున్నారు.