E-Paper
Advertisement

డీఎస్సీపై వైసీపీ విమర్శలు.. సీఎం చంద్రబాబు స్ట్రాంగ్ కౌంటర్, చామవరంలో ‘పేదల సేవలో’ కార్యక్రమం

డీఎస్సీపై వైసీపీ విమర్శలు.. సీఎం చంద్రబాబు స్ట్రాంగ్ కౌంటర్, చామవరంలో ‘పేదల సేవలో’ కార్యక్రమం
Advertisement

CM Chandrababu: వైసీపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు సీఎం చంద్రబాబు. కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డీఎస్సీపై ఆ పార్టీ ఓర్వలేకపోతోందని ఆరోపించారు. తాము చేస్తున్న అభివృద్ధి చూడలేక ఆ పార్టీకి ఫ్రస్ట్రేషన్‌ పెరిగిపోతోందన్నారు. ఈ క్రమంలో విద్వేషాలు సృష్టించేందుకు కుట్ర పన్నుతోందని విరుచుకుపడ్డారు. ఆ పార్టీ చేస్తున్న అసత్య ప్రచారాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.

డీఎస్సీపై వైసీపీ విమర్శలు.. సీఎం చంద్రబాబు స్ట్రాంగ్ కౌంటర్

Advertisement

సోమవారం తుని నియోజకవర్గంలోని చామవరంలో ‘పేదల సేవలో’ కార్యక్రమంలో పాల్గొన్నారు సీఎం చంద్రబాబు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడిన ఆయన, డీఎస్సీపై వైసీపీ నాటకాలను బయటపెట్టారు. ఐదేళ్లు వైసీపీ పాలనలో ఒక్క టీచర్ ఉద్యోగం ఇవ్వలేదన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తొలి సంతకం మెగా డీఎస్సీపై పెట్టామన్నారు.

తాము అధికారంలోకి వస్తే పిల్లలకు నాణ్యమైన చదువు ఇస్తామని హామీ ఇచ్చామని, చెప్పిన దాని ప్రకారం చేస్తున్నట్లు తెలిపారు. డీఎస్సీ నిర్వహించకుండా ప్రభుత్వంపై 241 కేసులు వేశారని, న్యాయస్థానాలకు వెళ్లామని బలంగా వాదనలు వినిపించామన్నారు. కేవలం 148 రోజుల్లో టీచర్ ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు. ఎవరూ మానిప్లేట్ చేయని విధంగా పరీక్ష నిర్వహించామన్నారు.

Advertisement

తుని నియోజకవర్గం చామవరంలో ‘పేదల సేవలో’ కార్యక్రమం

పరీక్షను బ్రహ్మాండంగా నిర్వహిస్తే.. ప్రస్టేషన్‌లో ఉన్న వైసీపీ దీనిపై అనుమానాలు క్రియేట్ చేసిందన్నారు. రాజకీయంగా లబ్ది పొందాలని ఆ పార్టీ భావించిందని, అధికారులు క్లారిటీ ఇచ్చారని గుర్తు చేశారు. సెంటిమెంట్ క్రియేట్ చేసి పదే పదే చెప్పి ప్రజలను నమ్మించి హింసను క్రియేట్ చేయాలని చూస్తోందన్నారు. తనకు ఇంత సమయం పట్టిందని, తాను అజాగ్రత్తగా ఉంటే ఏమయ్యేదో మీరే ఆలోచించాలన్నారు.

నంద్యాలలో వైఎస్‌ విగ్రహంపై దాడి చేసి మాపై నెట్టాలని చూశారని, చివరకు వైసీపీ వాళ్లు చేసినట్లు తేలిందన్నారు. విగ్రహం ధ్వంసం చేశారని అబద్ధాలు చెప్పి సానుభూతి కోసం ప్రయత్నించారని ఈ సందర్బంగా వివరించారు. దుర్మార్గాలపై యుద్ధం చేస్తూనే, ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు.

ALSO READ: మంత్రి లోకేష్‌తో ఎయిర్‌ట్రంక్ సీఈఓ రాబిన్ భేటీ, ఆపై ఫ్యూచర్ క్యాంపస్ వ్యవహారం 

మొదటి తారీకు వచ్చిందంటే ప్రజలకు ఏం చేయాలని ఆలోచిస్తానని చెప్పారు. తుని నియోజకవర్గం ఒకప్పుడు టీడీపీకి కంచుకోటని, ఆనాడు యనమల రామకృష్ణ ప్రాతినిధ్యం వహించారని అన్నారు. రాబోయే రోజుల్లో తుని నియోజకవర్గం ఎన్డీయేకి కంచుకోటగా మారుతుందన్నారు. గతంలో ఏ నెలకు ఆ నెల పింఛను తీసుకోకుంటే రద్దు చేసేవారని గుర్తు చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా ఒక్కో కుటుంబానికి మూడు నుంచి నాలుగు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని వివరించారు. గ్యాస్‌ ధరలు పెరిగినా మహిళలకు ఉచితంగా మూడు సిలిండర్లు ఇస్తున్నామని, నేరుగా పేదవాడి ఇంటికొచ్చి పింఛను ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. రాష్ట్రానికి పరిశ్రమలు వస్తే ఉద్యోగాల కోసం మనవాళ్లు ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదని, యువత నైపుణ్యాలు పెంచుకొని ఉద్యోగాలు అందిపుచ్చుకోవాలన్నారు.

Related News

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

ఓడిపోతామనే భయం.. కుట్రలకు తెరలేపారు, వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్

ప్రయాణికుల ఇంటికి ఆర్టీసీ సేవలు.. ఏపీఎస్ఆర్టీసీ వినూత్నంగా

వెలిగొండ ప్రాజెక్టు వాగులో కొట్టుకుపోయిన బొలెరో, అందులో నలుగురు వ్యక్తులు, రంగంలోకి రెస్క్యూ టీమ్

ఎవరీ పూల సుబ్బయ్య? వెలిగొండ ప్రాజెక్టుకు ఆయన పేరు ఎందుకు పెట్టారు?

వెలిగొండకు వైఎస్సార్ వెలుగైతే.. చంద్రబాబు చీకటి.. షర్మిల ఘాటు వ్యాఖ్యలు

గోదావరి నీళ్లు నల్లమల సాగర్‌కు రావాలి.. మాట ఇచ్చాను, ప్రాజెక్టు పూర్తి చేశాం-సీఎం చంద్రబాబు

Big Stories

Advertisement
×