E-Paper
Advertisement

ఒక్కటే బిల్డింగ్.. ఊరంతా అందులోనే, ఇక్కడి ప్రజలకు బాహ్య ప్రపంచమే తెలియదట!

ఒక్కటే బిల్డింగ్.. ఊరంతా అందులోనే, ఇక్కడి ప్రజలకు బాహ్య ప్రపంచమే తెలియదట!
Advertisement

Whittier Town: పక్కింటి వాడిని కలవాలంటే బైక్ తీయాలి. కిరాణా సామాన్ల కోసం కిలోమీటర్ దూరం వెళ్లాలి. పిల్లల్ని స్కూల్లో దింపడానికి ట్రాఫిక్‌తో యుద్ధం చేయాలి.. ఇదీ కదా మన రోజువారీ రొటీన్! కానీ, ఒక్కసారి ఊహించండి.. మీ బెడ్‌రూమ్ నుంచి బయలుదేరి లిఫ్ట్ ఎక్కితే స్కూల్, ఇంకో ఫ్లోర్ నొక్కితే పోలీస్ స్టేషన్, గ్రౌండ్ ఫ్లోర్‌కి వెళ్తే మార్కెట్, చర్చి అన్నీ ఒకే చోట ఉంటే? ‘ఇదేదో సైన్స్ ఫిక్షన్ సినిమా లా ఉందే’ అనుకోకండి. అమెరికాలోని అలాస్కాలో ఉన్న ‘విట్టియర్’ (Whittier) అనే ఊరి ప్రజల రియల్ లైఫ్ స్టోరీ ఇది!

ఆ బిల్డింగ్ కథేంటి?

Advertisement

ఈ ఊరి మొత్తం జనాభా సుమారు 300 మంది. వీళ్లంతా బయట వేర్వేరు ఇళ్లలో కాకుండా, ‘బెగిచ్ టవర్స్’ (Begich Towers) అనే ఒకే ఒక్క 14 అంతస్తుల బిల్డింగ్‌లో నివసిస్తారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో మిలిటరీ బ్యారెక్స్‌గా కట్టిన ఈ బిల్డింగ్, ఇప్పుడు ఒక నిలువు వరుస (Vertical) విలేజ్‌గా మారిపోయింది. బయట మంచు తుఫానులు, గడ్డకట్టే చలి దంచికొడుతున్నా, వీళ్లు హాయిగా బిల్డింగ్ లోపల షార్ట్స్, టీషర్టులు వేసుకుని తిరిగేస్తుంటారు.

లిఫ్ట్ ఎక్కితే స్కూల్.. అండర్‌గ్రౌండ్ దాటితే కాలేజ్!

Advertisement

మరి పిల్లలు స్కూల్‌కి ఎలా వెళ్తారు? చాలా సింపుల్! ఈ బిల్డింగ్ బేస్‌మెంట్ నుండి పక్కనే ఉన్న స్కూల్‌కి ఒక అండర్‌గ్రౌండ్ టన్నెల్ (సురంగ మార్గం) ఉంటుంది. ఎంత దారుణమైన మంచు కురుస్తున్నా, పిల్లలు జాకెట్లు కూడా వేసుకోకుండా హాయిగా ఆ టన్నెల్ గుండా నడుచుకుంటూ స్కూల్‌కి వెళ్ళిపోతారు. ఇక ఈ టవర్ లోపలే ఒక చిన్న క్లినిక్, పోలీస్ స్టేషన్, కిరాణా షాప్, లాండ్రీ, ఒక చర్చి, పోస్ట్ ఆఫీస్… ఇలా మనిషి బతకడానికి కావలసినవన్నీ ఉన్నాయి.

నో ట్రాఫిక్.. నో లేట్!

ఇక్కడ ట్రాఫిక్ జామ్‌లు, సిగ్నల్స్ అనే ముచ్చటే లేదు. ఆఫీస్‌కో, షాప్‌కో లేట్ అయిందనే సాకు చెప్పడానికి అస్సలు కుదరదు. ఎందుకంటే, ఎంత దూరం వెళ్లాలన్నా కేవలం రెండు నిమిషాల లిఫ్ట్ ప్రయాణమే! పైగా ఊరంతా ఒకే బిల్డింగ్‌లో ఉండటం వల్ల అందరూ ఒకే పెద్ద జాయింట్ ఫ్యామిలీలా బతికేస్తుంటారు.

బయటి ప్రపంచానికి ఇది వింతగా అనిపించినా, అలాస్కాలోని ఆ గడ్డకట్టే చలిని తట్టుకుని బతకడానికి వీళ్లు కనిపెట్టిన సూపర్ ఐడియా ఇది. నిజంగా… ‘ఇల్లు దాటకుండానే ఊరంతా తిరిగేయడం’ అంటే ఇదేనేమో కదూ!

Also Read: ఏంట్రా బాబూ ఈ వింత? చెట్లకు వేలాడే బొమ్మల వెనుక ఇంత పెద్ద కథ ఉందా?

Related News

అమరావతిలో మినీ అమెజాన్.. ఐదు ఎకరాల్లో అద్భుత వర్షారణ్యం!

మహాభారత ఆనవాళ్లు.. బౌద్ధ మహాస్తూపం.. రామదాసు జన్మస్థలం.. ఈ ఊరి కథ తెలిస్తే ఆశ్చర్యపోతారు!

ఎలాన్ మస్క్ ఫ్లయింగ్ ప్యాలెస్.. ఈ జెట్‌లోని ఫీచర్లు తెలిస్తే పరేషాన్ కావాల్సిందే!

విదేశాల్లో పెళ్లిళ్లు వద్దంటూ పిలుపునిచ్చిన మోదీ.. ఇండియాలో సెలెబ్రిటీ వెడ్డింగ్ డెస్టినేషన్స్ ఇవే

అమరావతి ఓవైపు.. ఫ్యూచర్ సిటీ మరోవైపు.. దక్షిణ భారత ముఖచిత్రాన్ని మార్చబోతున్న రెండు మెగా నగరాలు!

రాత్రి 9 తర్వాత నో ఎంట్రీకి చెక్.. శ్రీశైలానికి 24/7 రూట్ క్లియర్!

కారు, మెట్రో కాదు.. ఇంటికి వెళ్లాలంటే నదిలో దూకాల్సిందే!

నేపాల్ వరదల్లో నమ్మశక్యం కాని ఘటనలు.. ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచిన 6 అద్భుతాలు..!

Big Stories

Advertisement
×