E-Paper
Advertisement

WiFi Speed: మీ వైఫై సిగ్నల్ స్లోగా ఉందా?.. ఇంటర్నెట్ స్పీడ్ పెంచే చిట్కాలివే

WiFi Speed: మీ వైఫై సిగ్నల్ స్లోగా ఉందా?.. ఇంటర్నెట్ స్పీడ్ పెంచే చిట్కాలివే
Advertisement

WiFi Speed: ప్రస్తుతం ప్రతి ఇంట్లో వైఫై కనిపిస్తుంది. ఉద్యోగం, వ్యాపారం.. ఇలా అవసరం ఏదైనా ఇంటర్నెట్ వినియోగం బాగా పెరిగింది. అయితే వైఫై కస్టమర్లు అప్పుడప్పుడు ఇంటర్నెట్ స్పీడ్ సమస్యలు ఎదుర్కొంటారు. అయితే ఇంటర్నెట్ స్పీడ్ పెంచుకునేందుకు కొన్ని చిట్కాలున్నాయి. వైఫై రూటర్ ను సరైన ప్లేస్ లో పెట్టాలి. ఎక్కడ పెడితే హైస్పీడ్ తో ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉంటుందో ముందుగా చెక్ చేయాలి. రూటర్ అనేది యాంటినాలా పనిచేస్తుంది. దీన్ని అన్ని వైపులా కవర్ చేసేలా ఇంటి మధ్యలో పెట్టాలి. రూటర్ ను తక్కువ ఎత్తులో పెడితే సిగ్నల్స్ అందకపోవచ్చు. అందుకే ఎత్తైన చోట్లలో రూటర్ పెడితే ఇంటర్నెట్ స్పీడ్ ఎక్కువగా ఉంటుంది.

గోడలకు రూటర్ ఫిక్స్ చేయొద్దు

విద్యుత్ పరికరాలు ఎక్కువగా ఉన్న చోట రూటర్ పెడితే అవి ఇంటర్నెట్ స్పీడ్ ను తగ్గించేస్తాయి. అందుకే వాటికి దూరంగా ఉండాలి. గోడకు రూటర్ బిగించవద్దు. గోడలు వైర్ లెస్ సిగ్నల్స్ ను గ్రహించి ఇంటర్నెట్ స్పీడ్ ను తగ్గిస్తాయి. రూటర్ ఓపెన్ స్పేస్ లో ఉండేలా చూసుకోవాలి. ఇంట్లో కొన్ని చోట్ల ఎక్కువ సిగ్నల్స్ ఉంటాయి. మరికొన్ని చోట్ల అస్సలు ఉండవు. రూటర్ ను వివిధ ప్లేస్ లలో పెట్టి సిగ్నల్స్ టెస్ట్ చేయాలి.

ఎక్కువ డివైజ్ లకు కనెక్ట్ వద్దు

Advertisement

రూటర్స్ కి ఉండే యాంటినాలను అడ్జస్ట్ చేస్తే ఇంటర్నెట్ స్పీడ్ పెరుగుతుంది. వీలైనంత వరకు యాంటినా పైకి ఉండేలా చూడాలి. అక్వేరియం, అద్దాలకు సమీపంలో రూటర్ ను పెట్టవద్దు. ఇవి వైఫై సిగ్నల్స్ ను బలహీనపరిచే అవకాశం ఉంది. ఒకేసారి ఎక్కువ డివైజ్ లు వైఫైకి కనెక్ట్ చేయడం వల్ల కూడా ఇంటర్నెట్ స్పీడ్ తగ్గుతుంది. అవసరంలేని డివైజ్ లను రీమూవ్ చేయండి. అవసరమైన వాటికి మాత్రమే ఇంటర్నెట్ అందేలా సెట్టింగ్ లు పెట్టుకోండి.

రీబూట్

రూటర్‌ను రెగ్యులర్ గా రీస్టార్ట్ లేదా రీబూట్ చేయండి. దీని వల్ల డెడ్ ఇంటర్నెట్‌ను సరిచేయవచ్చు. 2.4-GHz వైఫై రూటర్లలో సమస్యలు ఉంటే, రీబూట్ చేస్తే సెట్ అవుతాయి. 5 GHz వైఫై రూటర్లు వాటికవే ఆటోమేటిక్ గా రీబూట్ చేసుకుంటాయి.

ఆటో-అప్డేట్స్ ఆపేయండి

Advertisement

మీ కంప్యూటర్ లేదా ల్యాప్‌టాప్‌లో ఇంటర్నెట్ నెమ్మదిగా ఉన్నప్పటికీ ఇతర పరికరాల్లో బాగానే ఉన్నట్లు అనిపిస్తుంటే.. టాస్క్ మేనేజర్ లేదా యాక్టివిటీ మానిటర్‌ను ఓపెన్ చేసి ఏ ప్రోగ్రామ్‌లు రన్ అవుతున్నాయో పరిశీలించండి. అవసరం లేని ప్రోగ్రామ్స్ కు ఆటో అప్‌డేట్‌ను నిలిపివేయండి.

Also Read: నెట్‌వర్క్ లేకపోయినా పనిచేస్తుంది.. భారతీయ భాషల AI అసిస్టెంట్‌తో కొత్త ఫోన్, ధర తెలిస్తే షాకౌతారు!

Related News

స్టైలిష్ లుక్..అల్టిమేట్ సౌండ్,యూత్‌ను ఫిదా చేస్తున్న సౌండ్ బార్

పాకెట్ సైజ్ బడ్జెట్ పవర్ బ్యాంక్..రూ.898కే బెస్ట్ మోడల్

నీళ్లు, చెత్తను ఒకేసారి శుభ్రం చేసే..అద్భుతమైన టూల్!

రూ.10వేలకే.. శామ్‌సంగ్ వాషింగ్ మెషీన్,ఆఫర్ కొన్ని రోజులే!

రూ.5,290 ధరకే 30W బేస్ స్మార్ట్ టీవీ..ఇక ఇల్లు దద్దరిల్లిపోవాల్సిందే !

రూ.7,490 కే 7.5 కేజీల కెపాసిటీనా? ఇంతమంచి వాషింగ్ మెషీన్ అస్సలు మిస్సవ్వొద్దు

చార్జింగ్ టెన్షన్ లేదు, లుక్ అద్దిరిపోతుంది.. ఈ ట్రెండింగ్ స్మార్ట్‌వాచ్ మీకోసమే!

రూ.34,999 ధరకే హై-ఎండ్ ఫీచర్లా? ఈ లేటెస్ట్ ఫిలిప్స్ టీవీ అదుర్స్!

Big Stories

Advertisement
×