E-Paper
Advertisement

Under 19 World Cup 2026 Final: నేడే వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్స్..6వ సారి టైటిల్ ఇండియా కొడుతుందా? వ‌ర్షం ప‌డితే ఎలా!

Under 19 World Cup 2026 Final: నేడే వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్స్..6వ సారి టైటిల్ ఇండియా కొడుతుందా? వ‌ర్షం ప‌డితే ఎలా!
Advertisement

Under 19 World Cup 2026 Final: ఐసీసీ అండర్ 19 వన్డే ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ తుదిదశకు వచ్చేసింది. ఇవాళ ఈ టోర్నమెంట్లో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. అండర్ 19 ఇంగ్లాండ్ వర్సెస్ టీమిండియా అండర్ 19 పురుషుల జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ నిర్వహించనున్నారు. హరారే లోని స్పోర్ట్స్ క్లబ్ వేదికగా ఈ రెండు జట్ల మధ్య బిగ్ ఫైట్ నిర్వహిస్తున్నారు. భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ మధ్యాహ్నం ఒంటిగంటకు ప్రారంభమవుతుంది. టాస్ ప్రక్రియ 12:30 తర్వాత ఉండే ఛాన్స్ ఉంది. జియో హాట్ స్టార్, స్టార్ స్పోర్ట్స్ వేదికలుగా ఈ ఫైనల్ మ్యాచ్ చూడవచ్చు.

Also Read:  Ishan Kishan vs Sanju Samson: సంజు వ‌ర్సెస్ ఇషాన్..టీ20 ప్ర‌పంచ క‌ప్ లో ఓపెన‌ర్ గా ఎవ‌రు బెస్ట్ ? ఇదిగో రికార్డులు

ఆరోసారి టీమిండియా టైటిల్ దక్కించుకుంటుందా?

Advertisement

ఐసీసీ అండర్ 19 వన్డే ప్రపంచ కప్ 2026 ఫైనల్ మ్యాచ్ ఇవాళ జరగనుంది. ఈ మ్యాచ్ లో ఇండియా అలాగే ఇంగ్లాండ్ మధ్య ఫైట్ జరగనుంది. అయితే ఇప్పటివరకు టీమిండి అండర్ 19 5 సార్లు టైటిల్ గెలుచుకుంది. 2000, 2008, 2012, 2018 అలాగే 2022 సంవత్సరాలలో టైటిల్ నెగ్గింది అండర్ 19 టీమ్ ఇండియా. అయితే ఈసారి కూడా టైటిల్ గెలిస్తే, ఆరోసారి విజయం సాధించినట్లు అవుతుంది. మరి మాత్రే కెప్టెన్సీలో ఇది సాధ్యమవుతుందా? లేదా అనేది చూడాలి.

ఫైనల్ మ్యాచ్ కు వర్షం పడితే ఎలా ?

ఐసీసీ అండర్ 19 ప్రపంచకప్ 2026 టోర్నమెంట్ లో భాగంగా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య జరిగే ఫైనల్ మ్యాచ్ కు వర్షం అడ్డంకిగా మారితే పరిస్థితులు వేరేలా ఉంటాయి. కచ్చితంగా ఫైనల్ మ్యాచ్ కు రిజర్వుడే ఉంటుంది. అంటే ఫిబ్రవరి 6వ తారీఖున జరగాల్సిన ఫైనల్ మ్యాచ్ ఫిబ్రవరి 7వ తేదీన ఎక్కడ ఆగిందో అక్కడి నుంచి ప్రారంభమవుతుంది. ఇక ఫిబ్రవరి 7వ తేదీన కూడా మ్యాచ్ కొనసాగకుండా పరిస్థితులు ఏర్పడితే అప్పుడు ఇండియానే ఛాంపియన్ అవుతుంది. పాయింట్ల పట్టికలో ఇంగ్లాండ్ కంటే మెరుగ్గా ఇండియా అండర్ 19 జట్టు ఉంది. దీంతో టీమిండియా ఆరవ సారి టైటిల్ గెల్చుకుంటుంది.

టీమిండియా, ఇంగ్లాండ్ జ‌ట్లు
Advertisement

భారత U19 జట్టు: ఆరోన్ జార్జ్, వైభవ్ సూర్యవంశీ, ఆయుష్ మ్హత్రే(c), విహాన్ మల్హోత్రా, వేదాంత్ త్రివేది, అభిజ్ఞాన్ కుందు(w), RS అంబరీష్, కనిష్క్ చౌహాన్, ఖిలాన్ పటేల్, హెనిల్ పటేల్, దీపేష్ దేవేంద్రన్, హర్వంశ్ మోహన్ పంగాలియా, హర్వాన్ష్ మోహన్ పంగాలియా, కిష‌న్‌.

ఇంగ్లాండ్ U19 జట్టు: బెన్ డాకిన్స్, జోసెఫ్ మూర్స్, బెన్ మేయస్, థామస్ రెవ్ (w/c), కాలేబ్ ఫాల్కనర్, రాల్ఫీ ఆల్బర్ట్, ఫర్హాన్ అహ్మద్, సెబాస్టియన్ మోర్గాన్, జేమ్స్ మింటో, మానీ లమ్స్‌డెన్, అలెక్స్ ఫ్రెంచ్, అలెక్స్ గ్రీన్, ఐజాక్ మొహమ్మద్, ల్యూక్ హ్యాండ్స్, విల్ బెన్నిసన్, అలీ ఫరూఖ్.

 

Also Read: MS Dhoni on Ro-Ko: ఎవ‌డెన్ని డ్రామాలు చేసినా, 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ లో Ro-Ko ఆడ‌తారు..గంభీర్ కు ఇచ్చిప‌డేసిన‌ ధోని!

 

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

రెండు మ్యాచ్ ల‌కే గాయ‌ప‌డ్డ బుమ్రాతో వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుస్తారా? గ‌వాస్క‌ర్ సీరియ‌స్‌

2027 వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్..త‌న డ్రీమ్ టీమిండియాను ప్ర‌క‌టించిన ర‌విశాస్త్రి

శ్రీలంక‌లో షాహీన్ అఫ్రిదికి ఘోర అవ‌మానం…ప్రీమియ‌ర్ బౌల‌ర్ కాస్త..మీడియం అయ్యాడు

టీమిండియా చాలా వీక్ గా ఉంది..పాకిస్తాన్ మ‌హిళ‌ల చేతిలో కూడా ఓడిపోవ‌డం ఖాయం!

రోహిత్ శ‌ర్మ‌ కూడా స్లాగ‌రే..గుడ్డిగా బ్యాట్ ఊపితే, వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌లేరు

గంభీర్ ను వెధ‌వ‌ను చేసేందుకు రోహిత్ శ‌ర్మ PR స్టంట్..రిటైర్మెంట్, బొక్కా లేదు

దక్షిణాఫ్రికాలో వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వాలంటే, రోహిత్ శ‌ర్మ ఉండాల్సిందే

Big Stories

Advertisement
×