E-Paper
Advertisement

బిగ్ బడ్జెట్ సినిమాలపై బయ్యర్లు గుబులు.. ‘రాకా’ నుంచి ‘స్పిరిట్’ వరకూ అంతా టెన్షన్..

బిగ్ బడ్జెట్ సినిమాలపై బయ్యర్లు గుబులు.. ‘రాకా’ నుంచి ‘స్పిరిట్’ వరకూ అంతా టెన్షన్..
Advertisement

Pan India Movies: సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు కథ, దర్శకుడు, హీరో కాంబినేషన్‌ను చూసి బిజినెస్ జరిగిపోయేది. కానీ, మారుతున్న కాలంతో పాటు ప్రేక్షకుల అభిరుచులు కూడా మారాయి. ప్రస్తుతం వందల కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న పాన్-ఇండియా సినిమాల విషయంలో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇలాంటి తరుణంలో సోషల్ మీడియాలో సినిమాల ఫస్ట్ లుక్స్, గ్లింప్స్‌లపై వస్తున్న ఫీడ్‌బ్యాక్ ఇప్పుడు ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

Read also-ఓటీటీలోకి ‘ధురంధర్’ అన్‌కట్ వెర్షన్.. సీక్వెల్ వివాదాల నడుమ రేపే స్ట్రీమింగ్!

Advertisement

ఇటీవల కాలంలో భారీ అంచనాలతో అనౌన్స్ అయిన ‘రాకా’ (Raaka), ‘డ్రాగన్’ (Dragon), ‘ఫౌజీ’ (Fauzi), రెబల్ స్టార్ ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో రాబోతున్న ‘స్పిరిట్’ (Spirit) వంటి చిత్రాల ఫస్ట్ లుక్స్ లేదా గ్లింప్స్ అప్‌డేట్స్ వచ్చాయి. అయితే, వీటిపై సినీ విశ్లేషకులు కొందరు ఇండస్ట్రీ బయ్యర్ల నుంచి ఆందోళనకరమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఫస్ట్ లుక్స్ నిరాశపరిచాయా?

సాధారణంగా ఒక సినిమా రేంజ్ ఏంటో డిసైడ్ చేసేది దాని ఫస్ట్ లుక్ లేదా టీజర్ గ్లింప్స్. కానీ, పైన పేర్కొన్న సినిమాల విషయంలో ఇప్పటివరకు వచ్చిన అప్‌డేట్స్ ఏవీ ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో “ఇంప్రెస్” చేయలేకపోయాయనే టాక్ నడుస్తోంది. ప్రమోషనల్ కంటెంట్ చూస్తుంటే ఏదో తేడా కొడుతోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భారీ తారాగణం, క్రేజీ కాంబినేషన్లు ఉన్నప్పటికీ.. ఫస్ట్ ఇంప్రెషన్ మాత్రం స్ట్రాంగ్‌గా పడలేదనేది కొందరి వాదన.

Advertisement

Read also-‘డ్రాగన్’ లుక్ కోసం తారక్ ప్రాణం పెడితే వాళ్లు మాత్రం.. ప్రశాంత్ నీల్ షాకింగ్ కామెంట్స్!

బయ్యర్లకు భారీ నష్టాల ముప్పు!

ఈ రోజుల్లో సినిమా రైట్స్ కొనడం అనేది ఒక జూదంగా మారిపోయింది. ముఖ్యంగా భారీ బడ్జెట్ సినిమాలను ఫస్ట్ లుక్ హడావిడి చూసి, రికార్డు ధరలకు కొనుగోలు చేస్తే.. థియేటర్లలో కంటెంట్ తేడా కొడితే ఊహించని స్థాయిలో నష్టాలు వచ్చే ప్రమాదం ఉంది. ఇటీవల కాలంలో కేవలం హైప్ చూసి కోట్లు కుమ్మరించి, చివరకు డిజాస్టర్లుగా మిగిలిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. అందుకే, ఈ చిత్రాల విషయంలో డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లు అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

“సినిమా బిజినెస్ చేసేటప్పుడు కేవలం క్రేజ్ మాత్రమే కాదు, అందులోని కంటెంట్ వాల్యూ ఏంటో కూడా గమనించాలి. ఒకటికి పదిసార్లు ఆలోచించి, లాభనష్టాల బేరీజు వేసుకున్న తర్వాతే సినిమాలను భారీ రేట్లకు కొనాలి. లేదంటే భారీ నష్టాల బారిన పడక తప్పదు.” అనేది ఇండస్ట్రీ ఇన్‌సైడర్స్ ఇస్తున్న సిన్సియర్ అడ్వైజ్. ఏదేమైనప్పటికీ.. ‘రాకా’, ‘డ్రాగన్’, ‘ఫౌజీ’, ‘స్పిరిట్’ వంటి చిత్రాలపై ట్రేడ్‌లో భారీ బిజినెస్ ఆఫర్లు నడుస్తున్న మాట వాస్తవమే. కానీ, మొదటి అడుగులోనే సరైన ఇంప్రెషన్ ఇవ్వని చిత్రాల విషయంలో బయ్యర్లు గుడ్డిగా వెళ్లకుండా.. కాస్త ఆగి, ఆలోచించి ముందడుగు వేయడమే సేఫ్ జోన్!

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×