E-Paper
Advertisement

ఈ ట్రిక్ తెలిస్తే.. ఏ ఆండ్రాయిడ్ ఫోన్‌నైనా వైర్‌లెస్ ఛార్జింగ్ ఫోన్‌గా మార్చేయొచ్చు, ఎలాగంటే?

ఈ ట్రిక్ తెలిస్తే.. ఏ ఆండ్రాయిడ్ ఫోన్‌నైనా వైర్‌లెస్ ఛార్జింగ్ ఫోన్‌గా మార్చేయొచ్చు, ఎలాగంటే?

Wireless Charging: కొత్తగా మార్కెట్లోకి వచ్చే ఖరీదైన ఐఫోన్లు, శాంసంగ్ ఫోన్లను చూసినప్పుడు ‘అబ్బా.. మన ఫోన్‌కు కూడా ఇలా వైర్‌లెస్ ఛార్జింగ్ ఉంటే ఎంత బాగుంటుందో కదా’ అని చాలామందికి అనిపిస్తుంటుంది. అయితే ఈ ఒక్క ఫీచర్ కోసం వేలకు వేలు పెట్టి కొత్త ఫోన్ కొనాల్సిన అవసరం అస్సలు లేదు. మన దగ్గర ఉన్న పాత ఫోన్‌నే ఒక చిన్న ట్రిక్‌తో వైర్‌లెస్ ఛార్జింగ్ ఫోన్‌గా మార్చేయొచ్చు. దీనికోసం మనకు కావాల్సిందల్లా ఆన్‌లైన్‌లో దొరికే చిన్న ‘వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాచ్’.

ఇదెలా పనిచేస్తుందంటే?

ఈ ఛార్జింగ్ ప్యాచ్ చూడటానికి చాలా పల్చగా, ఒక చిన్న స్టిక్కర్‌లా ఉంటుంది. దీనిలో ఒక చిన్న పిన్ కూడా ఉంటుంది. దాన్ని ఫోన్ ఛార్జింగ్ పోర్ట్ (టైప్-సి లేదా పాత యూఎస్‌బీ)కి కనెక్ట్ చేయాలి. ఆ తర్వాత ఆ ప్యాచ్‌ను ఫోన్ వెనుక వైపున మెల్లగా అతికించేసి, దాని పైన రెగ్యులర్ ఫోన్ కవర్‌ను పెట్టాలి. అంతే.. ఫోన్ లోపల వైర్‌లెస్ ఛార్జింగ్ సిస్టమ్ సెట్ అయిపోయినట్టే. ఇక ఆ వైర్లతో కుస్తీ పట్టే పని లేకుండానే హాయిగా ఛార్జింగ్ చేసుకోవచ్చు.

Also Read: అమ్మో.. ఇంత రేటు తగ్గిందేంట్రా? జస్ట్ రూ.12వేలకే Vivo Y19s 5G ఫోన్ వచ్చేస్తోంది!

వాడటం కూడా చాలా ఈజీ..

ఒక్కసారి ఈ ప్యాచ్ సెట్ చేశాక.. మీరు చేయాల్సిందల్లా మార్కెట్లో దొరికే ఏదైనా ఒక వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్ మీద మీ ఫోన్‌ను పెట్టడమే. వైర్ తగిలించాల్సిన అవసరం లేకుండానే ఫోన్ ఛార్జ్ అవ్వడం చూస్తుంటే షాకింగ్‌గా ఉంటుంది. ఆఫీస్ పనిలో ఉన్నప్పుడు లేదంటే రాత్రి నిద్రపోయే ముందు బెడ్ పక్కన ఫోన్ పెట్టేటప్పుడు పదే పదే వైర్ వెతుక్కునే తలనెప్పి ఉండదు. చూడటానికి కూడా చాలా స్టైలిష్‌గా, ప్రీమియం ఫోన్‌లా కనిపిస్తుంది.

కొనే ముందు ఇవి చెక్ చేసుకోండి..

ఈ వైర్‌లెస్ ప్యాచ్‌లు చాలా తక్కువ ధరకే దొరుకుతాయి కానీ, కొనేటప్పుడు మీ ఫోన్ పిన్ (Type-C ఆ లేక Micro USB నా) సరిగ్గా ఉందో లేదో చూసుకోండి. అయితే వైర్‌తో ఛార్జింగ్ పెట్టినంత స్పీడ్‌గా ఇది ఉండకపోవచ్చు. కొంచెం నిమ్మదిగా ఛార్జ్ అవుతుంది. కానీ సౌకర్యం విషయంలో మాత్రం దీని తర్వాతే ఏదైనా. ఇలాంటి చిన్న చిన్న టెక్ హ్యాక్స్ వాడి మన పాత ఫోన్లనే కొత్తగా మార్చుకోవచ్చు. తక్కువ బడ్జెట్‌లో ఫోన్‌ను అప్‌గ్రేడ్ చేయాలనుకునే వారికి ఈ ఐడియా భలే వర్కౌట్ అవుతుంది.

Also Read: గెలాక్సీ A27 ఫీచర్లు లీక్.. 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో శాంసంగ్ కొత్త ప్లాన్.. ధర ఎంతంటే?

Related News

ఇంట్లోనే జిమ్.. తక్కువ బడ్జెట్‌లో ఫిట్‌నెస్ ఎక్విప్‌మెంట్స్

స్మార్ట్ ఫ్రిజ్ కొంటే.. నిజంగా కరెంట్ బిల్లు తగ్గుతుందా? అసలు నిజాలు ఇవే!

రూ.30వేలలోపు బెస్ట్ విండో ఏసీలు.. వీటితో ఎండలకు బైబై చెప్పేయండి!

బడ్జెట్ రేంజ్‌లో.. హల్‌చల్ చేస్తున్న హైసెన్స్ 100 ఇంచుల టీవీ..

ఆకట్టుకునే 6.3 ఇంచ్ స్క్రీన్, బెస్ట్ కెమెరాతో మోటోరోలా కొత్త ఫోన్..

ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే.. ఫ్రిజ్ రిపేర్ ఖర్చులు మిగిలినట్టే!

మీది చిన్న రూమా? 0.5 టన్ ఏసీ బెస్ట్ భయ్యా.. ఎందుకో మీరే చూడండి!

బడ్జెట్‌లో బెస్ట్ ఎయిర్ ఫ్రైయర్ కావాలా? ట్రెండ్ అవుతున్న టాప్ 3 బ్రాండ్స్!

Big Stories

×