E-Paper
Advertisement

 BAD PEOPLE: పొరపాటున కూడా ఆలాంటి వ్యక్తులను ఇంటికి ఆహ్వానించకూడదట

 BAD PEOPLE: పొరపాటున కూడా ఆలాంటి వ్యక్తులను ఇంటికి ఆహ్వానించకూడదట
Advertisement

BAD PEOPLE: పొరపాటున కూడా కొంత మంది వ్యక్తులను ఇంటికి పిలవకూడదట. వారిని పిలవడం వల్ల మీకే నష్టాలు జరుగుతాయట. వారి వల్ల వచ్చే నెగెటివ్‌ ఎనర్జీ మీకు ఇబ్బందులు కలుగజేస్తుందట. అయితే ఎలాంటి వ్యక్తులకు ఇంటికి పిలవకూడదో శాస్త్రంలో ఏముందో ఇప్పుడు తెలుసుకుందాం.

మన ధర్మశాస్త్రాలు మరియు నీతి శాస్త్రాల (ముఖ్యంగా విదుర నీతి, చాణక్య నీతి) ప్రకారం, ఇంటికి వచ్చే ప్రతి అతిథిని అతిథి దేవోభవ  అని గౌరవించడం మన సంప్రదాయం. అయితే, ఇంటి ప్రశాంతతను, గౌరవాన్ని కాపాడుకోవడానికి కొంతమందిని ఇంటికి ఆహ్వానించకపోవడమే మంచిదని  పెద్దలు సూచిస్తున్నారు. కొన్ని లక్షణాలున్న వ్యక్తులను అసలు ఇంటికి పిలవకూడదట. పొరపాటున పిలిచినా మీరే ఇబ్బందులు పడతారని పండితులు సూచిస్తున్నారే. ఎవరా వ్యక్తులు అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

అసూయ, ద్వేషం ఉన్నవారు: ఎవరైతే మీ ఇంటికి వచ్చి మీ అభివృద్ధిని చూసి ఓర్వలేక, మనసులో ఎప్పుడూ మీ గురించి చెడుగా ఆలోచించే వారు ఉంటారో ఆలాంటి వారిని ఇంటికి అసలు పిలవకూడదు. అలాంటి వారి రాక వల్ల ఇంటి వాతావరణంలో ప్రతికూల శక్తి (Negative Energy) పెరుగుతుందట.

కలహప్రియులు (గొడవలు పెట్టే వారు): ఒకరి మీద ఒకరికి అబద్ధాలు చెప్పి గొడవలు పెట్టే అలవాటు ఉన్నవారిని కూడా ఇంటికి రానివ్వకూడదట. ఆలాంటి వాళ్లు మీ కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్థలు సృష్టించే అవకాశం ఉంటుందట.

Advertisement

వ్యసనపరులు: చెడు అలవాట్లు (మద్యపానం, ధూమపానం,  జూదం లాంటి అలవాట్లు ఉన్నవారు) ఉన్నవారిని ఇంటికి ఆహ్వానిస్తే.. అది ఇంట్లోని పిల్లలపై ప్రభావం చూపడమే కాకుండా.. మీ కుటుంబ గౌరవానికి కూడా భంగం కలిగిస్తుందట. అందుకే వాళ్లను అసలు ఇంటికి ఆహ్వానించకూడదట.

కృతజ్ఞత లేని వారు: మనం ఎంత సహాయం చేసినా.. కనీసం గుర్తింపు లేకుండా ఉండటమే కాకుండా.. వెనుక నుండి మన మీద విమర్శలు చేసేవారిని దూరంగా ఉంచడమే శ్రేయస్కరమని పండితులు సూచిస్తున్నారు.

గర్వం, అహంకారం ఉన్నవారు: తామే గొప్ప అనే అహంకారంతో ఇతరులను కించపరిచే వారిని ఇంటికి పిలిస్తే.. అలాంటి వారు మీ ఆతిథ్యాన్ని గౌరవించకపోగా.. మిమ్మల్ని అవమానించే ప్రయత్నం చేస్తారట. కాబట్టి అలాంటి వారిని కూడా పిలవకూడదట.

ధర్మం లేని వారు: దేవుడి మీద నమ్మకం లేని వారిని.. అలాగే ధర్మ విరుద్ధమైన పనులు చేసేవారిని ఇతరులను ఇబ్బంది పెట్టే మనస్తత్వం ఉన్నవారిని కూడా ఎట్టి పరిస్థితుల్లో ఇంటికి దూరంగా ఉంచాలని నీతి శాస్త్రం చెబుతుందట.

అయితే ఇంటికి వచ్చిన శత్రువుకైనా కనీసం కూర్చోవడానికి ఆసనం, తాగడానికి నీరు ఇవ్వడం మన సంస్కృతి. కానీ, పైన చెప్పిన లక్షణాలు ఉన్నవారిని అతి సన్నిహితంగా ఇంటికి పిలవకపోవడం మంచిదని ఒకవేళ పిలిస్తే.. వారి వల్ల కుటుంబంలో ప్రశాంతత నశిస్తుందని.. నిరంతరం నెగెటివ్‌  ఆలోచనలు ఉన్నవారితో స్నేహం చేయడం వల్ల ఇంటికి అశుభం చేకూరుతుందని  పండితులు సూచిస్తున్నారు.

ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ALSO READ: రాగి ఉంగరం ధరించడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..?

 

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×