UPI Payments No Internet| భారత్‌దేశంలో డిజిటల్ చెల్లింపుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఫోన్‌పే, గూగుల్ పే, పేటిఎం వంటి UPI పేమెంట్స్ ఇప్పుడు రోజువారీ జీవితంలో భాగమైపోయాయి. కిరాణా షాపు, క్యాబ్, చిన్న టిఫిన్ సెంటర్.. ఎక్కడ చూసినా ప్రజలు QR కోడ్ స్కాన్ చేస్తున్నారు. అయితే ఇదంతా ఇంటర్నెట్ ద్వారానే సాధ్యమవుతుంది. ఇంటర్నెట్ లేని ప్రదేశాల్లో డిజిటల్ చెల్లింపులు కష్టమవుతాయి.
ముఖ్యంగా గ్రామాల్లో నెట్‌వర్క్ లేకపోతే పేమెంట్ ఫెయిల్ అవుతుంది. ఇక అలాంటి టెన్షన్ అవసరం లేదు. ఇంటర్నెట్ లేకున్నా యుఎస్ఎస్‌డి కోడ్ తో పేమెంట్ చేసే సౌలభ్యం ఉంది.
*99# అనే సీక్రెట్ కోడ్‌తో ఇంటర్నెట్ లేకుండానే UPI పేమెంట్ చేయొచ్చు! చిన్న కీప్యాడ్ మొబైల్స్ కూడా యుపిఐ చెల్లింపులు చేయొచ్చు.
ఆఫ్ లైన్ యుపిఐ అంటే ఇంటర్నెట్ లేకుండా UPI పేమెంట్ చేయడం. PhonePe, GPay, Paytm లాంటి యాప్స్ కూడా అవసరం లేదు. సాధారణ కీప్యాడ్ ఫోన్‌లో కూడా పని చేస్తుంది. USSD టెక్నాలజీ ద్వారా పని చేస్తుంది. సిగ్నల్ ఉంటే చాలు, డేటా అవసరం లేదు.
పూర్తి ప్రాసెస్‌లో ఒక్క MB డేటా కూడా ఖర్చు కాదు!
నేషనల్ పేమెంట్స్ కమిషన్ ఇండియా (NPCI) నియమాల ప్రకారం:
ఒక ట్రాన్సాక్షన్‌కు గరిష్టంగా రూ.5,000
రోజుకు మొత్తం రూ.5,000 మాత్రమే
చిన్న చిన్న పేమెంట్స్‌కు ఇది సరిపోతుంది. భద్రత కోసం ఈ లిమిట్ పెట్టారు.
ఎస్‌బిఐ, హెచ్‌డిఎఫ్‌సి, ఐసిఐసిఐ, యాక్సిస్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ – దాదాపు అన్ని పెద్ద బ్యాంకులు సపోర్ట్ చేస్తున్నాయి. జియో, ఎయిర్ టెల్, వొడాఫోన్, బిఎస్ఎస్ఎల్ – అన్ని నెట్‌వర్క్‌లలో పని చేస్తుంది. స్మార్ట్‌ఫోన్ లేకపోయినా సాధారణ కీప్యాడ్ ఫోన్‌లో కూడా పని చేస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవాళ్లు సులభంగా డిజిటల్ పేమెంట్స్ చేయగలరు.
ఆఫ్‌లైన్ యుపిఐ 100 శాతం సేఫ్. పేమెంట్స్ కోసం మీరు రెగ్యులర్ UPI PINనే ఉపయోగించాలి. బ్యాంక్ వెరిఫై చేస్తుంది. ఎన్‌క్రిప్టెడ్ చానల్ ద్వారా రిక్వెస్ట్ వెళ్తుంది. ఆన్‌లైన్ UPIలా ఇది కూడా పూర్తిగా సురక్షితమే.
Also Read: సైబర్ దొంగలు మీ డబ్బు దోచుకున్నారా? ఇలా చేస్తే మీ డబ్బు తిరిగి వస్తుంది
ఈ *99# కోడ్‌ను ఇప్పుడే మీ ఫోన్ కాంటాక్ట్స్‌లో “UPI” అని సేవ్ చేసుకోండి. ఎమర్జెన్సీలో ఇది లైఫ్ సేవర్ అవుతుంది. ఇంటర్నెట్ లేకపోయినా డబ్బు పంపడం సాధ్యమే అని ఈ ట్రిక్ మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీకి షేర్ చేయండి.