E-Paper
Advertisement

Online Fraud: సైబర్ దొంగలు మీ డబ్బు దోచుకున్నారా? ఇలా చేస్తే మీ డబ్బు తిరిగి వస్తుంది

Online Fraud: సైబర్ దొంగలు మీ డబ్బు దోచుకున్నారా? ఇలా చేస్తే మీ డబ్బు తిరిగి వస్తుంది
Advertisement

Online Fraud Golden Hour | ఈ రోజుల్లో గూగుల్ పే, ఫోన్ పే, ఇంటర్నెట్ బ్యాంకింగ్ వంటి డిజిటల్ పేమెంట్స్ గణనీయంగా పెరిగాయి. డిజిటల్ లావాదేవీలు చేసేవారి సంఖ్య కోట్లలో ఉన్నారు. అయితే ఇదే స్థాయిలో ఆన్ లైన్ మోసాలు కేసులు కూడా పెరుగుతున్నాయి. సైబర్ మోసగాళ్లు సెకన్ల వ్యవధిలోనే మీ అకౌంట్ ఖాళీ చేస్తారు. మీకు తెలియకుండానే మీ బ్యాంక్ అకౌంట్ నుంచి లక్షల రూపాయలు కనపడకుండా పోతాయి. అయితే ఈ సమస్యకు కొంతవరకు పరిష్కారం ఉంది. మీరు కోల్పోయిన డబ్బు మీకు తిరిగి వచ్చే అవకాశం ఉంది. అదే “గోల్డెన్ అవర్”. గోల్డెన్ అవర్ అంటే మోసం జరిగిన మొదటి 60 నిమిషాల్లోనే మీరు వేగంగా తీసుకునే చర్యలు. మీరు ఎంత స్పీడ్‌గా స్పందిస్తే మీ డబ్బు 90 శాతం తిరిగి వచ్చే ఛాన్స్ ఉంది. ఆలస్యం చేస్తే డబ్బు ఒక అకౌంట్ నుంచి మరొకటి ట్రాన్స్‌ఫర్ అవుతూ చివరికి అదృశ్యమవుతుంది.

ఆన్ లైన్ మోసం జరిగితే వెంటనే ఈ చర్యలు తీసుకోండి

1. వెంటనే మీ బ్యాంక్‌కు ఫోన్ చేయండి
మీరు మోసపోయినట్లు గుర్తించగానే మీరు చేయాల్సిన మొదటి పని.. మీ బ్యాంక్ కస్టమర్ కేర్‌కు ఫోన్ చేయండి. మీ బ్యాంక్ అధికారిక నెంబర్‌కు మాత్రమే కాల్ చేయండి, మోసగాళ్లు చెప్పే నంబర్‌కు కాదు! ఫోన్ చేసి “నా అకౌంట్ నుంచి ఇంత (మోసపోయినంత) మొత్తంలో డబ్బు ఎక్కడికి వెళ్లిందో నాకు తెలియదు. వెంటనే ఆ లావాదేవీని బ్లాక్ చేయాలలి” అని స్పష్టంగా చెప్పండి. బ్యాంక్ వెంటనే ఆ ట్రాన్సాక్షన్‌ను బ్లాక్ చేస్తుంది. మీ డబ్బు మరింత దూరం వెళ్లకుండా ఆపేస్తుంది. ట్రాన్సాక్షన్ టైమ్, అమౌంట్, ఎక్కడికి వెళ్లిందో ఆ సమాచారం అంతా రెడీగా పెట్టుకోండి.

Advertisement

2. 1930 నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయండి
బ్యాంక్‌కు కాల్ చేసిన తర్వాత వెంటనే 1930కి ఫోన్ చేయండి. ఇది దేశవ్యాప్త సైబర్ ఫ్రాడ్ హెల్ప్‌లైన్. ఎక్కడి నుంచి కాల్ చేసినా ఉచితం. మీ ఫిర్యాదు రికార్డ్ అయిపోతుంది. ఈ ఫిర్యాదు ఆటోమాటిక్‌గా సైబర్ పోలీసులకు, మీ బ్యాంక్‌కు వెళ్తుంది. మోసగాడి అకౌంట్‌ను త్వరగా ఫ్రీజ్ చేస్తారు. ఈ రెండు స్టెప్స్ 60 నిమిషాల్లోపే చేయండి!

3. ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేయండి
ఫోన్‌లో ఎవరూ స్పందిచకపోతే.. ఆలస్యం చేయకుండా.. గూగుల్‌లో “cybercrime.gov.in” టైప్ చేసి వెబ్‌సైట్ ఓపెన్ చేయండి. “Report Cyber Crime” ని క్లిక్ చేసి మీ వివరాలు పూర్తి చేయండి. మీ ఫిర్యాదు సమీప సైబర్ పోలీస్ స్టేషన్‌కు, బ్యాంక్‌కు వెళ్తుంది. ఇది చాలా సులభం, 5 నిమిషాల్లో పూర్తవుతుంది.

పోలీసులు, బ్యాంక్ ఎలా సాయం చేస్తారు?

Advertisement

మీ ఫిర్యాదు వచ్చిన వెంటనే బ్యాంక్ మోసగాడి అకౌంట్‌ను గుర్తించి ఫ్రీజ్ చేస్తుంది. డబ్బు మోసగాళ్ల అకౌంట్ లోనే నిలిచిపోతుంది. సైబర్ పోలీసులు ట్రాన్సాక్షన్ ట్రైల్ చేస్తారు. చాలా కేసుల్లో 2-3 రోజుల్లోనే డబ్బు తిరిగి మీ అకౌంట్‌లో పడుతుంది. లక్షల మంది ఇలాగే తమ డబ్బు తిరిగి పొందారు.

మోసం జరగకుండా ఎలా కాపాడుకోవాలి?

  • తెలియని లింక్స్‌పై క్లిక్ చేయొద్దు
  • OTP, PIN ఎవరికీ చెప్పొద్దు
  • “త్వరగా KYC అప్‌డేట్ చేయండి” అని కాల్ వస్తే కట్ చేయండి
  • మీ బ్యాంకింగ్ వివరాలు అప్‌లోడ్ చేయమని చెప్పే యాప్స్ డౌన్‌లోడ్ చేయొద్దు
  • బ్యాంక్ నుంచి కాల్ వచ్చినా ముందు అఫీషియల్ నంబర్‌కు కాల్ చేసి చెక్ చేయండి
  • మోసం జరిగినా భయపడకండి. గోల్డెన్ అవర్ లో వెంటనే స్పందించండి.

60 నిమిషాల్లోపే బ్యాంక్ + 1930కి కాల్ చేయండి. మీ డబ్బు తిరిగి వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ! ఈ సమాచారం మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీకి షేర్ చేయండి.

Also Read: సైబర్ దొంగల గేమ్ ఓవర్.. పవర్‌ఫుల్ యాంటీ ఫ్రాడ్ ఫీచర్ వచ్చేసింది

Related News

అదే జరిగితే.. ఈ నగరాలన్నీ కనుమరుగు? వరద ఎన్ని ‘అంతస్తుల ఎత్తు’లో దూసుకెళ్తుందంటే?

స్టైలిష్ లుక్..అల్టిమేట్ సౌండ్,యూత్‌ను ఫిదా చేస్తున్న సౌండ్ బార్

పాకెట్ సైజ్ బడ్జెట్ పవర్ బ్యాంక్..రూ.898కే బెస్ట్ మోడల్

నీళ్లు, చెత్తను ఒకేసారి శుభ్రం చేసే..అద్భుతమైన టూల్!

రూ.10వేలకే.. శామ్‌సంగ్ వాషింగ్ మెషీన్,ఆఫర్ కొన్ని రోజులే!

రూ.5,290 ధరకే 30W బేస్ స్మార్ట్ టీవీ..ఇక ఇల్లు దద్దరిల్లిపోవాల్సిందే !

రూ.7,490 కే 7.5 కేజీల కెపాసిటీనా? ఇంతమంచి వాషింగ్ మెషీన్ అస్సలు మిస్సవ్వొద్దు

చార్జింగ్ టెన్షన్ లేదు, లుక్ అద్దిరిపోతుంది.. ఈ ట్రెండింగ్ స్మార్ట్‌వాచ్ మీకోసమే!

Big Stories

Advertisement
×